సబ్ ఫీచర్

శుభ్రత తప్పనిసరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగాలు చేసే మహిళలైనా, కొత్తగా కాపురం పెట్టిన కొత్త కోడళ్ళైనా ఇంట్లో తప్పనిసరిగా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. రోజూ క్రమం తప్పకుండా కొన్ని వస్తువులను శుభ్రం చేయాలి. లేకుండా అవి అందర్నీ చికాకు పరుస్తాయి. కొంతమంది ఏ పనైనా వారాంతంలో లేదా ఆదివారం శుభ్రం చేద్దామనుకుని వదిలేస్తుంటారు. ఆ పద్ధతి ఎప్పుడూ సరికాదు. ప్రతిరోజూ శుభ పరచుకోవాల్సిన వస్తువులేమిటో ఒకసారి పరిశీలిద్దాం.
ఎలక్ట్రానిక్ పరికరాలు
అతి ఖరీదైన డీవీడీ ప్లేయర్లు, కంప్యూటర్లు మొదలైనవి ఫెదర్ డస్టర్‌తో ప్రతిరోజూ శుభ్ర పరచడం వల్ల వాడేటప్పుడు ఇనె్ఫక్షన్లు వంటివి దరిచేరవు. రోజూ దులపడం వల్ల సెకన్లలో పని అవుతుంది. అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు పాడవకుండా ఉంటాయి. చాలామంది వారానికొకసారి సోఫాను దులిపితే సరిపోతుంది అనుకుంటారు. కానీ రోజూ మనం హాల్లోనే తిరగాడుతుంటాం కాబట్టి దీనిని రోజూ దులపడమే మంచిది. లేకపోతే లేనిపోని వ్యాధులు రావడమే కాకుండా మనం దానిపై కూర్చోవాలంటే కూడా అసహ్యంగా అనిపిస్తుంది.
వంట గినె్నలు
కొంతమంది వంట వండిన గినె్నలను, తిన్న గినె్నలనూ మరుసటిరోజు పనిమనిషి వచ్చేవరకు అలాగే ఉంచేస్తారు. దీనివల్ల బాక్టీరియా ఆ గినె్నల్లోనూ, తినే కంచాల్లోనూ చేరిపోవడమే కాకుండా అవి కంపు కొడతాయి. అందుకే వంటవండిన, తిన్న కంచాలను త్వరగా అంటే కనీసం పది గంటలలోపే శుభ్రం చేయడం మంచిది. లేకపోతే మొండి బ్యాక్టీరియా కంచాలను ఎంత కడిగినా వదలదు.
కిచెన్ సింక్
ఈ సింక్‌లో వంటపాత్రలను, కూరగాయలను శుభ్ర ం చేస్తాము. కాబట్టి సింక్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. కిచెన్ సింక్‌ను మాత్రము క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండాలి. అలాగే కిచెన్ ఫ్లాట్‌ఫాం, గ్యాస్ స్టవ్‌లను కూడా ప్రతిరోజూ శుభ్రం చేయాలి. అక్కడ ఏమాత్ర ం మురికిపట్టినా, ఏవైనా ఆహారపదార్థాలు పడి అలాగే ఉండిపోయినా తినే ఆహారం సైతం అనారోగ్యకరంగా మారిపోతుంది.
డైనింగ్ టేబుల్
ఇది కూడా క్రమం తప్పకుండా రోజుకు రెండుసార్లు శుభ్రం చేయాలి. ఎందుకంటే మనం తినేది దీనిపైనే అని చెప్పనవసరం లేదు. తిన్న తరువాత దీనిపై ఆహారపదార్థాలు, మరకలు ఎన్నో పడతాయి. వారాంతంలో శుభ్రం చేద్దాములే అనుకుంటే అసహ్యంగా, వాసనగా, మురికి పట్టేసి అక్కడ అపరిశుభ్ర వాతావరణం తయారవుతుంది. కాబట్టి రోజుకు రెండు సార్లు తడి గుడ్డతో తుడవడం వల్ల మరకలు, ఆహారపదార్థాలు తొలగిపోతాయి. వారాంతంలో కాస్త సోపు, సోడా కలిపిన నీళ్ళతో శుభ్రం చేయడం వల్ల మరకలు మాయమై డైనింగ్ టేబుల్ శుభ్రంగా, మనం కూర్చోవడానికి అనువుగా ఉంటుంది. ఇలా ప్రతిరోజూ వాడే వస్తువులను తప్పనిసరిగా రోజువారీగా శుభ్ర ం చేయడం వల్ల ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉంటారు.

-విశ్వ