సబ్ ఫీచర్

ప్రేమ, గౌరవాలే పునాది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశం మొత్తంలో అభివృద్ధి పేరిట సంక్షేమ కార్యక్రమాల లిస్టు హనుమంతుడి తోకలా పెరిగిపోతూనే వుంది. అభివృద్ధి ఏమో కానీ, కొన్ని కొన్ని ప్రచారాలు ఆచరణకు సాధ్యంకానంతగా వుంటున్నాయ్. అసలు అటువంటి ప్రచారాలు అవసరమా అని కూడా అనిపిస్తుంది. ఇక దొరికిందే ఛాన్సు, ప్రసార మాధ్యమాల్లో అవే చెప్తూ పోతారు. ఉదాహరణకి కుల రహిత సమాజం- ఈ మాటలు వినడానికి బాగానే వున్నాయి. కానీ యుగయుగాలనుంచీ ప్రతీ వ్యక్తిలో పాతుకుపోయిన ఆహార వ్యవహారాలూ, కొన్ని కొన్ని అనాదిగా వస్తున్న నమ్మకాలూ, అలవాట్లు, ఆచారాలూ మారడం సాధ్యమా? ఎవరి అలవాట్లు వాళ్లు, ఎదుటివాళ్లని దూషించకుండా, మరో వ్యక్తినీ, వారి అలవాట్లనీ నిందించకుండా, ఎవరికివారు అందరినీ గౌరవించుకుంటూ పోవడంలో మంచి, మానవత అన్నీ వున్నాయి కదా! అలా ప్రతివారు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, సంతోషంగా వుంటే సమాజంలో గొడవలెందుకు వుంటాయి. ఏ దేశంలోనైనా ఎపుడైనా, ఏ మతంలోనైనా కుల రహిత సమాజం వుండాలి? అది వుంటూనే వుంటుంది. ‘‘ఎవరి కులం వారిది, ఎవరి మతం వారిది’’ అని ఒకరిని ఒకరు విమర్శించుకోకుండా వుంటే బాగుంటుంది కదా! దేశంలోనైనా, ఏ వృత్తిపరంగానైనా, ఉద్యోగాలలోనైనా, ఆ ప్రస్తావనలు మాని, మనిషిగా తోటివారిని గౌరవించే గుణం, అభిమానించే గుణం, ప్రేమగా మాట్లాడే తత్వం అలవరచుకోవాలి. అప్పుడు మనిషికి మంచి గుణాలపైనా, మంచివారి పైనా అభిమానాలూ ఆప్యాయతలూ పెరుగుతాయి. అంతేకానీ, దూషణలు, తిట్లు, అగౌరవపరచే ప్రవర్తనలు, మానవతను పెంచుతాయా? కానీ, ఈ రోజున పిల్లవాడు పుట్టినప్పటినుంచి, ఇంట్లో, వీధిలో, బడిలో, కాలేజీల్లో పెళ్లి పేరంటాలలో ఎక్కడ చూసినా కుల ప్రసక్తులు, మత ప్రసక్తులు దెబ్బలాటలూ చూస్తున్నారు పిల్లలు. మానవత్వం, ఉమ్మడి కుటుంబం, బంధుత్వం- ఇలాంటి బోధలు వారి మనసులకెక్కడం లేదు. మానవత్వం ఎలా పెరుగుతుంది గొడవల మధ్యన. ఇళ్లల్లో కానీ, బయట కానీ సామరస్యం ఎలా కుదురుతుంది. అందుకే అంటున్నాను- ఇంటా బయటా కూడా ప్రశాంతత, మంచి వాతావరణం నెలకొనాలంటే ముందుగా ఆచరించవలసింది, మంచితనాన్నీ మంచి గుణాలనీ గౌరవించడం, ఆదరించడం, ఆచరించడం నేర్పించాలి. ఓట్ల రాజకీయాల్లో ప్రతివారూ చిల్లర విషయాలను, రెచ్చగొట్టే విషయాలను చర్చించకూడదు. కనీసం భావిలోనైనా పిల్లలు మంచిగా ఆదర్శనీయులుగా ఎదగాలని ఆశిద్దాం!

--శారదా అశోకవర్థన్