సబ్ ఫీచర్

పాఠానికి ముందు సన్నద్ధత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గదిలో ఉపాధ్యాయుడు ప్రవేశించగానే- ‘సముద్రంలో చేపలు పట్టబోయే నావికుడు లంగరు వేసినట్టు’ తన మేధస్సుతో తరగతి గదిపై లంగరు వేస్తాడు. అది రాబోయే కాలానికి భూమికగా ఉపయోగపడుతుంది. దానికి రెండు,మూడు లక్ష్యాలుంటాయి. పిల్లలకు తాను చెప్పబోయే పాఠానికి సంబంధించిన కానె్సప్ట్‌ను అర్థం చేసుకునే పూర్వ పరిజ్ఞానం ఉన్నదా? లేదా? వారికి ఇందుకు సంబంధించిన నైపుణ్యం ఉన్నదా? లేదా? లేని నైపుణ్యాలను పిల్లల్లో ఎలా కలిగించాలి? చెప్పబోయే పాఠంలో ఆసక్తి రేకెత్తించే ఒక సంఘటననైనా చెప్పాలి. ఒక సమావేశానికి ముందు సంధానకర్త ఏం చేస్తాడో ఆ పని ఉపాధ్యాయుడు చేయాలి.
విద్యార్థుల నుంచి వచ్చిన స్పందనే సిగ్నల్‌గా మిగుల్తుంది. కొందరు ఉపాధ్యాయులు ఏదో ఒక సంఘటన చెప్పి నవ్విస్తారు. తరగతి గదిలో మొదటి అయిదు నిమిషాలే జరుగబోయే విద్యాప్రణాళిక సరళికి అద్దం పడుతుంది. అది తరగతి గదిని తనవైపుమరల్చుతుంది. అదే ఉపాధ్యాయుని ప్రజ్ఞ. దానికి ఒక ప్రత్యేక ప్రణాళిక చెప్పలేం. అందుకే ఉపాధ్యాయుడి జ్ఞానం, బోధనా అనుభవం కన్నా అతనిలో దాగిఉన్న వృత్తిపరమైన అంకిత భావం అర్థమవుతుంది. దీనే్న ప్రీ అసెస్‌మెంట్ (తరగతి గదిని పరీక్షించుకోవటం) అంటాం. ఈ ప్రీ అసెస్‌మెంట్ అన్నది తరగతి గదికి తాళం చెవి వంటిది. అది తరగతి గది ఆలోచనా ద్వారాలను తెరిచే సాధనం. తరగతి గదిలోకి అడుగుపెట్టేముందు ఉపాధ్యాయుడు ఆ సమర్థతను తనకు తాను సంపాదించుకోవాలి.
జయాపజయాలు..
ఒక వైద్యుడు రోగికి ఒక పద్ధతిలో చికిత్స చేస్తాడు. ‘ఆపరేషన్ సక్సెస్ - పేషంట్ డెడ్’ అన్నది విపరిణామం. ఊహించని పరిణామాలవల్ల పేషంట్ చనిపోయాడు. కొన్నిసార్లు ఒక మార్గంలో పయనించి లక్ష్యసాధన చేస్తారు. అప్పుడు వారిని విజయుడిగా పరిగణిస్తారు. అదే మార్గంలో రోగికి చికిత్స చేయబోతే ఫలితం రాకపోవచ్చును. ప్రాసెస్‌తో ఫలితాన్ని నిర్ణయించకూడదు. అదే మాదిరిగా తరగతి గదిలో ఒక పద్ధతిలో ఒక విద్యార్థికి చదువుచెబుతూ ఉంటారు. గురువు ఊహించని పరిణామాలు ఏర్పడి, ఫలితాలు రాకపోవచ్చును. అప్పుడు విద్యార్థి ఫెయిల్ అయ్యాడంటాం. తప్పులు పిల్లలపై నెట్టేస్తాం. ప్రాసెస్‌లో మనం ఊహించని పరిణామం ఉన్నదని, ఆ అపజయానికి కారణం తనేనని, తన అజ్ఞానం కారణమని చాలా తక్కువమంది గురువులు గుర్తించగలుగుతారు. అలాంటి గురువులే నిజమైన గురువులు. ఈ విషయంలో నేను అసొదొద్దీన్ అనే గురువును అనుభవ పూర్వకంగా చూశాను. ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని బెత్తంతో కొడితే సరిపోతుందని ఆయన నిర్ణయించుకున్నాడు. కానీ అది ఒకనాడు తిరగబడింది. అలా తిరుగబడ్డవాణ్ణి రౌడీ అనేవాణ్ణి. కానీ ఆ అసొదొద్దీన్ సారు నేను ఊహించనటువంటి తన అజ్ఞానం కూడా ఉందని, తన ప్రాసెస్‌లో తప్పుందని గ్రహించాడు. దాన్ని తెలుసుకునేందుకై ప్రయత్నం చేశాడు. ఆ విద్యార్థి ఆలస్యంగా రావటానికి కారణం ఏమిటి? అందులో ఆ విద్యార్థి ఇంటి పరిస్థితి దాగి ఉందని తెలుసుకుని చికిత్స మార్గం మార్చుకున్నాడు. అనగా దానిని తన అపజయం అనుకోలేదు. అపజయం వలన ఆయనకు కొత్తగా జ్ఞానోదయం కలిగింది. అపజయం మనిషిని కుంగదీయకూడదు. పద్ధతి మార్చటం కోసమై లేదా కొత్త జ్ఞానాన్ని సంపాదించటానికై అదొక అవకాశం. పరిణతి చెందిన వ్యక్తులకు వాళ్ల అపజయాలే సోపానాలు. కొత్త పద్ధతులు ఆలోచించటానికి అదొక అవకాశం. విద్యార్థి అపజయుడై పోయాడనే దానికి బదులుగా తాను అవలంబించిన పద్ధతి ఇక్కడ సరిపోదేమో అని గుర్తించగలిగిన వాడే నిజమైన ఉపాధ్యాయుడు. విద్యార్థి అపజయాలతో ఎన్నో విషయాలను నేర్చుకునేది గురువు. విజయాలతో నేర్చుకునేది విద్యార్థి. విజయం విద్యార్థిది, అపజయం గురువుది.

--చుక్కా రామయ్య