సబ్ ఫీచర్

ప్రజ్ఞావేదం-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అష్టావక్రుడిని జనకుడు అడిగాడు; ఓ గురువరేణ్యా! ఓ ప్రజ్ఞాత్మా! ఓ ప్రభూ! ఎవరైనా ప్రజ్ఞను ఎలా సిద్ధించుకోవాలి? మరి విముక్తి ఎలా సంభవిస్తుంది? నిస్సంగం ఎలా సాధించబడుతుంది? దయతో నాకు తెలియజేయండి అని!
జనకుడు మిథిలా నగరానికి రాజు. అష్టావక్రుడికి పనె్నండు సంవత్సరాల వయస్సున్నప్పుడు, ‘జనక మహారాజు’’ ఒక ‘‘వేదగోష్ఠి’’ని ఏర్పాటుచేసి, దేశదేశాల్లోని పండితులెందరినో ఆహ్వానించాడు. తన రాజసౌధంవద్ద రత్నఖచితమైన బంగారు రేకులతో అలంకరింపబడిన వేయి ఉత్తమ జాతి గోవులనుంచాడు. ఈ వేదగోష్ఠిలో విజేతలయిన వారికివి స్వంతం అని ప్రకటించాడు.
అది అతి గొప్ప చర్చావేదిక. గొప్ప పండితుడైన అష్టావక్రుడి తండ్రి కూడా అందులో పాల్గొన్నాడు. అతడు అందరినీ ఓడించి చివరకు ‘‘వందినుడు’’ అనే మహాపండితుడి చేత ఓటమిపాలవుతున్నాడనే విషయం అష్టావక్రుడి ‘‘దివ్య నేత్రం’’గ్రహించింది. వెంటనే అష్టావక్రుడు తన యోగశక్తితో ఆ ‘‘జనకరాజసభ’’కు వెళ్ళాడు. సభ అప్పటికి ముగింపుకొస్తోంది. అష్టావక్రుడి తండ్రి ఓటమి తథ్యం అనే స్థితిలో వుంది చర్చాగోష్ఠి. ఎనిమిది స్థానాల్లో అంగవికృతి కల్గి, వంగిపోయివున్న అష్టావక్రుడు రాగానే, ఆ ‘‘వేదగోష్ఠి సభ’’లోకి పండితులంతా వంగిపోయిన నడుముతో అష్టవంకరలతో కూడిన అష్టావక్రుడిని చూసి పగలబడి నవ్వారు. వారంతా గొప్ప వేదవిదులు- సకల శాస్త్రాలలో దిట్టలు- వేదంలో ఘనాపాటీలు. అటువంటి వారంతా నవ్వగానే అష్టావక్రుడు కూడా విరగబడి నవ్వాడు.
వాస్తవానికి భౌతిక ప్రపంచ మాయామోహాల్లో ఉన్న వారెవరైనా అష్టావక్రుడిని చూడగానే నవ్వడం మొదలుపెడతారు. ఎందుకంటే అతడి ప్రతి కదలికా చూసేవారికి నవ్వు పుట్టిస్తుంది. అష్టవంకరలతో కూడి అంత చిత్రవిచిత్రంగా ఉంటుంది అష్టావక్రుడి శరీరం. - జనకుడు పండితులందరి నవ్వులతోబాటు ఆపైన విరగబడి నవ్వుతున్న అష్టావక్రుడిని చూసి ‘‘స్వామీ! మిగిలిన వారంతా నవ్వడానికి కారణం సులభంగా అర్ధమవుతోంది. మిమ్మల్ని చూడడంవల్ల - మరి మీరెందుకు నవ్వుతున్నారు కుమారా అని వినయంగా ప్రశ్నించాడు. అష్టావక్రుడిలా అన్నాడు- ‘‘నేనెందుకు నవ్వుతున్నానంటే ఈ గోష్ఠిలో చర్మకారులచేత సత్యం నిర్ణయింపబడుతోంది; అలాకాకపోతే మరి ఈ చర్మకారులందరూ ఇక్కడ ఏం చేస్తున్నట్లు? నీ ఉద్దేశ్యం సూటిగా వివరించు కుమారా అన్నాడు జనకుడు. నేను చెప్పేది సరళం మరి సూటి అయింది. వీరంతా మహావేద పండితులై ఉండి కూడా వారు కేవలం నా చర్మాన్ని మాత్రమే చూస్తున్నారు- కాని వారు నన్ను చూడడం లేదు. వీరు గొప్ప పండితులైనట్లయితే, వీరందరికన్నా అధిక స్వచ్ఛతకల ఈ అష్టవంకరులున్న దేహంలోని సరళమైన మానవుడిని చూసేవారు. వారి దురదృష్టవశాత్తూ వారు వంగిపోయి కురూప రూపంలోని శరీరాన్ని మాత్రంచూస్తూ మానసికంగా ఎనభై వంకరలు కలిగి వున్నారు. వారంతా చర్మాన్నిబట్టి విషయాన్ని నిర్ణయించే చర్మకారులు. మహారాజా! నా శరీరం వంకరలు తిరిగి వుంది- కానీ నేను కాదు. అంతఃదృష్టి కలవారు మాత్రమే అంతరంగంలో ఉన్న ఆత్మసూర్యుడిని చూస్తారు. ఇక్కడ ఎవరూ అలా చూసే స్థాయిలో ఉన్నవారు లేరు. అందుకే వీరంతా ‘చర్మకారులు’. అత్యంత దిగ్భ్రాంతి కల్గించే ఈ అష్టావక్రుడి వాక్కులతో సభంతా నిర్ఘాంతపోయింది. పండితులం- ఘనాపటులం అనుకుని నవ్వినవారంతా సవ్వడి లేకుండా లేచి ఆ రాజసభ నుండి నిష్క్రమించారు. జనకుడు ఆ యొక్క అష్టావక్రుడి పలుకులకు ప్రభావితుడయ్యాడు. తాను వాస్తవంగానే ఒక పెద్ద చర్మకారుల గుంపును సమావేశపరిచాను అనుకున్నాడు. పశ్చాత్తాపానికి గురయ్యాడు- తాను కూడా నవ్వినందుకు అపరాధ భావనకు లోనై! మరురోజు తన దిన చర్యలో భాగంగా ప్రాతఃకాల నగర సందర్శన నిమిత్తమై బయటకువచ్చిన జనకుడు దారిలో అష్టావక్రుడిని చూశాడు. ముందురోజు సభల్లో ‘‘కుమారా’’అని సంబోధించిన జనక మహారాజు- అష్టావక్రుడి పనె్నండు సంవత్సరాల వయస్సును పరిగణనలోకి తీసుకున్నాడు. ఈరోజు ‘‘రాజర్షి’’అయిన జనకుడు- ‘‘దేహంలో ఉంటూనే దేహభావన ఏమాత్రం లేని అష్టావక్రుడిగా’’ గ్రహించి తన అశ్వంపైనుండి దిగి ఆ నడివీధిలోనే ‘‘సాష్టాంగ దండప్రమాణం’’ ఆచరించాడు. మహా ప్రజ్ఞా! దయవుంచి నా గృహాన్ని సందర్శించి ‘‘సత్యం తెలుసుకోవాలని ఆకాంక్షిస్తున్న నా అంతరాన్ని తృప్తిపరచండి- నన్ను కటాక్షించండి ‘‘మీ రాకకై ఈ ఆత్మ అలమటిస్తోంది- వేం చేయండి’!
(ఇంకా వుంది)

--మారం శివప్రసాద్ 9618306173, 8309912908