సబ్ ఫీచర్

కొత్తిమీర రుచులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తిమీరలో అధిక శాతం విటమిన్స్ ఉన్నాయి.
హృదయ రోగాలు రాకుండా కాపాడుతోంది.
ముఖ్యంగా రుచి విషయంలో కొత్తిమీర వేస్తే
మరింత అధికం అవుతుంది.
అల్లం కొత్తిమీర
వంకాయ కూర
వంకాయలు-6, కొత్తిమీర -చిన్నకట్ట, అల్లం-చిన్న ముక్క, జీలకఱ్ఱ-1 చెంచా, పచ్చిమిర్చి -12, కొబ్బరికోరు-1/2 కప్పు, ఉప్పు-1చెంచా, చింతపండు-నిమ్మకాయంత, నూనె-1/2 కప్పు.
విధానం:ముందుగా వంకాయలు కడిగి అరేకలుగా చేసి ముచిక వద్దకి కోయాలి. కొబ్బరి, కొత్తిమీర, జీలకఱ్ఱ, కొబ్బరి అన్నీ మిక్సీ పట్టి ముద్ద చేసుకోవాలి. ఈ ముద్దని వంకాయల గుత్తుల్లో నూరి నూనెలో మగ్గనివ్వాలి. ఈ విధంగా 15 నిమిషాలు మగ్గించి గుత్తులు విడకుండా మరలా మగ్గించాలి. మెత్తబడ్డాక దింపి డిష్‌లో పెట్టాలి. ఇది మంచి రుచిగా ఉంటుంది.
కొత్తిమీర వడ
కొత్తిమీర- తరిగినది 2 కప్పులు, బొబ్బర పప్పు-2 కప్పులు, జీలకఱ్ఱ-1చెంచా, వెల్లుల్లి రేకలు-12, జీడిపప్పు-12, పచ్చిమిర్చి-6, నూనె - 250 గ్రా., కొబ్బరి కోరు-1 కప్పు, అల్లం-చిన్నముక్క, కార్న్‌ఫ్లోర్-1/2 కప్పు.
విధానం:బొబ్బర పప్పు నీరు వేసి నానించి కడిగి అల్లం పచ్చిమిర్చి కొబ్బరి చేర్చి గట్టి ముద్దగా రుబ్బాలి. జీలకఱ్ఱ వెల్లుల్ని ముక్కలు, జీడిపప్పు ముక్కలు కలపాలి. దీనిపై కార్న్‌ఫ్లోర్ పిండి వేసి కలిపి నిమ్మకాయంత ఉండలు చేసుకుని వడలుగా తట్టి నూనెలో వేసి వేయించాలి. ఈ విధంగా మొత్తం పిండి అంతా వడలుగా తట్టి వేయించాలి.
కొత్తిమీర కారం
కొత్తిమీర తరిగినది-5కప్పులు, ఉప్పు-2చెంచాలు, చింతపండు-నిమ్మకాయంత, నూనె-1/4 కప్పు, ఆవాలు-1చెంచా, ఎండుమిర్చి-6, పచ్చిమిర్చి -24, బెల్లం-1/4 కప్పు, కొబ్బరి - 2 చెంచాలు, శనగపప్పు-2 చెంచాలు, మినపప్పు-2 చెంచాలు.
విధానం:ముందుగా కొత్తిమీర, మిర్చి, ఉప్పు, చింతపండు, బెల్లం, కొబ్బరి చేర్చి మెత్తగా నూరాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, రెండు మిర్చి ముక్కలు, శనగపప్పు, మినపప్పు చేర్చి దోరగా వేయించాలి. దీనిలో ఈ రుబ్బిన పచ్చడి వేసి ఐదు నిమిషాలు మగ్గించి దింపాలి. దీన్ని చల్లార్చి బాక్స్‌లోగాని, మూత ఉన్న జాడిలోగాని పెట్టాలి.
కొత్తిమీర
నిల్వ పచ్చడి
కొత్తిమీర-5 కట్టలు, ధనియాలు-1 కప్పు, ఎండుమిర్చి కారం-1కప్పు, ఉప్పు-1/4 కప్పు, చింతపండు విడదీసినది-1 కప్పు, ఎండు కొబ్బరి కోరు-2 చెంచాలు, నూనె-2 కప్పులు, మినపప్పు-5 చెంచాలు, శనగపప్పు-5 చెంచాలు, ఆవాలు-2 చెంచాలు.
విధానం: ముందుగా కొత్తిమీర కడిగి, ఆరనిచ్చి సన్నగా రజనులా తరగాలి. బాణలిలో నూనె వేసి కొత్తిమీర గుప్పెడు గుప్పెడు చొప్పున దోరగా వేయించాలి. ధనియాలు మిక్సీ పట్టాలి. చింతపండు పొడిగా చెయ్యాలి. ఇప్పుడు బాణలిలో వేసి మరిగాక కారం వేసి ధనియాల పొడి వేసి కలిపి వేయించాలి. దీనిపై వేయించిన కొత్తిమీర వేసి కలపాలి. ఇప్పుడు దీనికి వేయించిన ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేయించి దానికి కలపాలి. కొబ్బరి కోరు వేసి కలిపి ఉప్పు వేసి కలిపి మిగతా నూనె పోసి కలియబెట్టి చల్లార్చాలి. దీన్ని గాజు సీసాలో పొయ్యాలి. ఇది ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది.

-- జి. కల్యాణి