సబ్ ఫీచర్

పెరగనున్న నీటి సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ చిత్రపటంలో మూడోవంతు నీరు ఉన్న ఒక్కవంతు భూభాగంలో నివసిస్తున్న ప్రజలకు నీటి సంక్షోభం తప్పడం లేదు. మానవుడు అభివృద్ధి పేరిట ప్రకృతిని కాపాడటంలో విఫలమవుతున్నాడు. మానవ ప్రేరిత వాతావరణం మార్పులు, జనాభా పెరుగుదల, భారీగా పరిశ్రమలు ఏర్పాటు ప్రభావంతో 2050 సంవత్సరం నాటికి భారత్‌తోపాటు ఆసియా ప్రాంతంలో తీవ్రమైన నీటి కొరత ఏర్పడే ప్రమాదముందని అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాజలీ (ఎంఐటీ) పరిశోధకులు ఇటీవలవే హెచ్చరించారు. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది ఆసియా ప్రాంతంలోనే ఉండటం కారణంగా తీవ్రమైన నీటి సంక్షోభం తలెత్తే పరిస్థితులున్నాయని పేర్కొన్నారు. రానున్న 35 ఏండ్లలో ఈ ప్రాంతంలో అనూహ్యమైన రీతిలో వాతావరణ మార్పు చోటుచేసుకొనే అవకాశముందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. నీటి సంక్షోభం కేవలం వాతావరణ మార్పుల సమస్య కాదని, పరిశ్రమల విస్తరణ, జనాభా పెరుగుదల అనే అంశాలు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో జల సరఫరా విధానంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందనే అభిప్రాయాన్ని ఎంఐటీ అధ్యయనకారులు అభిప్రాయపడుతున్నారు. పారిశ్రామిక అభివృద్ధి, జనాభా పెరుగుదలతో తలెత్తే నీటి డిమాండ్‌ను అంత తేలికగా విస్మరించలేమని, ఈ సమస్యను ఎలా అధిగమిస్తామనేది సవాల్‌తో కూడుకున్న అంశమని స్కోసెర్ అనే పరిశోధకుడు పేర్కొన్నాడు. గతంలో రూపొందించిన పలు విధానాల ఆధారంగా ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ సిస్టమ్స్ మోడల్ (ఐజీఎస్‌ఎం) ను రూపొందించి జనాభా పెరుగుదల, ఆర్థికపరమైన వ్యవహారాలు, వాతావరణ మార్పులు ప్రభావం అనే అంశంపై అధ్యయనం చేశారు. ఆసియాలోని చైనా, భారత్‌తోపాటు ఇతర దేశాల్లో నీటి వినియోగానికి సంబంధించిన మోడల్స్, (ఐజీఎస్‌ఎం)ను జత చేసి విశే్లషించారు. పలు రకాల వాతావరణ పరిస్థితులను ఆధారంగా చేసుకొని అధ్యయనం చేయగా ఆర్థిక, జనాభా, వాతావరణ మార్పుల ప్రభావం నీటిసరఫరాపై పడుతున్నదనే విషయం పరిశోధకుల దృష్టికి వచ్చింది. చైనాలో పారిశ్రామికాభివృద్ధితో ఆ దేశ ప్రజలు ఆర్థిక పరిపుష్టిని సాధిస్తారని, భారత్‌లో మాత్రం జనాభా పెరుగుదల వారి ఆర్థిక పరిస్థితి, సహజ వనరులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని ఈ అధ్యయన బృందానికి నాయకత్వం వహించిన చార్లెస్ ఫ్యాంట్ పేర్కొన్నారు. ఏదిఏమైనా భవిష్యత్తుల్లో నీటి సమస్యలపై అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొనవల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికైనా కళ్ళుతెరిచి ‘నీటి సంక్షోభం’ పట్ల తగిన శ్రద్ధ వహించి ప్రజలు, ప్రభుత్వాలు చర్యలు చేపట్టవల్సిన అవసరముంది.

- గుండు రమణయ్య