సబ్ ఫీచర్

మార్పు సహజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి తరంలో పెద్దవాళ్లు మా కాలంలో ఇట్లాంటివి చూడలేదండీ అంటుంటారు. నిజమే. తరతరానికి మార్పులు వస్తూనే ఉంటాయ. మార్పు లేకపోతే మనిషే కాదంటారు కొందరు. కనుక పెద్దలకు పిన్నలకు తేడాలు తప్పని సరి కాని ఈ పిన్నలు చేసేవాటిని కొంత పెద్దలు పట్టించుకోకపోవడమే నేడు మంచిదంటున్నారు మానసిక వైద్యులు.
ఈ మారుతున్న అలవాట్లని పెద్దలే పిల్లలద్వారా తెలుసుకుని అనుకరిస్తున్న రోజులివి. ఇదేంటి ఇలా చేస్తున్నారు అంటూ పిల్లలపై విరుచుకుపడిపోకుండా వారి చేష్టలు చూసి కోపంతో ఊగిపోవడంకన్నా కాస్త ఆగి సున్నితమైన మనసుతో వారిని అర్థం చేసుకోవడమే మేలు. ఎదిగే వయసు పిల్లల్లో మాటకారితనం వారి కెరీర్‌కి దోహదపడుతుంది. ఒకరిని ఎగతాళి చేస్తూ మరొకరు చతురతగా మాట్లాడ్డం, జోక్స్ వేయడం భవిష్యత్‌లో కొత్త చోట్లకి వెళ్లినా అక్కడివారితో త్వరగా కలిసిపోయే గుణం, చొరవగా దూసుకుపోయే తత్వం అలవడతాయి. ఇట్లా అందరితో కలుపుగోలుగా మాట్లాడేవారిది అందరినీ ఆకట్టుకునే తత్వం అని రానురాను తెలుస్తుంది. ఇట్లాంటివారిని అలాకాక వారేదో పెద్ద నేరం చేస్తున్నారనో వారిని కట్టుదిట్టం చేయాలని కాక ఆ ఎగతాళి ఇతరుల మనసును నొప్పించకుండా ఉండాలనేది పెద్దవాళ్లు చెప్పితే సరిపోతుంది. ఎదిగిన పిల్లలను స్నేహితుల్లా పరిగణిస్తూ వారికి తెలియనివి మృదువుగా చెప్పితే చాలు వారు పరిస్థితులను ఆకళింపు చేసుకొని ముందుకు పోతారు. అట్లా కాకపోతే
సహజంగా వారిలో ఏదో తప్పు చేశామేమో నని వారు ఆత్మన్యూనతకి లోనవుతారు. దాంతో నలుగురిలోకి వెళ్లడానికి సంకోచం కలుగుతుంది. మనసులో మంచి తలంపు కలిగినా పైకి చెప్తే ఏమనుకొంటారో లే అని మనసులోనే అణచేసుకుంటారు. హద్దులు దాటనంతవరకు ఏ అల్లర్లు, చిలిపిచేష్టలు తప్పుకావు. కనుక ఒత్తిళ్లని పోగొట్టే సరదా నవ్వులు, ఒంటరితనం, ఆత్మన్యూనతల్ని దరిచేరనివ్వని అల్లరి ఫ్రెండ్‌షిప్‌లు వారికి మేలే కలిగిస్తాయి.

- జె. శ్యామసుందరి