సబ్ ఫీచర్

ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేసింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరన్నారు, ఆడది ఒంటరిగా ప్రయాణం చేయలేదని? అవకాశం రావాలేగాని అలవోకగా ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తుంది. ఈ మాటను అక్షరాలా నిజం చేసి చూపిన మహిళ మెహర్‌మూస్. మెహర్ హెరోయిస్ మూస్... సాహసానికి మారుపేరు. నిరంతరం ప్రయాణికురాలు. తన 70 ఏళ్ల జీవితంలో 181 దేశాలను చుట్టేసి వచ్చిన నిత్య యాత్రికురాలు. అంటార్కిటికా మంచు ఖండానికి వెళ్లిన తొలి భారతీయురాలు ఈమె. 181 దేశాలను చుట్టిరావడం కొద్దిగా కష్టమయినా మరీ అంత విడ్డూరమేం కాదనిపించవచ్చు మీకు. కాని ఇక్కడ విశేషమేంటంటే మెహర్ మూస్ ఒంటరిగా ఈ దేశాలన్నీ తిరిగివచ్చారు. ఆ దేశాలు చుట్టి రావడంలో కూడా ఎన్నో సాహసాలు. దొరికిన కీటకాలను తిని కడుపు నింపుకుంటూ భయంకరమైన అమెజాన్ అడవులను చుట్టిరావడం, ఆర్కిటిక్, మంగోలియా, గోబి ఎడారిలాంటి ప్రదేశాలలో తిరగడం, అత్యంత కఠినమైన మంచు ఖండంలో తిరగడం, స్ర్తిలకు అత్యంత కఠిన నిబంధనలు అమలులో వున్న గల్ఫ్ దేవాలన్నీ చుట్టిరావడం- ఇలా ఒకటా రెండు కాదు చెప్పుకుంటూ పోతే మెహర్ సాహసాలు ఎన్నో. దేశాలు తిరిగి రావడానికి 18 పాస్‌పోర్టులను సంపాదించుకున్నారు. ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడివారితో ఇట్టే కలిసిపోవడం, వారితో స్నేహం చేయడం మెహర్ లక్షణాలు.
ముంబయికి చెందిన మెహర్‌కు ప్రపంచంలో ఉన్న విభిన్న ప్రాంతాలను చూడడం ఇష్టం. ఆ ఇష్టంతోనే ప్రపంచమంతా చుట్టిరావాలన్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ముంబయి గవర్నమెంట్ న్యాయ కళాశాల నుంచి ఎల్‌ఎల్‌బి పట్టాను పొందిన తరువాత 1965లో ఎయిర్ ఇండియా సంస్థలో తన 20 ఏళ్ళ వయసులో ఎయిర్‌హోస్టెస్‌గా ఉద్యోగంలో చేరిన మెహర్‌కు తన ప్రవృత్తికి సరిపోయే వృత్తే దొరికింది. తన ఉద్యోగంలో భాగంగా అనేక ప్రాంతాలను చూసే అవకాశం ఆమెకు లభించింది. అయినా దాంతో సరిపెట్టుకోలేకపోయారు మెహర్. ఎందుకంటే ఉద్యోగ బాధ్యతల కారణంగా అడపాదడపా దేశాలు తిరగడమే తప్ప పూర్తి స్థాయిలో తననుకున్న రీతిలో దేశాలు చుట్టిరావడానికి అంతగా అవకాశం చిక్కలేదామెకు. ఆర్థికంగా కూడా కొంత ఇబ్బందులెదుర్కోవలసి వచ్చింది. దాంతో ఆఫీసులో లోన్‌లు వాడుకోవడం, తన ఉద్యోగంలో తనకు వచ్చే కాంప్లిమెంటరీ టిక్కెట్లు వాడుకోవడం, డిస్కౌంట్ టిక్కెట్లు వాడుకోవడం- ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని తన ప్రపంచ పర్యటనలకే ఉపయోగించుకున్నారు. అవివాహితగానే ఉండిపోయిన మెహర్‌కి కుటుంబానికి సంబంధించిన భర్త, పిల్లలు లాంటి బాదరబందీ లేకపోవడం ఆమె హాబీకి కొంత వెసులుబాటు కల్పించినా, సమాజం నుంచి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితే ఎదురయిదంటారు. ఆడపిల్లలు బయటకు రావడమే పెద్ద నేరమన్నట్టు చూసే ఆ రోజులలో ఆడపిల్ల దేశాలు దాటి అది కూడా ఒంటరిగా వెళుతుందంటే గుచ్చుకునే చూపులు, వెటకారపు వ్యాఖ్యానాలకు లెక్కే ఉండదు. కాని ఆ పరిస్థితిని ఏ మాత్రం లెక్కచేయలేదామె. తన కుటుంబం, ముఖ్యంగా తన అభిరుచిని గౌరవించిన తండ్రి తనకిచ్చిన ప్రోత్సాహంతో ఇవేవీ లెక్క చేయకుండా ముందుకు సాగిపోయానంటారు మెహర్. 70 ఏళ్ల వయసులో ఉన్న మెహర్‌కి ఇప్పుడు ఆరోగ్యపరమైన కొన్ని సమస్యలున్నప్పటికీ తనలోని తృష్ణ మాత్రం ఇంకా తీరలేదంటారు. ఇప్పటికే 180 దేశాలు తిరిగిన మెహర్ తను చూడడానికి ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా 25 దేశాలు మిగిలే ఉన్నాయని అవి కూడా చుట్టి వస్తానని అంటారు ధీమాగా.
తన సాహస ప్రయాణాలకు గాను ఎన్నో గౌరవ, పురస్కారాలను అందుకున్నారు మెహర్. ప్రస్తుతం ఒక అంతర్జాతీయ పర్యాటక సలహాదరుగా పనిచేస్తున్నారు.

- లీల