సబ్ ఫీచర్

విభజించి పాలిస్తున్న ప్రజాస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలాకాలం క్రితం అనగా సుమారు ఏభై ఏళ్ల క్రితం పల్లెలలో అస్పృశ్యత స్వల్పంగా ఉండేది. పట్టణాలలో అస్పృశ్యత అనే సమస్య లేదు. ఇప్పుడు పల్లెలలో కూడా దళితులు వివిధ వృత్తులు నేర్చుకుంటున్నారు. ఆయా పనులు చేయడానికి వారు అగ్రవర్ణాల వారి ఇళ్లలోకి వస్తున్నారు. పల్లెటూళ్లలో ఎవరిది ఏ కులమో, సులువుగా తెలుస్తుంది. అందువలన వారు దేవాలయాలలోకి రావడం లేదు. వచ్చినా ఎవరూ అభ్యంతరం చెప్పరు. అది ఒక మర్యాదగానో ఆచారంగానో వారు పాటిస్తున్నారు. వారు నివసించే ప్రాంతంలో రామాలయాలున్నాయి. తిరుపతి, శ్రీశైలం వంటి ప్రముఖ దేవాలయాలలోకి వారు స్వేచ్ఛగా వెళ్లవచ్చు. వివిధ పీఠాధిపతులు అస్పృశ్యతను ఖండించారు. కాని ప్రభుత్వానికి ఇంకా ఈ సమస్య అవసరం. అది ఒక ఓటు బ్యాంకు.
కొద్ది కాలం క్రితం పిల్లల పాఠ్యపుస్తకాలపై ‘అంటరానితనం నేరం’ అని ప్రచురించారు. పిల్లలకు అంటరానితనం అంటే ఏం తెలుస్తుంది? పూనాలో గల ప్రసిద్ధ రామాలయంలోకి అంబేద్కర్‌ను నాటి పూజారులు రానీయలేదు. నేటి పూజారులు దళితులు ప్రవేశించడానికి ఏ విధమైన ఆటంకం కలిగించడం లేదు. ఇందులో మొదటిది వార్త. రెండవది ఇంగ్లీషులో చెబుతే గాని తెలియదు. అనగా న్యూస్ వాల్యూలేనిది మరొక సంఘటన. కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో జగ్జీవన్‌రామ్ చదువుకునే రోజుల్లో హాస్టల్ పనివారు ఆయన వాడిన పాత్రలు శుభ్రం చేసేవారు కాదు. విశ్వవిద్యాలయ స్థాపకుడు వేద పండితుడు అయిన మదన్‌మోహన్ మాలవ్యాకి ఈ విషయం తెలిసి హాస్టలుకు వచ్చి అతని పాత్రలు శుభ్రం చేయగా పనివారు సిగ్గుపడి నాటినుండి ఆయన పాత్రలు యధావిధిగా శుభ్రం చేశారు. ఇందులో కూడా మొదటిది వార్త. రెండవది విలువలేని వార్త.
గీతలో చాతుర్వర్ణ వ్యవస్థ ప్రస్తావన ఉంది. దానికి సరియైన అర్థం తెలుసుకోకుండా అది కుల వ్యవస్థను ప్రోత్సహించింది అనుకుంటారు. గీత చెప్పినది శ్రీకృష్ణుడు. అతడే యాదవుడు. అనగా నేటి మన లెక్కల ప్రకారం వెనుకబడిన కులానికి చెందినవాడు. మనుస్మృతిని తగులబెట్టడం వలన ప్రయోజనం ఏమిటి? పంచాంగం చింపివేస్తే నక్షత్రాలు మాయం అయిపోతాయా? మనువు క్షత్రియుడు. మన లెక్కలకు అందని కాలంలో నాటి సమాజ పరిస్థితులనుబట్టి కొన్ని శాసనాలు చేశాడు. అవి చాలావరకు ఇప్పుడు అమలులో లేవు. ఇస్లాం మతస్థుల ఆచార ప్రకారం స్ర్తిలు మసీదులోకి వెళ్లి ప్రార్థన చేయకూడదు. వారు కొన్ని నియమాలు పాటిస్తూ ఇంటిలోనే చేయాలి. ఇది ఏదో పురాతన ఆచారం అని స్ర్తిలు మసీదులలోకి వెళతారా? అందుకు మత పెద్దలు అంగీకరిస్తారా? ప్రభుత్వం అన్యమతాల విషయంలో పల్లెత్తు మాట అనలేదు. అలా అంటే రాబోయే పరిణామాలు తెలుసు. హైందవాచారాలను గురించి ఎలా మాట్లాడినా మాట్లాడవచ్చు. కుల మత వర్గ ద్వేషాలు పెంచి పోషించి పబ్బం గడుపుకోవడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది.
ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధ చట్టం ఎందుకు? కులం మతం పేర్లతో ఎవ్వరినీ నిందించకూడదు. అది ఎవరు చేసినా నేరమే. ఎస్‌సి, ఎస్‌టిలవారు అగ్రవర్ణాలను కులం పేరుతో దూషిస్తే నేరం కాదా? కాదు. ఇలాంటి చట్టాలు లేనిపోని ద్వేషాలు పెంచుతున్నాయి. వీటిని రాజకీయ నాయకులు స్వార్థానికి వాడుకుంటున్నారు. దేశవ్యాప్తంగా వివిధ వర్గాలవారు రిజర్వేషన్లకోసం అలజడులు జరుపుతున్నారు. ఇవి హింసాత్మకంగా మారి ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్తులకు విపరీత నష్టం వాటిల్లుతోంది. ఇలాంటి అరాచకాలు జరిపే వారిపై ప్రభుత్వం తీసుకునే చర్యలు శూన్యం. చర్యలు తీసుకుంటే ఓట్లు పోతాయి. న్యాయస్థానాలు ఈ విషయంలో వౌనం వహిస్తాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా వీటిని ఖండించవు. దానికి కారణం వారు ముందు ముందు అధికారంలోకి వస్తే ఇలాంటి అలజడులకి అవకాశం ఇవ్వాలి.
ప్రభుత్వానికి కావలసినా ఇంకొక ముఖ్య విషయం ఉంది. అది దారిద్య్రం. ఈ సమస్య ఇప్పుడు చాలవరకు తగ్గిపోయింది. గుప్పెడు బియ్యం వేద్దామనుకుంటే బిక్షాటనకు వచ్చేవారు లేరు. ఇంటిలో వండుకున్న పదార్థాలు మిగిలిపోతే తీసుకువెళ్లేవారు లేరు. తెల్లరేషను కార్డులు ఉన్న వారికి మోటారు సైకిళ్లు, ఫ్రిజ్‌లు, టి.విలు, ఇన్వర్టర్లు ఉన్నాయి. పొలాలు స్వంత ఇళ్లు ఆర్జన పరులైన కుమారులు ఉన్నా వారికి పెన్షన్లు ఇస్తున్నారు. అర్హులందరికి రేషనుకార్డులు పెన్షన్లు ఇస్తామని ప్రకటిస్తారు. అనర్హులు పొందే సదుపాయాలు తొలగిస్తామని చెప్పరు. అలా చేస్తే ఓట్లు పోతాయి. దేశ భక్తి చాటి చెప్పేవారికి లాఠీ దెబ్బలు. దేశంపై ద్వేషం పెంచుకున్న వారికి పోలీసు రక్షణ కవచాలు. ఇది కూడా ఓటు బ్యాంకు అవడం దురదృష్టం.
షెడ్యూలు కులాల పిల్లలకు స్పెషల్ కోచింగులు. వెనుకబడ్డ వర్గాల వారి పిల్లలకు స్పెషల్ కోచింగులు. ఇటీవల వివిధ అగ్రవర్ణాలవారు కూడా ప్రభుత్వ నిధులు పొంది వారి పిల్లలకు రాయితీలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం అందరి కోరికలకు సానుకూలంగానే స్పందిస్తుంది. ఇలా ఎంతకాలం? ప్రైవేటు సంస్థలలో కూడా రిజర్వేషన్లు కావాలంటున్నారు. అంగవికలురకు రిజర్వేషన్లు ఆటలలో ప్రతిభ కనపరచిన వారికి రిజర్వేషన్లు. ఇవికాక కారుణ్య నియామకాలు. కొందరు దొంగ కుల సర్ట్ఫికెట్లతో ఉద్యోగాలు పొందుతున్నారు. ఇప్పుడు మైనారిటీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఆలోచన జరుగుతున్నది. మైనారిటీ అనే పదం తొలగించాలి. ప్రజలను వర్గాలుగా విభజించడం దేశ సమైక్యతకి తీవ్ర ఆటంకం. ప్రజలు నిత్యం ప్రభుత్వం తమకు ఏ రకమైన సహాయం చేస్తుంది అనే ఆలోచనలో పడిపోయి స్వయంకృషి విస్మరిస్తున్నారు. ఈ విధానాలు దేశ ప్రగతికి అవరోధం.

- వేదుల సత్యనారాయణ