సబ్ ఫీచర్

వాడిపోని పూల స్మృతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘వాడి పోవని పూలు వాసనల మురిపించు
వీడిపోవని స్మృతులు వేదనల మరిపించు’’ అన్నారు చే.రా.గారు.
అది అక్షరాలా నిజం.
కాని, నేటి పరిస్థితి ఇది కాదు ... అన్నింటికన్నా కష్టమైన దశ - జీవితంలో, బాల్యం నుంచి ప్రయాణించి, యవ్వనంలోంచి ఈదుకుంటూ వృద్ధాప్యంలో అడుగుపెట్టడం. బాల్యంలో అతిగా మాట్లాడినా, మితంగా మాట్లాడినా, తప్పుగా మాట్లాడినా పెద్దలు, ఇంట్లో వాళ్ళూ, తల్లిదండ్రులూ సరిదిద్దుతారు. కొన్ని సందర్భాలలో వారి మాటలకు నవ్వుకుంటారు. యవ్వనదశ సరేసరి. అన్నీ తెలుస్తాయి. విద్యా, వివాహం అన్నీ జరుగుతాయి. జీవితాన్ని ఎలా దిద్దుకోవాలో ఎలా బతకాలో వారి ప్రణాళికలు వాళ్లు నిర్మించుకుంటారు. కొడుకులూ, కోడళ్లూ, కూతుళ్ళూ, అల్లుళ్లూ, బంధువులతో వారి ఆనందాలకి పందిళ్ళు వాళ్లే వేసుకుంటారు. తెలిసో తెలీకో కొన్ని అవకతవకలు జరిగితే, వారి జీవితానికి వారే బాధ్యత వహిస్తారు. సుఖ దుఃఖాలన్నింటినీ చాకచాక్యంగా, ఎన్ని కష్టానిష్ఠూరాలనైనా భరించి, నడుచుకుంటారు. ఇక మూడవది వృద్ధాప్య సమస్య. శరీరం బలాన్ని కోల్పోతుంది. కాళ్లూ చేతులలో శక్తితోపాటు కండరాల బిగువూ సడలుతుంది. దానికితోడు అస్వస్థత చోటుచేసుకుంటే, పరాధీనంగా బతకవలసి వస్తుంది. కొన్ని సందర్భాలలో మెదడుకి సంబంధించిన వ్యాధి అంటే అప్పుడే జరిగిన విషయాలన్నీ కూడా మర్చిపోతారు.
కానీ చిత్రమేమిటంటే పాత విషయాలు మాత్రం మెదడులో పాతుకుపోయినట్టు జ్ఞాపకం వుంచుకుంటారు. దీన్ని అల్జీమర్స్ వ్యాధి అంటారు. అలాంటివారిని ఒంటరిగా వదిలిపెట్టాలంటే భయంగా వుంటుంది. ఈ రోజుల్లో అందరూ ఉద్యోగాలకి వెళ్లిపోతున్నారు. ఇంట్లో ఆడవాళ్లు కూడా ఉండడం లేదు. కొన్నాళ్లలో పిల్లలందరూ విదేశాలల్లో వుంటున్నారు వాళ్ల వాళ్ల పన్లమీద. వృద్ధులకు ఆరోగ్యం చెడిపోతే, కనీసం తిండికి కూడా నానా తిప్పలూ పడిపోతున్నారు. ఆడవారికి కోరుకున్న స్వాతంత్య్రం లభిస్తోంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కానీ సరైన క్రమశిక్షణ, విలువలూ, పాఠశాలల్లో గురువులూ చెప్పడంలేదు. ఇంట్లో అమ్మమ్మలూ నాన్నమ్మలూ తాతయ్యలూ చెప్పడం లేదు.
బళ్ళో టీచర్లకుకూడా, చదవకపోయినా, తప్పు చేస్తే మందలించినా పిల్లలు ఇంటికెళ్లి తల్లిదండ్రులతో ఫిర్యాదు చేస్తే వాళ్లొచ్చి, వీళ్లతో దెబ్బలాడడం జరుగుతోంది. అమ్మమ్మలకీ, నాన్నమ్మలకీ కూడా మనవలకి గట్టిగా చెప్పే అధికారం లేదని, పెద్దవాళ్లు పిల్లల ముందే చెప్పేస్తున్నారు. ‘‘మీరు జోక్యం చేసుకోకండి. మేమం చెప్పుకుంటాం కదా మా పిల్లలకి’’ అంటున్నారు.
‘‘నానమ్మా.. నువ్వూరికే చెప్పకు. నువ్వు ‘ఎక్స్‌టెండెట్ ఫ్యామిలీ’ అంతే.. ఫామిలీ అంటే, అమ్మా, నాన్నా మేమూ’’ అంటున్నారు పిల్లలు. అలా పిల్లలకి మంచీ చెడూ నేర్చుకునే అవకాశమే లేక, దొంగలుగా, దుష్టులూ, దుర్మార్గులుగా తయారవుతున్నారు. ఇది ఒక కుటుంబ సమస్య మాత్రమే కాదు, ‘సామాజిక సమస్య’. అలా అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చెయ్యలేదు. అక్కడ అలా చెయ్యడానికి ఎన్నో విషయాలు అడ్డం వస్తాయి.
అందుకే వృద్ధులకు వృద్ధాశ్రమాల్లో పడుండడమో లేదా ఎలాగో అలాగ ఎక్కడ అక్కడ సర్దుకుపోవడమో జరుగుతోంది. ఆ సమయంలో వారి నాదుకునేవి, అడపా దడపా, దగ్గరి బంధువులు, మేనత్తలూ, మేనమామలూ లాంటి వాళ్లు, పిన్నమ్మలూ దొడ్డమ్మల్లాంటి వాళ్లు కలుసుకుని, కాస్సేపు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటే కొండంత బలం వచ్చి నట్టుంటుంది.
అప్పుడప్పుడు వృద్ధులు వారి సోదరులు సోదరీమణులు అలా కుటుంబాలు ఏదో ఒక వంకన, కలుసుకుని నవ్వుకుంటూ కలిసి భోజనం చేసి, కబుర్లు చెప్పుకుంటే ఆనందంగా వుంటుంది. ఆరోగ్యం కూడాను. యవ్వనం వున్నవాళ్లు కొన్నాళ్లకి ముసలివారవ్వరూ.. అప్పుడు వాళ్ల పరిస్థితీ అదే కదా! అర్థం చేసుకుని ప్రేమానురాగాలు పెంచుకుంటే ఆనందం వారిమధ్య తాండవం చెయ్యదూ? ఆలోచించండి! జ్ఞాపకాలను చెప్పనివ్వండి.

-శారదా అశోక్‌వర్థన్