సబ్ ఫీచర్

నకిలీ మందులతో ఆరోగ్యం ‘హరీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన ఆరోగ్య వ్యవస్థకు కట్టుదిట్టమైన ధీమా ఇవ్వాల్సిన ఔషధరంగమే డొల్లపోయి, వివిధ ఔషధాల కంపెనీలు ఉత్పత్తిచేస్తున్న మందులు మానవాళికి అనారోగ్యకర ప్రభావం చూపుతున్నాయంటే అవి వ్యాధి నిరోధక మందులా? లేక అనారోగ్యాన్ని ప్రేరేపించే మృత్యుపాశాలా అనిపించక మానదు. ప్రజారోగ్యంపై అత్యంత దుష్ప్రభావం చూపుతున్న 344 ఔషధాల ఉత్పత్తి, సరఫరాలపై కేంద్ర ఔషధ నియంత్రణ నిషేధం విధించింది. ఈమేరకు నిషేధ జాబితాలోని మందులను విక్రయించకుండా వాటిని వెనక్కి పంపించాలని ఆ సంస్థ సిఫార్సులమేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ -ఎఫ్‌డీసీ- ఔషధాల పేర జలుబు, దగ్గు, జ్వరం వంటి వేర్వేరు రోగాలకు విడివిడిగా మందులు వాడకుండా అన్నింటినీ కలిపి ఒకే గాటిన కట్టేసినట్లు ఒకే మాత్ర, లేదా సిరప్ రూపేణా తయారైన ఈ ఔషధాలను విరివిగా వాడకంలో ఉన్నట్లు ఔషధ అధ్యయన కమిటీ నిగ్గుతేల్చింది. రాష్టస్థ్రాయి నియంత్రణాధికార సంస్థల అనుమతులతో మార్కెట్లలోకి ప్రవేశించి విస్తృతంగా అమ్ముడవుతున్న ఆరువేలకు పైగా ఎఫ్‌డీసీలను నిపుణుల కమిటీ కూలంకషంగా పరిశీలించి ఇప్పటికి 344 ఔషధాలు అసంబద్ధమైనవిగా నిర్ధారించింది. మరిన్ని ఔషధాలపై లోతైన సమీక్ష జరుగుతోందని, వచ్చే ఆర్నెల్లలోగా దేశంలో మరో 500 ఔషధాలపై నిషేధాస్త్రం ప్రయోగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వార్తాకథనాలు చాటుతున్నాయి.
ఇలాంటి అహేతుకమైన, హేతుబద్ధంకాని మందుల్ని దీర్ఘకాలం వాడితే ప్రమాదకరాలైన మందుల్ని జనం నెత్తిన రుద్ది సొమ్ము చేసుకొన్న సంస్థలపైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలో మరే దేశాలలోనూ లేనంతగా ఎఫ్‌డీసీ ఔషధాల విక్రయం ఇండియాలో జరుగుతోంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా మార్కెట్లలో విక్రయానికి నోచుకోని యాంటీబయోటిక్ ఎఫ్‌డీసీలూ ఇక్కడ యధేచ్ఛగా అమ్ముడవుతున్నాయి. మన దేశంలో 60వేలకు పైగా రకరకాల ఔషధాలు అందుబాటులో వుంటే, వాటిలో 43 శాతం ఎఫ్‌డీసీలేనని, పరస్పరం ముడివడిన పలు రోగాలను ఒకే మాత్ర ద్వారా నయం చేసే సౌలభ్యాన్ని రోగులకు అందజేస్తున్నామని ఔషధ తయారీ సంస్థలు వాదిస్తున్నాయి. వాటిలో అనేకం అసంబద్ధమైనవని ఆరోగ్య నిపుణులు ఎంతోకాలంగా మొత్తుకొంటున్నారు. జ్వరంనుంచి చక్కెర వ్యాధి దాకా, గుండెనుంచి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లదాకా వాడే పలు రకాల ఔషధాల్లో రోగికి అవసరంలేని డోసేజీలూ అధికంగా ఉండి వారికి ఇతర వ్యాధుల సంక్రమణానికి శ్రీకారం చుడుతున్నారని తెలియజెప్పారు.
మానవాళికి ప్రాణాంతకంగా ఉన్న మందులు గురించి కేంద్ర ఔషధ నిపుణుల బృందం నిర్ధారించినా, ఇప్పటి నిషేధిత మందుల్ని భారతీయులు గత 30 సంవత్సరాలుగా వాడుతున్నారని, వాటి వాడకంవలన ప్రజలకు ఎలాంటి అనారోగ్యపు ముప్పు వాటిల్లలేదని, కాబట్టి అవి ప్రమాదకర మందులు కావని ఢిల్లీ హైకోర్టులో ఔషధ సంస్థలు వాదించినా, శాస్ర్తియపరంగా రుజువవుతున్న తరుణంలో జనాలను ఔషధ ప్రక్రియలతో అనారోగ్యానికి గురిచేయడం తగదని, ఔషధ సంస్థల దృష్టికి రానంతమాత్రాన జనారోగ్యాలు మంట కలుస్తుంటే చూస్తూ ఊరుకోబోమని కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరిక చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దని సూచించింది.
భారత ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ వైద్యశాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పేరుతో పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న ఔషధ సంస్థల్ని ఒక కంట కనిపెట్టడమే కాకుండా, జన జీవనానికి ముప్పుతీసుకువచ్చే సంస్థలను వెనువెంటనే రద్దుచేయాలి. విదేశాలలో ఏదైనా కొత్త ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చే ముందు వైద్య, ఆరోగ్యపరమైన విస్తృత పరీక్షలు జరపడమే కాకుండా, ఆ తర్వాత పలు అధ్యయనాలు చేసి, అది ప్రజారోగ్యానికి, వ్యాధి నిరోధకానికి సరైందో కాదో దాని నాణ్యతాప్రమాణాల్ని నిర్ధారిస్తారు. ఆపాటి స్థాయి భద్రతా ప్రమాణాల్ని ఔషధ సంస్థలు ఇండియాలో పాటించకపోవడంతో భారతీయులకు ఆరోగ్యపరమైన ముప్పు పొంచి ఉందని ప్రతిష్టాత్మక లాంసెట్ జర్నల్ నిరుడు హెచ్చరించింది.
వైద్య రంగంలో మరో దురదృష్టకర పరిణామమేమిటంటే ఇన్‌ఫెక్షన్లలో 90 శాతం వైరల్‌కు చెందినవేనని వాటికి యాంటీ బయోటిక్స్ వాడుతున్న వైనంపై వైద్య నిపుణులు తీవ్ర ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. వైద్య పరిజ్ఞానం ఏమాత్రం లేకుండా, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకపోయినా, పామరులకు ఇబ్బడిముబ్బడిగా ఔషధాలను విక్రయిస్తున్న ఫార్మసిస్టులపై ప్రభుత్వం ఆంక్షలు విధించాల్సిన అవసరం ఎంతైనావుంది. అరకొర వైద్య పరిజ్ఞానంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్ళలేక, అక్కడి ఫీజులను భరించలేక మందుల దుకాణాలకు ప్రజలు వెళితే వారికి సరైన నిర్దేశం చేయకుండా అంతా మాకే తెలుసని మాత్రలను కట్టబెట్టి డబ్బులు గుంజుకోవడం అమానుషం. భారత జాతి ప్రజల ఆరోగ్యం, వైద్య విధానాన్ని సక్రమంగా అమలుపరిచే బాధ్యత ప్రభుత్వాలకుంది. ఆరోగ్య పరిరక్షణ విధానంలో తప్పటడుగులు వేసి డబ్బులు పిండుకుంటున్న ప్రైవేటు డాక్టర్ల పీడన నుండి పరిరక్షించేందుకు ప్రభుత్వపరమైన వైద్యశాలలకు తగినంత మంది డాక్టర్లును, వైద్య సిబ్బందిని, వౌలిక వసతులు, వైద్యశాలలకు అవసరమైన మందులకు నిధుల విడుదల చేసి ప్రజారోగ్యాన్ని కాపాడే బాధ్యతనుండి ప్రభుత్వాలు ఏనాడు తప్పుకోలేదు.
ప్రభుత్వాలపరంగా ఔషధాల తయారీ సంస్థలపై గట్టి నిఘా ఉంచడమే కాకుండా, ఆయా సంస్థలు తయారుచేసే ఔషధాలపై వైద్యరంగ నిపుణుల కమిటీని వేసి వారు తయారుచేసే మందులు జన ఆరోగ్యకరమైనవా? వారు తెలిపినట్లు ఆయా వ్యాధులను నయంచేసేందుకు ఉపయోగపడతాయా? లేదా అనే అభిప్రాయాన్ని నిపుణుల కమిటీ సంపూర్ణ విశ్వాసం తెలిపితే గానీ, ప్రభుత్వాలు ఆయా మందుల ఉత్పత్తిని మార్కెట్‌లోకి రాకుండా చూడాలి. ప్రజారోగ్యం, వ్యాధుల నివారణ నెపంతో కోకొల్లలుగా వస్తున్న నకిలీ మందులతో జనాలకు ఆరోగ్యం చేకూరకపోగా, మరిన్ని వ్యాధులకు మూలమవుతున్నాయి.

- దాసరి కృష్ణారెడ్డి