సబ్ ఫీచర్

మనమంతా దేవుళ్ళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్భుతాలు చేసిన, చేస్తున్న, చేయనున్న దేవుళ్ళమైన మనం ఎంతో అభివృద్ధి చెందినవాళ్ళం అని సగర్వంగా చెప్పుకోవచ్చు మన దివ్యతత్త్వాన్ని!
ఇదంతా నాణానికి ఒకవైపు- బొమ్మ! మరి నాణానికి మరొకవైపు బొరుసు!
అది సరిగ్గా దివ్యత్వానికి వ్యతిరేకం! అసురత్వం- రాక్షసత్వం- పైశాచికత్వం!
ఈ లక్షణాలతో మనిషి ప్రకృతిని అతలాకుతలం చేస్తున్నాడు.
కేవలం ఉపాధి కోసం ఆ వృక్షం, ఈ వృక్షం అని కాకుండా తనకు, తన పనులకు, తన నిర్మాణాలకు అడ్డంగా ఉన్నాయని వృక్షాలను నాశనం చేస్తున్నాడు.
భూమి విస్తరణ కోసం అడవులను నరికేస్తున్నాడు. చెరువులను మూసేస్తున్నాడు.
ప్రకృతి వైపరీత్యాలు అమితంగా ప్రకోపించడానికి మనం చేస్తున్న ఘోర తప్పిదాలు
-వృక్షాలను నరకడం, అడవులను నాశనం చేయడం
- జీవనదులను కలుషితం చేయడం, చెరువులు కనపడకుండా చేయడం
- వాహన కాలుష్యం, యంత్ర కాలుష్యం మితిమీరిపోవడం
- కర్బన పదార్థాల వినియోగంపై అదుపు లేకపోవడం
ఇవి కాక వాతావరణ కాలుష్యం పెరగడానికి మరి రెండు ఘోర తప్పిదాలూ చేస్తున్నాం.
అవి-
జీవ హింస మరి మానవ హింస! ఆహారం కోసం, చర్మాలకోసం జలచరాలను, పక్షులను, జంతువులను అమానుషంగా చంపడం! ఎన్నో ధాన్యాలు, అపరాలు, ఖనిజాలు, విటమిన్లు వున్నా, కూరగాయలు, కూరలు, పళ్లు, కాయలు ఉన్నా తృప్తిపడడంలేదు. అమిత అనారోగ్యాన్నిచ్చే మాంసాహారం తిని శరీరాన్ని పాడుచేసుకుంటున్నారు. జీవహింస వల్ల కలిగే నెగెటివ్ వైబ్రేషన్‌వల్ల వాతావరణంలో కలిగే మార్పులవల్ల, జీవకాలపైన అమిత దుష్ప్రభావాలు, బాలల్లో వినూత్న వ్యాధులు ప్రబలడం! ఇదంతా ఒక ఎత్తు- మరి చివరిది మానవ జాతిని మారణహోమానికి గురిచేసే రసాయనిక ఆయుధాలు- రాకెట్ లాంఛర్లు, బాంబులు- వీటిని ఉపయోగించడంవల్ల మనుషులు జంతువులు, పక్షులు, జలచరాలు, అడవులు, వృక్షాలు, పరిసరాలు తీవ్రాతి తీవ్రమైన కాలుష్యానికి గురవుతాయి. నీరు పాడవుతోంది. సముద్రాలు ఉప్పొంగుతాయి.
అతివృష్టి అనావృష్టి పీడిస్తున్నాయి. సునామీలు, భూకంపాలు, పెను తుపానులు, హరికేన్లు ఎన్నో ఇంకా ఎనె్నన్నో! వీటిన్నిటివల్ల ఓజోన్ పొర మరింత విచ్చుకుంటోంది. భూమి మరింత ఇబ్బందికి గురవుతోంది. మనిషి మేధస్సు విస్తరించేకొద్దీ, వికృత చేష్టలు కూడా విజృంభిస్తున్నాయి. అగ్రరాజ్యాల మధ్య చిన్న దేశాలు పావులుగా మారుతున్నాయి. పులి కూడా మనిషికి భయపడుతోంది.
మరి వీటన్నిటికీ పరిష్కారం లేదా? మన గతి ఇంతేనా? ఇలా ప్రకృతి విలయాలతో, మారణాయుధాలతో మానవజాతి, జంతుజాతి, వృక్షజాతి, జలం నాశనం కావలసిందేనా?
ఉంది! తప్పకుండా పరిష్కారం ఉంది! అదే శాంతి- అభయం!
మనుషులందరూ శాంతిని పొందాలి! తద్వారా భయరాహిత్యులు కావాలి!
ఆత్మలోని శాంతమూ- ఆత్మలోని అభయమూ- దాని పేరు మోక్షము!
శాంతి, భయరాహిత్యం పొందే మార్గం మళ్లీ చెప్పుకుందాం - మనమంతా దేవుళ్లం
కొందరం తెలియని దేవుళ్ళం!
కొందరం తెలిసిన దేవుళ్ళం!
*

-మారం శివప్రసాద్ 9618306173, 8309912908