సబ్ ఫీచర్

పిల్లల కుంగుబాటుపై కనే్నయండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిరోజూ వార్తల్లో యువత ఆత్మహత్యల గురించి వింటున్నాం. పరీక్షల సమయం, ఫలితాలు వెలువడిన వేళ, లవ్ బ్రేకప్, ప్రేమను తిరస్కరించడం, నిరుద్యోగం, ఆర్థిక సమస్యలు వంటి కారణాలతో ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మిగిలిన వయసుల వారికంటే యుక్తవయస్కులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సుమారు 34.5 శాతం మేరకు 15-29 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారే సూసైడ్ చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా మనదేశం ఆత్మహత్యల్లో 42వ స్థానంలో ఉంది.
ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు..
కుటుంబ సమస్యలు, మానసిక అనారోగ్యం, నిరుద్యోగం, ప్రేమ, డ్రగ్స్, చెడు అలవాట్లు, పరీక్షలలో ఫెయిల్ కావడం, వ్యాపారం దివాలా తీయడం, ఆర్థిక సమస్యలు, పేదరికం, వరకట్న వేధింపులు, వివాహేతర సంబంధాలు.
సాధారణంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న యువతకే సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. కొన్ని సందర్బాల్లో వారు సూసైడ్ చేసుకుంటామని బెదిరిస్తున్నప్పుడు తల్లిదండ్రులు వారి సమస్యకు పరిష్కారం చూపే దిశగా అడుగులు వేయాలి. ఒకవేళ తల్ల్రిదండ్రులు వారికి సహయం అందించకపోతే, బెదిరించిన విధంగానే సూసైడ్‌కు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పిల్లలతో తల్లిదండ్రులు స్నేహితుల మాదిరి ఉంటూ వారి సమస్యలు గుర్తించి సూచనలు, సలహాలు ఇవ్వాలి. వారి ఆలోచనలు అరికట్టే విధంగా మసలుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల ఫ్రెండ్స్ తో కూడా తరచూ టచ్‌లో ఉండాలి. పిల్లల ఆక్టివిటీస్‌పై ఫోకస్‌గా ఉండాలి.
ఆత్మహత్యకు పాల్పడే వారిలో లక్షణాలు..
మానసిక సమస్యలను పిల్లలు బయటికి చెప్పరు, వారి ప్రవర్తనను గుర్తించి మనమే సహయం అందించాలి. ఆత్మహత్య దిశగా ఆలోచించేవారిలో ఏకాగ్రత ఉండదు, నిరాశగా కనిపిస్తారు, అందరితో కలిసిపోవాలన్న ఆలోచన ఉండదు, వారిపై వారికే ఆసక్తి తగ్గుతుంది. భవిష్యత్, చదువుపై అభద్రతా భావంతో ఉంటారు. ఆహారం తినే రీతిలో మార్పులు వస్తాయి, నిద్రకు సంబంధించిన సమస్యలు (ఎక్కువగా లేదా తక్కువగా నిద్రించడం) కనిపిస్తాయ.
ఆయుధాలతో ఇతరులపై దాడి చేయవచ్చు, లేదా వారిపై వారు దాడి చేసుకోవచ్చు, ఉద్దేశ పూర్వకంగా ఆస్తులకు నష్టం కల్గించవచ్చు. లేదంటే వారు కడుపు నొప్పి, తలనొప్పులు, నీరసం వంటి సమస్యలు ఉన్నాయని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్‌తో మాట్లాడటం మానేయవచ్చు. ఎక్కువ సన్నిహితంగా ఉండే వారికి వీరిలో మార్పు కన్పిస్తుంది. వీరికి కొత్త వాతావరణం అలవాటు పడటానికి చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని సార్లు డిప్రెషన్ నుంచి బయట పడ్డాక ఎక్కువ సంతోషంగా ప్రవర్తిస్తుంటారు. ఈ ఆనందానికి అర్థం వారు సమస్యలు విడిచి పెట్టాలని నిర్ణయించుకోవడం లేదా రిలాక్స్ కావడం.. కానీ ఇది మీ పిల్లలు సాధారణ స్థితికి చేరుకున్నారని తప్పుదారి పట్టించే సూచన.
నేను మిమ్మల్ని ఇకపై ఇబ్బంది పెట్టను, ఎలాంటి ప్రయోజనం లేదు, ఏదీ ముఖ్యం కాదు, నేను మిమ్మల్ని మళ్లీ కలుసుకోలేను, నేను ఇకపై మీకు బరువు కాను.. వంటి మాటలు మీ పిల్లలు చెప్తే కొట్టిపారేయకూడదు. నేను చనిపోవాలనుకుంటున్నాను, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను.. అని చెప్పినట్లయితే మీరు వెంటనే సైకాలజిస్టుల వద్దకు తీసుకువెళ్లాలని గు ర్తుంచుకోండి. ఈ లక్షణాలు మీ పిల్లలలో కనిపించినా, వారు సూసైడ్ చేసుకునే ప్రమాదం ఉందని భావించినా వెంటనే మానసిక నిపుణులు, యూత్ కౌన్సిలర్లను సంప్రదించడం ఎంతో అవసరం.

-ఆర్.ఎల్.మూర్తి murthytwo@gmail.com