సబ్ ఫీచర్

సృజనాత్మక ఆలోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృజనాత్మకమైన ఆలోచన (క్రియేటివ్ థింకింగ్) అన్నది పాఠశాల విద్య నుంచి విశ్వవిద్యాలయం వరకు అత్యంత కీలకమైంది. నిజానికి దేన్ని ‘సృజనాత్మక విద్య’ అంటారన్నదే అసలు చర్చ. సృజనాత్మకత అంటే నావెల్టీ (కొత్తగా కనిపించాలి), రిలెవన్సీ (సమయస్ఫూర్తిగా) ఉండాలి. కొన్నిసార్లు సృజనాత్మకమైనవి కానివి కూడా స్ఫూర్తిదాయకంగానే వుంటాయి. అవి విద్యా వికాసానికి ఉపయోగపడకపోతే తరగతి గదికి సరిపోదు. తరగతి గదిలో నావెల్టీ అంటే విద్యార్థిలో ప్రేరణ కలిగించే వస్తువుగా ఉండాలి. అది విద్యార్థిలో సృజనాత్మకతను వృద్ధి చేయాలి. కానీ ప్రేరణ అన్నది వ్యక్తికి సంబంధించినది. ఒకరికి ప్రేరణ కల్గించినది మరొకరికి అదే స్థాయిలో ప్రేరణ కల్గించకపోవచ్చును. పూలదండలు గదినిండా అమరిస్తే ఒకరికి ప్రేరణ కలుగవచ్చును. మరో వ్యక్తికి అది ప్రేరణ కల్గించకపోవచ్చును.
ఒక యంత్రాన్ని సృష్టిస్తే ఒకరు చలించిపోతారు. రెండో వ్యక్తిలో అది ఏ రకమైన ప్రభావాన్ని చూపించకపోవచ్చును. షేక్స్‌పియర్ సాహిత్యం తొలి రోజుల్లో ఎవర్నీ చలింపచేయలేదు. అదే సాహిత్యం తర్వాతి రోజుల్లో విస్తృత ప్రచారానికి వచ్చింది. కొన్నిసార్లు సృజనాత్మకమైన కార్యక్రమం అకస్మాత్తుగా కనుక్కోబడే విధంగా వుంటుంది. ఉదాహరణకు క్యాథోడ్ కిరణం ఒక చీకటి గదిలోపల లైటర్ వెలిగించి చేయి అడ్డం పెడితే గోడమీద నీడ పడ్డది. అకస్మాత్తుగా చేతి నీడనే కాకుండా చేయిలో వున్న ఎముకల నీడ కూడా కనిపించింది. అదే ‘ఎక్స్‌రే’గా మారిపోయింది. అదొక చరిత్రాత్మక ఆవిష్కరణగా నిలిచిపోయింది. ఒక వస్తువు సృజనాత్మకమైనదని చెప్పటం కొన్ని అంశాలపై ఆధారపడి వుంటుంది. అది సర్‌ప్రైజింగ్‌గా ఉండాలి. నూతన ఆలోచనలను కలిగించే విధంగా ఉండాలి. దానికి సమాజం ఆమోదం ఉండాలి. సృజనాత్మకమైనది అవునా? కాదా? అన్నది తరగతి గది నిర్ణయిస్తుంది.
ఆశావహ భావనలు..
ప్రతి మనిషికి మెదడులో నెగెటివ్ భావనలు నిత్యం ఉత్పత్తి అవుతాయి. సమాజహితం కోరేది పాజిటివ్ (ఆశావహ) దృక్పథం. సామాజిక మేలును బలహీనపరిచేది నెగెటివ్ ఆలోచనలు. మనిషికి తాను ఉన్న సమాజం నుంచే భావనలు ఉత్పత్తి అవుతాయి. పాజిటివ్ భావాల వలన మనిషి శక్తివంతుడవుతాడు. అందుకే ఘషళ జఒ ఆ్దళ నిశజూళన యచి ఆ్దళ ౄజశజూ అంటారు. అంటే మనిషి ముఖమే అతని ఆలోచనలకు ప్రతీక.
పాజిటివ్ ఐడియాలలో ఆ వ్యక్తి ముఖంలో వర్చస్సు వస్తుంది. అదే నెగెటివ్ ఐడియా అయితే ఆ వ్యక్తి ముఖ వర్చస్సును క్షీణింపజేస్తుంది. ఆ వ్యక్తి ఆలోచనలే క్రియేటివ్ థింకింగ్‌కు మూలం. పాజిటివ్ భావనలైతే క్రియేటివ్ ఐడియాలు వస్తాయి. నెగెటివ్ ఐడియాలైతే సమాజ వినాశనానికి దారితీస్తాయి. పాజిటివ్ ఐడియాలతో మనిషి శక్తివంతుడైతే కొత్త ఆశలు, కొత్త భావాలు ఊరుతుంటాయి. పసిపిల్లలైతే అవి ఎక్కువ సంఖ్యలో సమృద్ధిగా వస్తుంటాయి. దానివలన ఆయా పిల్లల ముఖంపై చురుకుదనం కనిపిస్తుంది. పసిపిల్లల భావాలు కాబట్టి అవి పరిశుద్ధమైనవి. దానికి ఏ గ్రంథ పఠనమూ అవసరం లేదు. అవి ఊట నుంచి వచ్చిన స్వచ్ఛమైన జలాలు. తరగత గదిలో జ్ఞానాన్ని ఉత్పత్తి చేసేది విద్యార్థుల పాజిటివ్ థింకింగ్. దానిని ఉపాధ్యాయులు గ్రంథ పఠనంలో క్రమబద్ధీకరిస్తారు. తరగతి గది రెండు పరిశుద్ధమైన భావనల ప్రతిరూపం. ప్రభుత్వ సిలబస్, స్కూలు వాతావరణం లాంటివన్నీ ఎదుగుదలకు ఉపకరిస్తాయి.

-చుక్కా రామయ్య