సబ్ ఫీచర్

అవగాహనే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిశువు ఒక్కసారిగా నడక నేర్వలేడు. పడుతూ లేస్తూ, ఆధారాలతో అడుగులేస్తూ చివరకు నడకను స్థిరంగా ఉండేటట్లు చేసుకుంటుంది. ఒకళ్ళు నేర్పక్కర్లేదు ఈ విషయాలన్నీ. ఇవి అన్నీ ప్రకృతి సహజం. ఇది కూడా అంతే. తొట్రుపాటు, తడబాటు మొదట్లో సహజం. చేపపిల్లకు ఈదడం, పక్షిపిల్లకు ఎగరడం వచ్చినట్టే అవసరానికి తగ్గట్టు మనిషికి ఏ పని చేయాలన్న అనుకోకుండా అంటే అభ్యాసం లేకుండా ఆ పని చేసే నేర్పు వస్తుంది. కాకపోతే ఆ పని పట్ల ఉండే శ్రద్ధ వల్ల పనికి నైపుణ్యాన్ని జోడించి చేస్తే మరింత మంచి ఫలితాలన్ని పొందవచ్చు. అట్లాంటిదే నలుగురిలోకలుపుగోలు మాట్లాడడం,. కాని, నలుగురిలో మాట్లాడాల్సి వచ్చినపుడుకొంతమందికి కాస్త బెరుకుగా అనిపిస్తుంది. గొంతు పెగలదు. ఈ లక్షణం మగవారి కన్నా ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. నేడు అందరూ ఆడపిల్లలు చదువుకుని పోటీ పరీక్షల్లో నెగ్గుకు వచ్చినా ఇంటర్వ్యూలపుడు ఈ అవస్థను వారు ఎదుర్కొంటున్నారు. దీన్ని అధిగమించాలంటే విషయ పరిజ్ఞానం అవసరం. మనం చేయబోయే పనిని గురించిన పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ఆ తరువాత ఎదుటివారిని చిరునవ్వుతో పెద్దవారికి నమస్కరించాలి. ఆ తరువాత వారు అడిగిన దానికి తడబడకుండా కాస్త టైము తీసుకొని అపుడు సమాధానం చెప్పాలి.
మరికొంతమందిలో ఈ బెరుకు కాస్తంత వణుకు, చమటలు పోయడం కూడా చూస్తుంటాం. ఇట్లాంటపుడు మనకు మనం ధైర్యం చెప్పుకోవాలి. ఈనాడు మనం చూస్తున్న వాగ్ధాటి కలవారు, బోధకులు అంతా ఒకనాడు మనలాగే మనకెదురైన సమస్యను అధిగమించిన వారే అన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలి. దానివల్ల మన పరిస్థితి ని వారు అర్థం చేసుకొంటారు. కనుక వినేవారికి దృష్టి ఎక్కువగా విషయ సంగ్రహంమీదనే ఉంటుందిగానీ ఫార్మాలిటీస్ మీద ఉండదు. కనుక ఎలా మొదలు పెట్టాలి అసలేమీ చెప్పాలి అని తడుముకోకుండా అడిగిన దానికి సులువుగా అర్థమయ్యేట్టుగాను, చాంతాడంత చెప్పకుండా ముక్తసరిగా జవాబు సరిగా ఉండేట్టుగాను సమాధానం చెప్పాలి.
కొంతమంది మొదట్లో తడబడ్డా సబ్జెక్టులోకి వెళ్ళేసరికి దాదాపుగా పరిసరాలనే మర్చిపోతారు. విషయంలోకి డీప్‌గా వెళ్ళిపోతారు. సెమినార్లలోనే కాకుండా ఉద్యోగార్థులై వెళ్ళేవేళ గ్రూప్ డిస్కషన్స్‌లో కూడా ఇది ప్లస్ పాయింట్‌గా ఉంటుంది.
మరికొంతమందిలో ఇంకొక డిజార్డర్ ఉంటుంది. ఫ్రెండ్స్ దగ్గర, సాధారణ సంభాషణల్లో ఏదైనా ఒక విషయాన్ని డీల్ చేసేటప్పుడు వాగ్దోరణి బాగుంటుంది. కాని సెమినార్లలో వారు అంతగా రాణించలేకపోతారు. అక్కడ విషయం తెలిసున్నా తడబాటు పడుతుంటారు. అనుమానాలు పెట్టుకుంటారు. ఇలా చెప్పితే వారు ఏమనుకొంటారో అనుకొంటారు.
దీనికి ఒక్కటే పరిష్కారం- ఎటువంటి ఫార్మాలిటీస్ చూడకుండా సరాసరి విషయ ప్రస్తావనలోకి వెళ్ళడమే. మనసు ఏ స్థితిలో ఉన్నా విషయంపై పట్టు ఉంటుంది కాబట్టి భావం ద్వారా వెలువడే మాటలు అర్ధవంతంగానే ఉంటాయి. వినేవారు ఏదో కామెంట్ చేస్తారనే భయాన్ని పట్టు పట్టి దూరం చేసుకోవాలి.
ఏవైనా చిన్న తప్పులు పొడసూపిడే గుర్తు వస్తే మళ్లీ ఇందాక అట్లా చెప్పాను కాని దానికన్నా ఈ విషయం బాగుంటుంది అని చెప్పవచ్చు. కేవలం ఇంటర్వ్యూల్లో ఇలా అయపోతుంది అనుకోనక్కర్లేదు. న్యాయస్థానాలలో న్యాయవాదులల్లో కొద్దిమంది అప్రెంటీస్ చేసే రోజుల్లో ఈ విధమైన సమస్యలు నెదుర్కొన్నవారు ఉంటుంటారు. మెల్లమెల్లగా వారికి వారు ధైర్యం చెప్పుకుని తర్వాత రోజుల్లో వాదోపవాదాల్లో రాణిస్తారు. వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి, పనిలో ప్రతిభను అభ్యాసం తో నేర్చుకుంటుంటారు.
ఇంటర్వ్యూల్లో ఆతృత, తొట్రుపాటువల్ల విషయాన్ని మర్చిపోవడం సాధారణంగా జరుగుతుంటుంది. ఒకవేళ ఈ ఇంటర్వ్యూల్లో నెగ్గుతానో లేదో ఒకవేళ నెగ్గక పోతేనో అనే ఆలోచన్లు ఉండడం వల్ల కూడా సరిగా మాట్లాడలేకపోతుంటారు.
మాట్లాడుతూనే మరచిన విషయాన్ని ఆలోచిస్తూ ‘లింక్’ను జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఆపైన చెప్పదల్చుకున్న విషయాన్ని కొనసాగించాలి. విషయంపై అవగాహన ఉంటే సెమినార్లలో రాణించడం ఏమంత కష్టం కానే కాదు. ఇదొక కళ. ఎదుటివారిని ఇమ్మర్స్ చేయగల్గడం, విజ్ఞానాన్ని పదిమందికి ఆసక్తికరంగా పంచగల్గటం అద్భుతమైన నైపుణ్యం. ఇది కేవలం అభ్యాసం వల్ల వస్తుంది. అందుకే ముందు ఇంట్లో వారి ముందు మాట్లాడడం, అద్దం ముందు మాట్లాడడం చేస్తూ ఉంటే బెరుకు తగ్గిపోతుంది.

-- జంగం శ్రీనివాసులు