సబ్ ఫీచర్

మాదక ద్రవ్యాలను అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయంగా,మత్తు పదార్థాలకు మనదేశం అతి పెద్ద వాణిజ్య కేం ద్రంగా మారింది. గంజాయి, నల్లమందు, గుడుంబా, హెరాయిన్, కొకైన్, చరస్ పేర్లు ఏవైనా వాటికి యువత బానిసలుగా మారిపోతున్నారు. మాదక ద్రవ్యాలు ఉత్పత్తి, క్రయ విక్రయాలు, రవాణా, వాటి వాడకం పెచ్చుమీరి అదో పెద్ద వ్యాపార రంగంగా ఆవిర్భవించి మాదక ద్రవ్యాల మాఫియా దేశంలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతుందంటే ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. మాదక ద్రవ్యాల క్రయ విక్రయాలకు, అక్రమార్జనకు మరిగినవారు ఆత్మరక్షణకో, ప్రత్యర్థులను మట్టుబెట్టడానికో ఆయుధాలు కొనుగోలు చేసి హింసోన్మాదంతో చెరరేగిపోతున్నారు. అగ్రరాజ్యం మొదలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మారుమూల ప్రాంతాల దాకా మాదక ద్రవ్యాల ముఠాలు ప్రమాదకరంగా విస్తరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాల నేరవిభాగం లెక్కల ప్రకారం వినియోగదారుల సంఖ్య కోటానుకోట్లకు ఎకబ్రాకింది. సమితితోపాటు భారత్‌లోని యూపీఏ సర్కారు గత ఎనిమిది సంవత్సరాల క్రితం నిర్వహించిన సర్వేలో దేశంలో మత్తు బానిసలు ఎడున్నర కోట్లపైమాటే అని పేర్కొన్నా, కాలగమనంలో ఇప్పటికే 10 కోట్లకు చేరుకొని ఉంటుందని ఆ రంగ విశే్లషకులు భావిస్తున్నారు.
అంతర్జాతీయంగా హెరాయిన్ వాడకం 340 టన్నులను మించినదని మాదక ద్రవ్యాల ప్రపంచ అధ్యయన నివేదిక (వరల్డ్ డ్రగ్ రిపోర్ట్)లో వెల్లడైంది. భారత్ సహా అమెరికా, మయన్మార్, అఫ్గాన్, టర్కీ, గ్రీస్, బల్గేరియా దేశాల్లో మాదకద్రవ్యాల వినియోగం జోరుగా ఉంది. వీటి బారినపడి యువత వ్యసనానికి బానిసలవడమే కాకుండా, శారీరిక, మానసిక రుగ్మతలకుగురై ఆత్మహత్యలు చేసుకొన్న సంఘటనలు కోకొల్లలు. భారత్‌లోని ప్రతి 20 మందిలో ఒకరు ఆల్కహాల్, ప్రతి 40 మందిలో ఒకరు మత్తు పదార్థాలకు అలవాటుపడుతున్నారనేది అధ్యయన నివేదిక. మద్యాన్ని, మాదక ద్రవ్యాల్ని కలగలిపి తీసుకోవడం అధునాతన ప్రక్రియగా భావిస్తున్నారు. కానీ దీనివల్ల మెదడు, గుండె, జీర్ణాశయం, కాలేయం లాంటి మానవ శరీర భాగాలు దెబ్బతింటాయ. సమాజంలో ఒంటరితనాన్ని భరించలేకనో, కుటుంబ ప్రేమ వ్యవహారాల్లో ఎదురుదెబ్బకు గురైన యువత వివిధ రకాల ఒత్తిళ్లను తట్టుకోలేక మాదక ద్రవ్యాలకు దాసోహమంటోంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, తజికిస్థాన్ వంటి దేశాల్లో మత్తు మందులు నిషేధం ఉన్నా ఆయా దేశాల్లోని 20 కోట్ల మంది యువత మాదక ద్రవ్యాలకు బానిసైనట్టు అంచనా. మాదక ద్రవ్యాలకు పెట్టింది పేరుగా ఉన్న థాయ్‌లాండ్, కంబోడియా, మయన్మార్, మాఫియ వ్యాపార రాజ్యత్రయంగా పేరు మోశాయి. కోట్లాది రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు ఆ దేశాలనుంచే దొంగ దారుల్లో బంగ్లాదేశ్‌కు చేరి, ఆ దేశ సరిహద్దుల నుంచి భారత్‌లోకి మణిపూర్‌కు చేరి, భారత్ మత్తు పదార్థాలకు అతి పెద్ద మార్కెట్‌గా తయారైంది.
రోజురోజుకు మారుతున్న అధునాధునిక జీవన విధానం, అధిక మొత్తాల్లో లభించే ఆదాయం, అన్నింటికంటే స్వతహాగా కల్పిచ్చుకున్న ఈతి బాధలుతో యువత ఈ పెడ మార్గం తొక్కుతోంది. తెలుగు రాష్ట్రాలలో హుక్కా కేంద్రాలు, వ్యాయామ శాలలు, రెస్టారెంట్లు, విద్యాలయాలు, రైతుబజార్లు, ప్రయాణ ప్రాంగణాలు, నగర శివార్లలోని పారిశ్రామికవాడలకు మాదక ద్రవ్యాల వినియోగ భూతం ఆవహించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని వివిధ నగరాలలో, పట్టణాలలో ఈ దుష్ట సంస్కృతి జాడ్యంలా అంటుకొని యువత భవితను దారుణంగా బలిగొంటోంది. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ఆంతాల్లో రైళ్లు, కార్లు, జీపులతోపాటు, టూరిస్టు బస్సుల్లో సైతం మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సాగిపోతోంది. గత కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిర్లిప్తతవల్ల దేశంలో విచ్చలవిడిగా చలామణీ అవుతున్న మాదక ద్రవ్య మాఫియాను భారత్ అడ్డుకట్టవేయలేకపోయింది. యువత భవిష్యత్ నిర్వీర్యమైపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వమైన ఎన్‌డీఏ అయినా చొరవ చొపి మాదక ద్రవ్యాల అక్రమ రవాణను అరికట్టి, దేశ యువత భవిష్యత్తును గుర్తించి వాటి వినియోగాన్ని కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని వెనువెంటనే గుర్తించాల్సిన అవసరం ఉంది.

- దాసరి కృష్ణారెడ్డి