సబ్ ఫీచర్

అరచేతిలో అద్భుత ప్రపంచం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ తరం అమ్మాయిలు ఓ చిన్న బ్యాగ్‌లో రెండు డ్రెస్‌లు, పర్స్ నిండా ఎటిఎమ్ కార్డులు, సెల్‌ఫోన్ రీచార్జ్ కార్డులు పెట్టుకుంటున్నారు. క్యాష్ కూడా ఓ వెయ్యి రూపాయలు మించి ఉండటం లేదు. ‘క్యాష్‌లెస్ జర్నీ, లెస్ లగేజ్ జర్నీ మోర్ కంఫర్ట్’ అని చెపుతున్నారు. ఒక విధంగా నిజమే కాని అందులో ఎన్నో ఇబ్బందులే ఉన్నాయి. అవి వారికి ముందు అర్థంకావు. అందులో అమ్మ చెపితే అసలు వినిపించదు. రకరకాల రింగ్ టోన్స్- ఇవే వారి కాలక్షేపము. నెట్‌లు, టీవీల, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇంట్లో ఆటోస్టాప్ రైస్ కుక్కర్స్, ఆటోస్టాప్ వాషింగ్ మిషన్స్ వీటితో జీవితాలు గడిపేస్తున్నారు. వంట వార్పు ఇంటి పనులు అన్నీ తక్కువ సమయంలో స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్‌లతో గడిచిపోతుంది. ఇంట్లో ఉన్న మనుష్యుల ఉనికినే మర్చిపోయి జీవిస్తున్న రోజులివి. కరెంట్ పోతే ఆ అవస్థ భరించలేము.
కవిత ఈ తరం అమ్మాయి, ఫ్రెండ్ పెళ్లికని హైదరాబాద్ వచ్చింది. ఎటిఎమ్ మిషన్ పనిచెయ్యలేదు. బట్టల దుకాణంలో స్వైప్‌కార్డు పనిచెయ్యలేదు. చివరకు ఫ్రెండ్ తండ్రి ఇన్‌ఫ్లుయెన్స్ ద్వారా చెక్‌బుక్ వాడి డబ్బు తీసుకుంది. ఒక తేలిక పని వెనుక ఇంకొక సమస్య ఉంటుంది. పని చెయ్యడం చెప్పినంత తేలిక కాదు. ప్రతి పనికి రికమెండేషన్- ఇన్‌ఫ్లుయెన్స్ అంటే ఎలా? వ్యక్తులు ఎలక్టానిక్ పరికరాలకి అలవాటు పడిపోయారు.
ఇటీవల వాట్సాప్ గ్రూప్‌లు, ఫేస్‌బుక్ గ్రూపులంటూ, కార్తీక వనభోజనాలు, టీవీ ప్రోగ్రామ్స్‌కి ప్రత్యేకంగా వేరు వేరు దేశాలవారు కూడా వచ్చి పాల్గొంటున్నారు. భగవంతుడిచ్చిన రక్తసంబంధీకులు కొందరయితే, ఫోన్ ద్వారా వచ్చిన బంధువులు మరీ ఎక్కువ ఉన్నారు. ఇందులో రకరకాల వృత్తులు ప్రవృత్తులవారు ఉంటున్నారు. గతంలో పిలుపులకి కార్డ్స్ ఉండేవి. ఇపుడు పిలుపులన్నీ ఫోన్ మెసేజీల ద్వారానే జరుగుతున్నాయి.
వీడియో మెసేజ్‌లతో కాలం గడపడానికి చాలా బాగుంటుంది. ఎన్నో అంతర్జాతీయ విషయాలు తేలిగ్గా అతి తొందరగా తెలుస్తున్నాయి. కానీ మన ప్రక్క పోర్షన్‌లో ఎవరు ఉన్నారని తెలుసుకోలేకపోతున్నారు. నా స్నేహితురాళ్లలో ఒకామెల్లారాక 500 మెసేజీలకి వాట్సాప్ సమాధానాలిస్తుంది. రోజు ఇది ఒక రెండు గంటల పని. ఇంటి పనులు చేసుకుంటూ మనసుని ఫోన్‌పై కేంద్రీకరిస్తుంది. అయితే దానివల్ల ఆమెకు ఒక మానసిక శాంతి ఉంది అంటున్నది. ఆమె పిల్లలు తల్లిని హెచ్చరిస్తూనే ఉంటారు. ఆ టైమ్‌లో మంచి పుస్తకం చదువుకోవచ్చు అంటారు. ఒక కూతురు లెక్చరర్, కొడుకు సైకియాట్రిస్ట్. మా పనులు మీరే చేస్తున్నారు కదా, ఇంకెందుకు మాకు బెంగ అంటుంది. అయితే ఫేస్‌బుక్ ద్వారా వచ్చే వీడియోల, వాట్సాప్ ద్వారా వచ్చే కొసమెరుపు మెసేజీలు విశే్లషణాత్మకంగాను వినోదాత్మకంగా ఉంటాయి. కాని మనిషిని మనిషి మర్చిపోతున్నారు.
గతంలో హెడ్ ఆఫీసునుంచి న్యూస్ అందడానికి రెండు రోజులు పట్టేది. ఇప్పుడు సెకనులో మెసేజీలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆఫీసుల్లో క్షణాలమీద మార్పులు అందరికీ తెలియపరుస్తున్నారు. అటెన్షన్‌లో ఉండాల్సి వస్తోంది. వెబ్ కెమెరాల ద్వారా పిల్లలు విదేశాల్లో ఉన్నా అన్ని విషయాలు సెకనులో తెలుసుకొంటున్నారు. మాకు తెలిసిన ఆమె కూతురు విదేశాల్లో ఉండి, రోజూ తల్లితో ఏ కూర ఎలా చెయ్యాలో తెలుసుకుని వండి చూపిస్తోంది. ఉదయం, సాయంత్రం అన్ని విషయాలు తల్లితో చెపుతుంది. ప్రక్కన ఉన్నట్టే ఉంటుంది.
గతంలో గోడల దగ్గర, అరుగులమీద కబుర్లు చెప్పుకునే అమ్మలక్కలు ఇపుడు వెబ్ కెమెరాల దగ్గర, వాట్సప్, ఫేస్‌బుక్‌లు, టచ్‌లు, నెట్‌లు వాడి ఎలక్ట్రానిక్ అమ్మలక్కలవుతున్నారు. ప్రక్కింటి ఎదురింటి విషయాలే గాదు అంతర్జాతీయ విషయాలు కూడాప్రతివారు అనర్ఘళంగా చెప్పేస్తున్నారు. దాన్ని అడ్వాన్స్ అనాలా? డోక్రా గ్రూపుల మాదిరి సెల్‌ఫోన్ గ్రూపులు పెరిగిపోతున్నాయి. థాంక్స్ టు సెల్‌ఫోన్. అరచేతిలో ప్రపంచాన్ని, వైకుంఠాన్ని చూపించే ఫ్రెండ్ ఉండగా ఇంక మనకు ఆలోచనలేమిటి?

- ఎన్. వెంకటలక్ష్మి