సబ్ ఫీచర్

కోమలులారా కదలండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలకంఠి కంట కన్నీరొలికిన ఇంట సిరి ఉండనొల్లదన్నారు. లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వాలంటే గృహలక్ష్మి సంతోషంగా ఉండాలన్నారు. కాని నేడు స్ర్తిలంతా కన్నీరుకు చిరునామాలుగా మారుతున్నారు. అసలే స్ర్తిలు సున్నిత మనస్కులు. సీరియల్ చూసో, సినిమాలో ఏడుపు సీనో చూస్తేనే వీళ్లు కన్నీళ్లు పెట్టుకొంటారు. ఏ చిన్న విషయానికైనా కన్నీళ్లు కారుస్తుంటారు. తీవ్రంగా స్పందించడం ఆడవారికి సహజం. కాని నేటి పరిస్థితులు కన్నీళ్లు పెట్టుకుంటే సమసిపోయేవి కావు. కత్తులు ఝళింపించాల్సిన అవసరం వచ్చింది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాల్సిన అఘత్యం ఏర్పడింది. హృదయాల్ని కదిలించి అట్టడుగున అణగారి పోతున్న మృగాళ్ల ల్లోని మానవత్వాన్ని వెలికి తీయాల్సిన తరుణం వచ్చింది. ఆడాళ్లంతా కలసి చర్చావేదికలను ఏర్పాటు చేసుకోవాలి. మృగాళ్లు ఎందుకు తయారౌతున్నారో పసిగట్టాలి. వారిని ఆదిలోనే తుంచేయ్యాలి. లేకపోతే నేడు బహుళ అంతస్థుల నగరాల్లో కుదురుకుంటున్న జనారణ్యాలన్నీ మనిషి ముసుగేసుకొన్న రాక్షసులతో నిండిపోతాయి.ఇలాగే సాగితే ప్రళయం వస్తుంది. సృష్టి ఆగిపోతుంది. అందుకే కదలిరండి కోమలులారా . పదం పదం కలిపి కదం తొక్కి అరాచకాలు సృష్టించే పైశాచకత్వానికి భరతవాక్యం పలుకుదాం.

-జి. కల్యాణి