సబ్ ఫీచర్

అక్షయ ఫలాల పర్వదినం అక్షయ తృతీయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందువుల పర్వదినాలలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించకున్నది అక్షయ తృతీయ. వైశాఖ శుద్ద తృతీయనాడు చేసే దానాలు, దేవతల, పితృదేవతల గురించి చేసే పూజలు అక్షయ ఫలాన్ని ఇస్తాయని ప్రాచీన గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. తీర్థస్నానం, తిలలతో పితృ తర్పణం, ఘటదానం, దైవ పూజలు ఈదినాన చేయడం అనాదిగా ఆచరణలో ఉంది. నదీస్నానం, దానం, తపం, శ్రాద్దం, హోమం చేయాలని వ్రత గ్రంథాలలో ఉంది. అక్షయ తృతీయనాడు పెరుగుఅన్నం, విసనకర్రలు, గొడుగులు, పాదుకలు, చెప్పులు, ఉదకుంభం మున్నగు వాటిని దానం చేయాలని చెప్పబడింది. ఎండలు మెండుగా ఉండే వైశాఖమాసంలో కుండల్లో జాగ్రత్తగా పెట్టిన నీటిని త్రాగితే దాహ శాంతికరంగా ఉండగలదని మత పెద్దల నిర్ణయానుసారం నీటితో నిండిన కుండలను (ఉదకుంభ)దానం చేయడం ఆచారంగా మారింది.
ఈరోజున విష్ణుపూజను లక్ష్మీనారాయణుని రూపంలో చేయాలని పురుషార్థ చింతామణియందు పేర్కొనబడింది. గౌరీ పూజ, త్రిలోచన గౌరీ వ్రతం పేరున పూజ చేయడం కొన్ని ప్రాంతాలలో, ఆలయాలలో ఆచారంగా ఉంది. ఆహవనీయ, గార్హపత్య, దక్షిణములు అనబడే త్రేతాగ్నులను పూజించిన కాలమగు 196వేల మానవ సంవత్సరాల ‘‘త్రేతాయుగానికి ఇది తొలి రోజు’’గా, యుగాదిగా భావించబడుతున్నది. వైశాఖ శుద్ద తదియ ‘‘బలరామ జయంతి’’గా పంచాంగాలు పేర్కొంటున్నాయి. తాటిచెట్టును కేతనం మీద నిలుపుకుని, తమకు ప్రధాన సాధనమైన నాగలిని ఆయుధంగా కలిగి, తమను హర్షకులుగా చేసిన బలరాముని జయంతి దినమైన అక్షయ తదియ తెలుగునాట కర్షకుల కార్యకలాపాలకు ముఖ్యదినంగా మారింది.
అందుకే ఈ ప్రాంత కర్షకులు తమ పొలాలలో, గృహస్తులు తమ పెరళ్ళలో ఈరోజున కూరపాదులు కట్టడం కూడా సనాతన ఆచారంగా మారింది. మహాలక్ష్మికి ప్రీతిపాత్రమైన అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేసి, దాచి ఉంచితే, సంపద ఇతోధికంగా వృద్ధి కాగలదనే విశ్వాసంతో అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం సాంప్రదాయంగా ఆచరించబడుతున్నది. అక్షయ తృతీయ సోమ లేదా బుధవారాలలో అయితే విశిష్టమని కృత్తిక, రోహిణీ నక్షత్రముతో కూడి ఉన్నదయితే పర్వం అతి ప్రశస్తమని భావన. ఈనాడు నదీ స్నానం సకల పాప విమోచకరమని, ఒకపూటే భోజనం చేయాలని భక్తుల విశ్వాసం. లక్ష్మీ సహిత నారాయణుని, గౌరీ సహిత త్రిలోచనుని పూజించడం శ్రేష్ఠతరంగా చెప్పబడింది. పూజా సమయాన విసనకర్రలు, లడ్డూలు పంచిపెడితే వైకుంఠాన్ని, శివలోకాన్ని పొందగలరని శాస్త్ర వచనం. ఈనాటి విధాయక కృత్యాలలో లక్ష్మీనారాయణుని పూజ, గౌరీ శంకరుల పూజ, త్రేతాయుగాది, బలరామ జయంతి, బసవేశ్వర జయంతి, సింహాచల క్షేత్ర వరాహ నృసింహుని చందనోత్సవ వేడుకలు ప్రధానమైనవి.

-సంగనభట్ల రామకిష్టయ్య....9440595494