సబ్ ఫీచర్

బుద్ధత్వ భావన -2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుద్ధుడిపైన ఉమ్మిన ఆ వ్యక్తిలో అంతఃఘర్షణ మొదలైంది. బుద్ధుని వదనం, ఆ వదనంలోని ప్రశాంతత, కరుణ తొణికిసలాడే బుద్ధుని నేత్రాలు ఆ వ్యక్తికి పదే పదే కనిపింపసాగాయి. అంతేకాక, బుద్ధుడు తన చర్యపట్ల తనకు చెప్పిన కృతజ్ఞతలు మాటవరుసకోసం చెప్పినట్లు అనిపించడంలేదు. వాస్తవంగానే ఆయన మాటల్లో కృతజ్ఞత స్పష్టంగా వినిపిస్తోంది. బుద్ధుని వ్యక్తిత్వం మొత్తం ఆ కృతజ్ఞతలను ప్రకటిస్తోంది. ఆ వ్యక్తికి ఒకప్రక్క బుద్ధుని ప్రవృత్తి మొత్తం కృతజ్ఞతలతో నిండి వుంటే, మరోప్రక్క ఆనందుడి ఆగ్రహం కూడా ఎర్రగా చెలరేగుతూ దర్శనమిస్తోంది. బుద్ధుడి చల్లని ప్రశాంత వదనం, ఆ ప్రేమతత్వం, ఆ స్నేహభావం, కరుణాంతరంగం, ఆత్మీయత తన ఆత్మ అనుభవాల్లోకి వస్తోంది ఆ వ్యక్తికి. చివరికి ఆ వ్యక్తి తనను తానే క్షమించుకోలేని స్థితికి చేరుకున్నాడు. తను చేసిన పనేమిటి? తెల్లవారగానే ఆ వ్యక్తి బుద్ధుని వద్దకు పరుగెత్తుకొచ్చాడు. బుద్ధుడి కాళ్ళమీద పడిపోయాడు. నేను చేసిన మహాపరాధం నన్ను కాల్చేస్తోంది స్వామీ! నన్ను క్షమించానని మీరు చెపితే తప్ప నాకు నిష్కృతి లేదు అని పదే పదే చెపుతూ రోదిస్తున్నాడు ఆ వ్యక్తి పశ్చాత్తాపతప్తమై ఖేదం పొందుతున్న హృదయంతో!
అతడిని లేవనెత్తి హృదయానికి హత్తుకున్న బుద్ధుడు అతడి కళ్ళనీళ్ళు తుడుస్తూ ఇలా అన్నాడు. ఇక దాని సంగతి మరిచిపో! నిన్న జరిగిన దానికోసం క్షమాపణ వేడవలసిన అవసరం లేదు. గంగానదీ తీరంలో ఓ వృక్షం క్రింద కూర్చుని ఉన్న బుద్ధుడు ఆ వ్యక్తితో అంటున్నాడు.. చూడు! ఎంతో గంగా ప్రవాహం వెళ్లిపోయింది. ప్రతిక్షణమూ ఎన్నో నీళ్ళు వెళ్లిపోతూనే వున్నాయి. ఇరవై నాల్గుగంటలు గడిచిపోయినా నువ్వెందుకు దానే్న పదే పదే గుర్తుంచుకుంటూ మోస్తున్నావు? ‘‘సృష్టిలో ప్రస్తుతం లేనిదాన్ని గురించి ఇంత ఖేదం ఎందుకు? ఇక ఆ సంగతి మరిపో!’’ నేను నిన్ను క్షమించలేను. ఎందుకంటే నాకు నీమీద కోపమే అసలు కలగలేదు కనుక! నాకు కోపం వచ్చి ఉంటేనే కదా నేను క్షమించగలిగేది! నీకు నిజంగా క్షమాపణ అవసరం అనిపిస్తే ఇదిగో మా ఆనందుడిని క్షమాపణలు అడుగు. అతడి కాళ్ళమీద పడు- అతడెంతో ఆనందిస్తాడు అన్నాడు. బుద్ధుడింకా ఇలా అన్నాడు ఆ వ్యక్తితో! నువ్వు నా మొహంమీద ఉమ్మేసినపుడు, దేవేంద్రుడు నా సహనాన్ని, శ్రద్ధను పరీక్షించడానికి వచ్చాడు అని నేను భావించాను. అందువల్ల నిజానికి నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి అన్నారు బుద్ధ భగవానులు. ఆ వ్యక్తి బుద్ధుని పట్ల సర్వస్య శరణాగతి చేశాడు. మనకు సహాయం చేసినవారిపట్లా, మన ప్రయత్నాలకు అడ్డొచ్చిన వారిపట్లా, ఉదాసీనత వహించి మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండిపోయిన వారిపట్లా కూడా మీరు కృతజ్ఞులై ఉండాలి. వీరందరివల్లే ఓ బుద్ధుడు తయారయేందుకు తగిన ఉపాధి ఏర్పడుతూ మీరు బుద్ధుడిగా తయారవగల అవకాశం ఏర్పడుతూ ఉంది. మనం సర్వులపట్లా- సర్వంపట్లా కృతజ్ఞతతో ఉన్నపుడే ‘విశ్వభావన’, ‘జగదేకభావన’ ఏర్పడడం మొదలవుతుంది మనలో! అందుకే మన వేదంలో ‘తత్త్వమసి’ అన్నారు. అది నువ్వు నేను అంతా ఒకటే అని! ‘అయమాత్మా బ్రహ్మ’ అన్నారు శ్రీకృష్ణులవారు! మరొక సందర్భంలో శ్రీకృష్ణుడు వారే అన్నారు ‘మమాత్మా సర్వభూతాత్మా’ అని! నాలో ఉన్న ఆత్మ సమస్త జీవరాసుల్లో ఉంది. సమస్త జీవరాసుల్లో ఏదైతే ఉందో అదే నాలో ఉంది అని తాత్పర్యం. మహర్షుల, బ్రహ్మర్షుల, బుద్ధుల మహనీయుల, మహానుభావుల, యోగీశ్వరుల బోధనలు, మరి వారందరి యొక్క నిత్య నూతన ఆచరణాత్మకమైన, నిర్మాణాత్మకమైన జీవన సరళిని మనం గుర్తుకు తెచ్చుకోవడంవల్లా, మననం చేసుకోవడంవల్లా, చదివినదే విన్నదే అయినా మళ్లీ మళ్లీ చర్విత చరణం చేసుకోవడంవల్లా ‘ఆత్మోన్నతి’ సర్వదా కలుగుతుంది. వర్తమానమే బహుమానం! ఈ క్షణంలోనే ఉందాం! ఈ క్షణాన్ని నర్తిద్దాం! ఈ క్షణంలోనే ఆనందిద్దాం!

-మారం శివప్రసాద్, 9618306173, 8309912908