సబ్ ఫీచర్

దైవానే్వషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(దైవ దర్శనం - నిన్నటి తరువాయ భాగం)
రామకృష్ణ పరమహంస - కేశవ చంద్రసేన్ ఇరువురిమధ్య చర్చ ప్రారంభమైంది. దేవుడి గురించి మీరేమంటారు? కేశవచంద్ర ప్రశ్న.
దేవుడి గురించి నేనేమైనా చెప్పాలా? నా కళ్లలో, నా చేతిలో దేవుడు నీకు కనిపించడం లేదా నాయనా? దగ్గరగా వచ్చి చూడు అన్నారు రామకృష్ణులు. తన వాదనా పటిమతో ఎంతోమంది మేధావులను ఓడించిన కేశవచంద్రకు మతిపోయింది. ఈ మూర్ఖుడేమిటి ఇలా వాదిస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఇదేమి వాదన? అని తిరిగి ప్రశ్నించాడు.. నీలో ఉన్న ఈ తెలివితేటలు, ఈ వాదనాపటిమ, ఈ నీ యొక్క నిర్భయం నీకు ఎక్కడినుండి వచ్చాయి అని ప్రశ్నించారు రామకృష్ణులు- ఇదొక చక్కని విశే్లషణ. రామకృష్ణులు ఇంకా ఇలా అంటున్నారు. ఒకవేళ ఈ నీ యొక్క అస్తిత్వానికి (ఎగ్జిస్టెన్స్) తెలివితేటలే కనుక లేనట్లయితే, వాటిని నువ్వు పొందలేవు. మరి అవన్నీ నీకు ఎక్కడినుండి వచ్చాయని నువ్వనుకుంటున్నవు? ఈ నీ అస్తిత్వం గొప్పది అనడానికి నువ్వే నిదర్శనం! దీనినే నేను దేవుడు అంటాను అన్నారు రామకృష్ణులు! నిర్వీణ్ణుడై వింటున్నాడు కేశవచంద్రసేన్.
కేశవా! నా దృష్టిలో దేవుడు అంటే ఎక్కడో వినీలాకాశంలో మేఘాలపైన కూర్చున్నవాడు కాదు. నా దృష్టిలో దేవుడు అంటే ప్రతి ఒక్కరి అస్తిత్వం. ఈ విశ్వం చాలా గొప్ప వివేకి- అనంతమైన తెలివితేటలున్నది- మనమందరం కూడా దానికి చెందినవారమే. దానికీ మన ఎదుగుదల అవసరం ఇష్టం. మనం ఆనందిస్తే విశ్వం ఆనందిస్తుంది. మన నాట్యంలో కలిసి అది నాట్యమాడుతుంది. మరి నా నాట్యం నువ్వెప్పుడైనా చూశావా? అంటూ నాట్యం చెయ్యడం ప్రారంభించారు రామకృష్ణ పరమహంస. చేసేదేమీ లేక నాట్యం చూశాడు కేశవచంద్రసేన్. అయితే రామకృష్ణులు చాలా చక్కగా నాట్యం చేశారు. వారొక చక్కని నాట్యకారులు. .
ఇక ఇపుడు వారు ఎంత అద్భుతంగా నాట్యం చేశారంటే, అకస్మాత్తుగా కేశవచద్రసేన్‌లో ఏదో అద్భుతమైన మార్పు చోటుచేసుకుంది. అతడు తనలోని తన తర్కశాస్త్ర ప్రావీణ్యాన్నంతా మరచిపోయి, రామకృష్ణులలో ఎంతో శోభాయమానంగా విరాజిల్లుతున్న ‘దివ్య సౌందర్యాన్ని’ చూశాడు. కేశవచంద్రకు గతంలో ఎప్పుడూ తన అంతరంలో చవిచూడని ఆనందాన్ని అనుభవించాడు. తన తెలివితేటలు, వాదనలు అన్నీ పైపైవే అని అతడికి బోధపడింది. లోలోపల పరమశూన్యం ఉందని అర్థమైంది.
పరమానందంతో పరవశిస్తూ నృత్యంలో తన్మయస్థితిలో వున్న ‘రామకృష్ణ పరమహంస’ పాదాలను తాకాడు కేశవచంద్ర. నన్ను మన్నించండి! నేను నాకే అన్నీ, అంతా తెలిసినట్లుగా ఇన్ని రోజులూ నీతులు చెపుతున్నాను. నిజానికి నాకేమీ తెలియదని బోధపడింది. మీ గురించి నేను చాలా తప్పుగా, తక్కువగా భావించాను. మీకేమో అన్నీ తెలుసు. నాకేమీ తెలియకపోయినా మీరు నన్ను ఒక్క మాట కూడా అనలేదు అని రామకృష్ణులను క్షమాపణ వేడుకున్నాడు కేశవచంద్రసేన్. రామకృష్ణులు నవ్వుతూ ఒక నిబంధనను నువ్వు పాటిస్తే నేను నిన్ను మన్నిస్తాను అన్నారు. మీరెలాంటి నిబంధన విధించినా నేను దానికి బద్ధుడివి అన్నాడు కేశవచంద్ర. అయితే అప్పుడప్పుడు నువ్వు నాతో వాదించేందుకు, చర్చించేందుకు, సవాల్ చేసేందుకు వస్తుండాలి. ఇదే నేను విధించే నిబంధన అన్నారు రామకృష్ణులు.
కేశవచంద్రసేన్ ‘సర్వస్య శరణాగతి’ చేశాడు రామకృష్ణులకు! రోజూ రావడం ప్రారంభించాడు రామకృష్ణుల వద్దకు! అతనికి పిచ్చెక్కిందనుకుని అతనిని వదిలేశారు శిష్యులు. కానీ కేశవచంద్ర బాహ్యవాదాన్ని వదిలి అంతఃవేదాన్ని వినడం ప్రారంభించాడు. బాహ్యమైన తర్కంతో, అన్నింటిపైనా, అందరిపైనా ఆరోపణలు చేస్తూ వాదిస్తూ వేధిస్తూ గెలుస్తున్నాను అనుకున్న కేశవచంద్రసేన్ సత్యానే్వషణతో అంతః వికాసాన్ని పొందాడు. రామకృష్ణ పరమహంస సాంగత్యంలో నూతన పరిమళాలతో కూడిన పుష్పాలు అతని అస్తిత్వంలో వికసించాయి. తన తర్కాన్ని పూర్తిగా మరచిపోయి, మనసును అధిగమించి ఉన్న మాధుర్యాన్ని చూసేందుకు రామకృష్ణులు కేశవచంద్రునికి సహాయపడ్డారు. *