సబ్ ఫీచర్

మునివాహనుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2700 సంవత్సరముల నాటి వృత్తాంతము
అది కావేరీ తీరం.. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం. శ్రీరంగం వైష్ణవ సంప్రదాయానికి, విష్ణుతత్వ ప్రచోదనానికి మూలస్థానం. శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి కొలువుదీరి యుండగా.. నిత్యార్చనలు, నైవేద్యాలు, ధూప దీపాలు.. సద్భ్రాహ్మణుల వేదఘోషలు.. ఘంటా నినాదాల మధ్య అలరారే ఆ క్షేత్రం ఒక పరమాద్భుతం. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకులైన శ్రీమద్రామానుజులు నడయాడిన పుణ్య దివ్యధామం. ఆళ్వారుల అడుగుల చప్పుళ్ళతో పావనమైన నేల. నారాయణ దివ్యమంత్రం నరకాన్ని సైతం ధిక్కరించే విధంగా మారుమ్రోగే పవిత్రస్థలం. అలాంటి శ్రీరంగంలో పన్నిద్దరు ఆళ్వారుల్లో ప్రసిద్ధుడైన తిరుప్పాణాళ్వారు జన్మించారు. ఆ శ్రీరంగనాథుని దివ్యత్వాన్ని మంగళమూర్తిని వర్ణిస్తూ ఎన్నో పాశురాలు చెప్పిన మహాభక్తుడు. అయితే తిరుప్పాణాళ్వారు దళిత కులంలో జన్మించారు. తండ్రి మాలదాసరి, ఆయన స్ఫూర్తితో భక్తి అతనికి ఆవేశమైంది. అందులోంచి మధురగానం ఆవిర్భవించింది. శ్రీరంగనాయకుడి మీద పాటలు, పాశురాల రూపంలో, పాడుతూ కావేరీ నదీ జలాలను అందులోని జలచరాలను సైతం మైమరిపింజేస్తున్నాడు..
ఒంటరిగా ఆయన చేస్తున్న గానామృతం కావేరీ పరిసర ప్రాంతాలను పరమాద్భుతం చేస్తున్నాయి. అటునుండి వెళ్ళే భక్తులు ఆయన గానంతో భక్తి రసహృదయులు అవుతున్నారు. ఆనందపరశుడై కీర్తనలు ఆలపిస్తున్నాడు. శ్రీరంగనాథుని ప్రధాన అర్చకుడు లోకసారంగముని ఓసారి స్నానానికి వెళ్తూ ‘‘తనకు అడ్డుగా ఈ పంచముడు వస్తాడా? సద్భ్రాహ్మణుడైన నా ముందు కుప్పిగంతులు వేస్తాడా! వేదవేదాంగ పఠనం చేసే నా చెవుల్లోకి ఈ పంచముల పాశురాలు ఎక్కటమా’’ అని ... మహాభక్తుడైన తిరుప్పాణాళ్వారును రాయితో కొట్టేస్తాడు. తిరుప్పాణాళ్వారును గొట్టిన సంతోషంతో లోపలికి వెళ్లి గర్భగుడిలోకి చూస్తే అక్కడ రంగనాథస్వామికి గాయాలున్నాయి. తన భక్తుడైన తిరుప్పాణాళ్వారుని దండించడం వల్ల తాను గాయపడ్డానని, తన భక్తుడిని కొట్టిన దెబ్బలు తనకే తగిలాయని గర్భాలయంలో అశరీరవాణి వినిపిస్తుంది.
సారంగముని దుఃఖితుడవుతాడు. ఎంత ఘోరం! తానెంత తప్పు చేశాడో తెలుసుకున్నాడు.. తిరుప్పాణాళ్వారు వంటి విష్ణ్భుక్తుణ్ణి అవమానపరిచి పాపం మూటకట్టుకొన్నానని ఆవేదన చెందాడు. ‘‘రంగ హృదయంగమమైన అతని పాశురాలను కర్ణకఠోరాలుగా భావించడం ఎంత అమానుషం? అలాంటి మహనీయుణ్ణి దండించడం తీవ్ర నేరం’’ అని మనోవేదన చెందాడు సారంగముని. లోకం తాను గతంలో చేసిన పొరపాటుకన్నా - ఇపుడు చేయబోయే సంస్కరణ సూర్యచంద్రులున్నంతవరకు గుర్తుంచుకోవాలనుకొన్నాడు. తన భుజాలపై తిరుప్పాణాళ్వార్లను ఎక్కించుకున్నాడు. ఆళ్వారు కళ్లు తెరిచి చూసేసరికి శ్రీరంగనాథ ఆలయం ముందున్నాడు. ప్రధాన అర్చకుడే వాహనంగా మారి దళిత భక్తుణ్ణి స్వామి వద్దకు తీసుకెళ్లాడు. ‘‘ఇది ఒక మహాభక్తునికే కాక ఒక వ్యవస్థకు చేసిన అపచారానికి ప్రాయశ్చిత్తం’’ అని లోకసారంగుడు కళ్లవెంబడి నీళ్లు కార్చాడు. ఇలా తన భక్తితో ప్రధాన అర్చకుడైన లోకసారంగమునినే వాహనంగా చేసుకున్న దళిత ఆళ్వారు తిరుప్పాణాళ్వారు. అందుకే ఆయనకు ‘మునివాహనుడు’ అని పేరు. ఆళ్వార్లు పనె్నండుగురు రచించిన ప్రబంధాలు ‘ద్రావిడవేదం’ అనీ, నాలాయిర ప్రబంధం అని అంటారు. అందులో మొత్తం 4000 పాశురాలు ఉన్నాయి. అందులో తిరుప్పాణాళ్వారు రచించిన 10 పాశురాలను ‘అమలనాదిపిరాన్’ అని పిలుస్తారు. అంటరానితనానికి భక్తితో సవాల్ విసిరిన మహనీయుడు తిరుప్పాణాళ్వారు చరిత్ర గుర్తుంచుకోదగ్గ మహాపురుషుడు. అలాగే ఆలస్యంగానైనా కళ్లు తెరచిన సారంగముని గొప్ప పని చేసి సిద్ధపురుషడయ్యాడు.
*