సబ్ ఫీచర్

ప్రేమ పిలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రతుకు భారమైందా? దుర్మార్గులు నిన్ను బంధించారా? అనుక్షణం బాధింపబడుతున్నావా? భారమైన కాడి నీ మెడపై ఉందా? పాపభారం భరించలేకున్నావా? శాపభారం కృంగదీస్తోందా? అప్పుల భారం.. తప్పుల భారం ఎక్కువైందా? పనిభారం.. కుటుంబ భారం మోయలేకున్నావా? ఇంకా చెప్పుకోలేని హృదయ భారం ఏదైనా ఉందా?
ఐతే -ఎటువంటి శ్రమలైనా.. కారుమేఘాల వంటి కష్టాలైనా.. సొమ్మసిల్లిన వారందరినీ ఆదరించి కాపాడి భద్రపరచి క్షమించి కరుణించి శత్రువు బంధకాల నుండి విడిపించి శా బ్రతుకు భారమైందా? దుర్మార్గులు నిన్ను బంధించారా? అనుక్షణం బాధింపబడుతున్నావా? భారమైన కాడి నీ మెడపై ఉందా? పాపభారం భరించలేకున్నావా? శాపభారం కృంగదీస్తోందా? అప్పుల భారం.. తప్పుల భారం ఎక్కువైందా? పనిభారం.. కుటుంబ భారం మోయలేకున్నావా? ఇంకా చెప్పుకోలేని హృదయ భారం ఏదైనా ఉందా?
ఐతే -ఎటువంటి శ్రమలైనా.. కారుమేఘాల వంటి కష్టాలైనా.. సొమ్మసిల్లిన వారందరినీ ఆదరించి కాపాడి భద్రపరచి క్షమించి కరుణించి శత్రువు బంధకాల నుండి విడిపించి శాంతి సమాధానం ఇచ్చే యేసు ప్రభువు ప్రేమ పిలుపును అందుకొందాం.
‘ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును - మత్తయి 11:28
ఈ రోజుల్లో మానవాళి హృదయాలన్నీ భారంతో నిండి ఉన్నాయి. ఈ భారాన్ని గనుక కొలువగలిగితే వేలకొద్దీ బరువు ఉండవచ్చు. కొందరి ఆలోచనా భారాన్ని కొలిస్తే ఈ భూమి బరువుకన్నా ఎక్కువగానే ఉంటుందేమో. ఇంకా కొంతమంది ప్రపంచాన్ని తామే మోస్తున్నట్టు కనపడుతుంటారు.
‘ప్రభువు మీ గురించి చింతించుచున్నాడు. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి - 1 పేతురు 5:7 ఈ భారాన్ని దించుకొనే ప్రయత్నంలో చాలావరకు త్రాగుడు, జూదం, వ్యభిచారం వంటి వాటికి అలవాటుపడి ఉన్న భారాన్ని ఇంకా పెంచుకొంటున్నాడు మానవుడు. ఒక్కొక్కసారి ఈ భారాన్ని మోయలేక వేరే దారిలేక ఆత్మహత్యకు పూనుకొంటున్నాడు. లేదా కుటుంబాలను, పనులను వదిలి దూరంగా పారిపోతున్నాడు. - ఎటువంటి పరిస్థితులనైనా ఎంత భారంగా ఉన్నా భూమ్యాకాశములను (సృజించిన) మాటతో సృజించిన ప్రభువు యొద్దకు విశ్వాసముతో వచ్చినట్లయితే మీకు విశ్రాంతి దొరుకుతుంది.
‘విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము’ - హెబ్రీ. 11:6
కొన్నిసార్లు బాధ్యతల బంధకాలు చుట్టుకొని మనిషిని కదలనివ్వవు, మెదలనివ్వవు. ఒక్కోసారి వాళ్లేమనుకొంటారో వీళ్లేమనుకొంటారో అనే ఆలోచన కూడా భారంగానే తోస్తుంది.
‘నా యొద్దకు వచ్చువారిని నేనెంత మాత్రము త్రోసివేయును’ అని ప్రభువు సెలవిస్తున్నాడు.
దయాదాక్షిణ్యపూర్ణుడు, కృపాసమృద్ధి గలవాడు, ఎంతటి ఘోర పాపినైన క్షమించుటకు సిద్ధమనసు గలవాడు, పరమ వైద్యుడు, మరణాన్ని గెల్చి మరణపు ముల్లును విరిచిన వాడు, పాపములు క్షమించుటకు అధికారం గలవాడు ఆయన. కనుక ఆయన పాద సన్నిధికి చేరి విశ్రాంతిని పొందుకొందాం.
మనుషులను నమ్ముకొని ఎంత మోసపోయాం. ఇక చాలు. మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణానే్న ఇచ్చిన ప్రభువు.. నిరంతరం మన కొరకు ఆలోచిస్తూనే ఉన్నాడు. గనుక మన చింత యావత్తూ ఆయనపై వేసి విశ్రాంతి పొందుదాం. మన పాప భారమంతా మోసి సిలువకు కొట్టబడి మనకు విమోచన కలుగజేసిన ఆయన పిలుపునకు లోబడి ఆయన ఇచ్చే విశ్రాంతిని పొందుదాం.

-మద్దు పీటర్ 9490651256