సబ్ ఫీచర్

జుట్టుకు జాగ్రత్తలు తీసుకోండిలా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*జుటు టకుదుళ్ళు గట్టిగా ఉండాలంటే ప్రతిరోజూ ఉదయం పిడికెడు తెల్లనువ్వులను తినాలి. నువ్వుల్లో జుట్టు పెరుగుదలకు అవసరమైన క్యాల్షియం, మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. వీటివల్ల జుట్టు కుదురు గట్టిబడి నల్లని జుట్టు మీ సొంతం అవుతుంది.
* ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జును చిటికెడు జీలకర్ర పొడితో కలిపి రోజుకి రెండుసార్లు చొప్పున కనీసం మూడు నెలలు తీసుకుంటుంటే శరీరంలో వేడి తగ్గి జుట్టురాలడం ఆగిపోతుంది.
*ఆహారంలో డ్రైఫ్రూట్స్, పాలు, పెరుగు, ఛీజ్ (పన్నీర్) కొబ్బరి, యాపిల్స్, క్యాబేజీ వంటివి తీసుకొంటే వాటివల్ల జుట్టు ఆరోగ్యం గా ఉండి త్వరగా వూడడం కాని వెంట్రుకల చివర్లు చిట్లడం కాని ఉండదు
* దశ మూలాల చూర్ణం 5 భాగాలు, గుంట గలగరాకు (్భృంగరాజ) చూర్ణం 4 భాగాలు, జటామాంసి వేర్ల చూర్ణం 3 భాగాలు కలిపి నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజూ రాత్రి నిద్రకు ముందు ఈ మిశ్రమాన్ని అరచెంచాడు తీసుకొని కప్పుపాలకు చేర్చి మరిగించి వడపోసుకుని తాగుతుంటే క్రమంగా జుట్టు రాలటం తగ్గుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది.
*జుట్టు రాలడం అరికట్టాలంటే ప్రతిరోజు నూనెను పట్టించడం కూడా మంచిదే. ఎక్కువ బయట తిరిగేవాళ్లు, లేక దుమ్ముధూళిలో పనిచేసేవారైతే ప్రతిరోజు తలంటు పోసుకోవచ్చు. లేకపోతే రెండు రోజులకొకసారి తలారా స్నానం చేస్తే కూడా తలలో వాయు కాలుష్యం వల్లఏర్పడితే అనారోగ్యాలు దూరం అవుతాయ.
* గుంటగలగర ఆకు, త్రిఫలాలు, శీకాయ, కుంకుడు, కచ్చూరాలు, అతిమధురం వంటి ఔషధులను మెత్తగ మర్దించి తలకు లేపనంగా వేసుకొంటే కూడా వెంట్రుకలు బాగుంటాయ అంటారు.
* మెడ కండరాలను శక్తివంతం చేసే వ్యాయామాలు కూడా తలపై జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయ. శీర్షాసనం,్భజంగాసనం వంటి యోగాసనాలవల్ల తలకు రక్తప్రసరణ పెరిగి తద్వారా జుట్టు కుదుళ్లు బలపడతాయి.
* థైరాయిడ్ గ్రంథి పనితీరులో లోపాలు, రక్తహీనత, పిట్యూటరీ గ్రంథిలో పెరుగుదలలు ఏర్పడటం, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, సొరియాసిస్, లైకెన్‌ప్లానస్, దీర్ఘకాలపు జ్వరాలు వంటివాటివల్ల జుట్టు రాలిపోతుంటుంది. కాని ఇవన్నీ ఆయా జబ్బులకు తీసుకునే మందుల వల్ల, లేక చికిత్సవల్ల రోగం దూరం కాగానేజుట్టు మళ్లీ యథాప్రకారం వచ్చేస్తుంది.
*