సబ్ ఫీచర్

మితిమీరుతున్న అజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్లో అజ్ఞః సుఖమారాధ్యః సుఖతర మారాధ్యతే విశేషజ్ఞః
జ్ఞానలవదుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరజ్ఞయతి
‘‘ఏమి తెలియనివారికి తేలికగా నచ్చచెప్పవచ్చు. బాగా తెలిసినవారికి ఇంకా తేలికగా చెప్పవచ్చు. తెలిసీ తెలియనివాళ్ళకు చెప్పడం బ్రహ్మకు కూడా సాధ్యం కాదు’’ అని భర్తృహరి చెప్పిన మాట. నిజమే! ఇటీవల హేతువాదుల పేరుతో కొందరు చేస్తున్న ‘తంతు’ ఇలాంటి ప్రహసనానే్న తలపిస్తుంది. భారతదేశంలో అనేక గ్రంథాలు పుట్టాయి. వాటిలో షడ్దర్శనాలు కూడా ఉన్నాయి. షడ్దర్శనాలల్లో భౌతిక విషయాలు చెప్పే కణాదమహర్షి, కపిల మహర్షి సూత్రాలు ఉండడం విశేషం.
నాస్తికులను కూడా గౌరవించే సంప్రదాయం మనది. కానీ ఇటీవల మేధావుల పేరుతో, కులవాదుల పేరుతో, హేతువాదుల పేరుతో హిందూ ధర్మంపై దాడి చేస్తున్న వైనం మనం అర్థం చేసుకోవాల్సి ఉంది.
టీవీల్లో కూర్చొని చర్చల పేరుతో హిందూ ధర్మానికి లేనిపోని ‘యుక్తులు’ ఆపాదించి హిందూ సమాజ మనోభావాలు కించపరుస్తున్నారు. సంప్రదాయాలను, స్వామీజీలను, పండుగలను విమర్శించడం టీవీ చానళ్ల నిత్యకృత్యమైంది. ఉదాహరణకు ఉగాది పండుగనాడు కాల విశేషాలను తెలుసుకోవడానికి ‘పంచాంగ పఠనం- శ్రవణం’ చేస్తుంటాం. ఇది మన సంప్రదాయం. సరిగ్గా దేశమంతా పంచాంగ పఠనం చేస్తుంటే ఓ ఛానెల్ వాళ్ళు పంచాంగంలో సత్యమెంత? అనే హెడ్డింగుతో పంచాంగాన్ని తిట్టిపోస్తుంటారు (మొన్న ఉగాదికి ఇదే జరిగింది).
ఎవరో ఓ స్వామి తప్పుచేశాడని స్వాములందరినీ అదే గాటన గట్టి ఓ కార్యక్రమం ఇంకో ఛానెల్ పెడుతుంది. పుట్టపర్తి భగవాన్ సాయిబాబా చేసిన మంచి పనలు వాటి ఫలితాలు ఏ టీవీవారూ చూపించరు. కానీ అక్కడ ఏదైనా జరుగరానిది జరిగితే గోరంతలు కొండంతలు చేయడం, విషయాల్ని చీల్చి చెండాడడం మనం చూస్తున్నాం.
ఎందరో స్వామీజీలు మహనీయులు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందరినో ఉద్ధరించారు. వాళ్ళ గురించి ఎక్కడా ఒక్క ముక్క రాయరు. అలాగే కన్నుల పండువగా ఎటపాక (్భద్రాచలం)లో అతిరాత్ర మహాయాగం జరుగుతుంటే అక్కడ హేతువాదులు సమావేశం పెట్టి యాగాలను విమర్శిస్తున్నారు. అలాగే ఇతర మతస్థుల కార్యక్రమాలు జరుగుతుంటే సమావేశాలు పెట్టి విమర్శిస్తారా? టీవీల్లో దసరా పండుగ నాడు మహిషాసురుడు గొప్పవాడని చర్చలు చేస్తున్నా, దీపావళినాడు నరకాసురుడు మహాత్ముడని వాదిస్తున్నా హిందూ సమాజం భరించడం గొప్ప విశేషం. ఈ ధోరణి మారకుంటే హిందూత్వం దెబ్బతినడం ఖాయం.
ఇప్పటికైనా టీవీలు, పత్రికలు ఈ దేశంలోని మెజారిటీ ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని సంప్రదాయాలను గౌరవించాలని హిందూ సమాజం కోరుకొంటున్నది.
*

డా॥ పి. భాస్కర యోగి bhaskarayogi.p@gmail.com