సబ్ ఫీచర్

ఎరుక- కరుణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుద్ధుడు ఇలా బోధించేవాడు.
‘ఎరుక’ అనే దీపాన్ని మీ హృదయంలో వెలిగించండి. ఆ వెంటనే మీ ఉనికి (ఎగ్జిస్టెన్స్) పూర్తిగా కరుణను విరజిమ్ముతూ శోభిస్తుంది. కరుణ మీలో పెల్లుబుకడమే ఎరుక మీలో సుప్రతిష్ఠితమైంది అనేందుకు ఋజువు. ధ్యానంలో స్థితమైన తర్వాత కరుణ మీలో ఉదయించకపోతే మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నట్లు తెలుసుకొంది. మీరు ధ్యానం చేయకుండా మరేదో చేస్తున్నారని అర్థం. ఎరుకతో ఉండేందుకు బదులు మరేదాన్నో మీరు చేస్తున్నారనే అర్థం.
ఎరుక అనేది అమనస్కపు సహజస్థితి
అన్నింటినీ ప్రతిబింబిస్తున్న అద్దంలాగే మీరుంటారు ఆ ఎరుక స్థితిలో. అన్నింటినీ ప్రతిధ్వనించే విధంగానే మీరుంటారు. అందులో ఉన్న సౌందర్యాన్ని నిశ్శబ్దాన్ని, నిశ్చలత్వాన్ని దర్శించి ముగ్ధులుకండి. ఓ అద్భుతం జరగడం ప్రారంభమవుతుంది. ఆ నిశ్శబ్దంలో ‘కరుణ’ అన్నది మీకు అనుభవంలోకి వస్తుంది. బాధపడుతున్న సర్వ జీవరాసులమీద ‘దయాభావం’ అది. ఆ కరుణను మీరు ప్రత్యేకంగా ఏ మాత్రం అభ్యసించవలసిన అవసరం లేదు. తనంతట తానే కరుణ మీకు సంప్రాప్తమవుతుంది. ఎరుకవల్లనే కరుణ ఉదయిస్తుంది.
ఎరుక లేనివాడు కోపగిస్తాడు. మీకు కోపం వచ్చినపుడు ఆ కోపంతోనూ, ఎరుకతోనూ కలిసి ఉండే ప్రయత్నం చేసి చూడండి. ఆ రెండూ ఏకకాలంలో కలిసి వుండడం అసంభవమని మీకే అర్థం అవుతుంది. ఎరుక మీలో వుంటే కోపం మీకుండదు. కోపంలో మీరుంటే ఎరుక మీ నుంచి మాయమైపోయి వుంటుంది. కోపాన్నీ, ఎరుకనూ ఏకకాలంలో సిద్ధించుకున్న వాళ్ళెవరూ లేరు.మిమ్మల్ని మీరు పరీక్షించి చూసుకోండి- కోపం, ఎరుకా రెండూ మీకున్నట్లు అనిపించవచ్చు. కానీ జాగ్రత్తగా గమనించి చూస్తే విషయం మీకే అర్థమయి తీరుతుంది.ఎరుక మీలో వున్నపుడు కోపం మీలో వుండడం అసంభవం. ఎందుకంటే మీరు ఎరుకలో వున్నపుడు మీలో ప్రజ్ఞ సుస్థితమై వుంటుంది. తనకోపమే తనశత్రువు తన శాంతమే తనకు రక్ష- దయ చుట్టంబౌ అనే స్థితి అది. అదే మనం ఆగ్రహంలో అంటే కోపస్థితిలో వున్నాం అనుకోండి. ఆ ఆవేశ స్థితిలో ఎరుక వుండదు. ఇతరుల మీద చిందులు వేయడమే వుంటుంది. కోపావేశాల్లో మీరున్నపుడు ఎరుక సంప్రాప్తించే అవకాశమే వుండదు అంటే ఇదే.
ఎరుక ఉండకపోవడమే అన్ని జబ్బులకూ మూలం
కాబట్టి ఎరుకలో వుండడమే అన్ని జబ్బులకూ పనికివచ్చే దివ్య ఔషధం!నేనో వైద్యుడిని అనేవాడు గౌతమబుద్ధుడు. ఒకరు ప్రశ్నించారు బుద్ధుడిని- ఓ వైద్యుడిని నేనేనని ఎన్నోసార్లు చెపుతూ ఉంటారు మీరు! అయితే మీ వద్ద ఏ ఔషధాలూ ఉన్నట్లు అనిపించడంలేదు.
మీరు ఏ ఔషధాలను అందిస్తున్నారో చెపుతారా?
బుద్ధుడిలా జవాబిచ్చాడు-
నా వద్ద ఉన్న ఔషధం ఎరుక.
ఎరుక అనే ఆ దివ్యౌషధానే్న నేను అందరికీ బోధిస్తున్నాను, అందిస్తున్నాను. ఆ ఔషధాన్ని మీరు ఎక్కడా కనుక్కోలేరు! మీ అంతఃరసాయనాన్ని కాస్త మార్చుకుంటే చాలు- ఆ ఔషధం మీలోనే ఏర్పడుతుంది. ప్రస్తుతం మీ అంతఃరసాయనం పరధ్యాన దిశలో పనిచేస్తోంది. మీలో స్పృహ ఏర్పడే దిశలో అది పనిచేయడం లేదు. ఆ పరిస్థితిని మీరు మార్చుకుని, ఇప్పటివరకూ యాంత్రికంగా సాగుతూ వున్న ఆ పరిస్థితిని మీ అదుపులోకి మీరు తెచ్చుకోవచ్చు- చక్కగా ధ్యానం చేసి! ఎరుకను పెంచుకోవడం అనే దీక్షను ఆ ఒకే ఒక్క దీక్షను అవలంభిస్తే, ఆచరిస్తే చాలు-
అన్ని పొరపాట్లనూ సవరించుకోవచ్చు.
అయితే ఆ ఎరుక మనలో సిద్ధించిందని ఎలా తెలుసుకోవడం? ఎరుక అనేది అంతరానికి సంబంధించింది. అంతరంలో ఎంతో లోతులో వున్న ఆ ఎరుకను దర్శించడం ఎవ్వరికీ కుదిరే పని కాదు. అయినా కొంచెం కొంచెం అభ్యాసంతో ఎరుకతో వుంటే, ఏ మాత్రం తెలివైనవరికైనా, ఏ మాత్రం దృష్టి వున్నవారికైనా ఆ ‘ఎరుక’ యొక్క అవగాహన కలిగేతీరుతుంది. ఎలాగంటే ఎరుక మీ అంతరంలో సంభవించడంతో, కరుణ మీలో ఉప్పొంగి ప్రవహిస్తూ వుంటుంది. ప్రేమ, మైత్రి మీలో పెల్లుబికి ప్రసరిస్తాయి.

-మారం శివప్రసాద్ 9618306173, 8309912908