సబ్ ఫీచర్

అటు ఆదాయం.. ఇటు సంతృప్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనపనార బట్టతో అందమైన కళాకృతులు తయారుచేయడం నేటి యువతులకు చక్కని ఉపాధి. పూర్వకాలంనుంచి జనపనార ను గురుకులాల్లోను, సన్యాసాశ్రమాల్లోను వీటి వాడేవారని తెలుస్తుంది. ఇపుడు ఈ జనపనారతో వస్తువుల తయారీకి ప్రత్యేక శిక్షణా తరగతులు మహిళా సాధికారత విభాగమువారు శ్రద్ధగా నేర్పిస్తున్నారు. ప్రభుత్వంవారు కూడా దీనిని ప్రోత్సహిస్తున్నారు. ఇందులో బ్యాగ్‌లు తయారుచేసే కుట్టే విధానం నేర్పిస్తారు. దీనికి కాటన్, సిల్కు, జ్యూట్ బట్ట వాడుతారు. ఇందులో రకరకాల రంగులు, ప్లెయిన్‌వి ప్రింటెడ్‌వి కూడా ఉంటాయి. సాధారణ జనపనార బట్ట ముతకదానిపై కలంకారీ బట్ట, శాటిన్, బెనారస్, ఖాదీ పట్టులను వాడి ఈ బ్యాగ్‌లు చేస్తారు.
ప్లాస్టిక్ కవర్‌ల వాడకం పర్యావరణ పరిరక్షణకు హానికరంవల్ల కనుక వాటిస్థానంలో ఈ పేపర్ జ్యూట్ బ్యాగ్స్ వాడకంపెరిగితే పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు. వాతావరణాన్ని కలుషితం కాకుండా చూసుకోవచ్చు. ఈజ్యూట్ తో పిల్లలకి పెన్సిల్ బాక్స్‌లు, లంచ్ బ్యాగ్‌లు, సెల్‌ఫోన్ పౌచ్‌లు, క్యారీ బ్యాగ్స్, స్కూల్స్ బ్యాగ్‌లు ఇలా ఎన్నో రకాల వస్తువుల తయారీ వుంది. మెత్తనిది, సున్నితమైనది, గరుకుది- మూడు రకాల జనపనార వస్త్రాలు దొరుకుతాయి. దుమ్ము, ధూళి అంటవు. దులిపితే చాలు ఏదైనాధూళి ఉంటే పోతుంది.
* * *
అర్చన చదువుకున్న అమ్మాయ. అర్చన బ్యూటిషియన్, ఈవెంట్ మేనేజర్, జర్నలిజమ్ చేసింది. స్వశక్తిమీద స్ర్తిలు ఎదగాలి, తాను పది మందికి ఆదర్శం కావాలనే సంకల్పంతో తనకున్న వెసలుబాటు సమయంలో ఈ ఉపాధి నెంచుకుని తనలాగా కష్టపడే వారికి నేర్పిస్తోంది. ఇపుడు అర్చన తనతో పాటుగా మరో ఐదుగురు గృహిణిలకి ఈ బ్యాగ్‌లు కుట్టే విధానము నేర్పి, ఒక గ్రూప్‌గా ఉండి ఈ బిజినెస్ నిర్వహిస్తోంది. ఇంట 5 మిషన్‌లు ఉంచి, వాటిపైన తను, తనస్నేహితులతో కలసి బ్యాగ్‌లు కుట్టిస్తుంది. దీనికి ముతక సూది ఉన్న మిషన్‌లుంటాయి. ఈ సూదులు, మిషన్‌లు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ జనపనార బ్యాగ్స్ పట్ల మక్కువతో వేసవిలో కాలేజీ అమ్మాయలు కూడా వచ్చి శిక్షణ పొందడానికి ముందుకు వస్తున్నారు. మామూలు గుడ్డ బ్యాగ్‌ల కన్నా చూడడానికి , వాడడానికి ఈ జ్యూట్ బ్యాగ్‌లు బాగుంటాయ. అయితే ఉపాధి రంగంలో ఈ జనపనారతో విన్నూత్నమైన సృజనతో ఎన్నో వస్తువులను తయారు చేసే వీలుంది. కనుక ఈ జనపనార బ్యాగ్‌లతో ఉపాధిమార్గంగా కూడా రూపొందించుకోవచ్చు. ఉద్యోగినులు ఈ ఉపాధిని కలిగించుకొంటే తోటి ఉద్యోగినుల సహకారంలో పెళ్ళిళ్ళకి అందమైన కళావస్తువులు, లంచ్ కిట్స్, స్కూలు బ్యాగ్స్ ఇలాంటి వాటిని తయారు చేసి వారికివచ్చు. వీటికి మార్కెటింగు వౌఖికంగానే చేసుకొంటూ ముందుకు పోవచ్చు. కొంతమంది రిటర్న్ గిఫ్ట్స్‌గా వీటిని ఇస్తున్నారు. డైనింగ్ టేబుల్ మ్యాట్స్, ఫుడ్ మ్యాట్స్, ఎండాకాలం కర్టెన్స్‌గా కూడా ఈ జనపనారను ఉపయోగించే వీలుంది. వట్టివేళ్లలాగా ఈ జనపనారను నీళ్ళు చల్లి తడిపి చల్లదనం కోసం వాడటానికి పనికివస్తున్నాయ.
డిజైన్ వర్క్స్:
జనపనారతో చేసిన బ్యాగ్స్ ఇతర వస్తువులపై అదనపు ఆకర్షణగా ఊలు, ఎంబ్రాయిడరీతో క్రాస్టిచ్, గొలుసు ముద్ద, కాడ కుడతారు. ఫ్యాబ్రిక్ పెయింటింగ్, సీనరీస్, వీణలు, బొమ్మలు, గ్లిట్టర్ వర్క్స్ చెయ్యవచ్చును. కలంకారీ, బెనారస్, పట్టు, శాటిన్ క్లాత్‌లను ఉపయోగిస్తూ అందంగా తయారు చేస్తారు. అవేకాక -చెకీ లేసులు, అద్దాలు, బిళ్ళలు, పూసలు అతికించవచ్చు.- స్టిక్కర్స్ అతికించవచ్చు. ఇలా రకరకాలుగా ఆర్ట్‌వర్క్‌తో అలంకరించడం వల్ల మరింత అందంగా ఈ జనపనార బ్యాగులు అందరినీ ఆకర్షించేలా చేయవచ్చు. జనప నారతో బట్టలు, తట్టలు, పళ్ళాలు, డైనింగ్ టేబుల్ మ్యాట్స్ కూడా అల్లుతారు.

-- వాణిప్రభాకరి