సబ్ ఫీచర్

ఒత్తిడికి చెక్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి రంగాన్ని స్ర్తిలు ఆకళింపు చేసుకొని తమదైన సత్తాను చాటడం నేటి నైజం. అన్ని రంగాల్లోను స్ర్తి ముందుకు వెళ్తోంది. అటు ఇంటిని, ఇటు కార్యాలయాన్ని తీర్చిదిద్దుతోంది. రాబోయే తరాన్ని కూడా సృష్టించేది నవీకరించేది స్ర్తినే.
కాని, అన్నీ చేస్తున్న మహిళ తాను తీసుకొనే ఆహార విషయంలో మాత్రం అంత శ్రద్ధ కనిపించడం లేదనిపిస్తుంది. వత్తిడి, తీరిక లేని జీవన విధానంలో అందరికీ అన్నీ చేస్తూ తనకంటూ సమయాన్ని కేటాయించుకోని స్ర్తిలు కూడా నేడు ఉంటున్నారు. అటువంటి వారు ఎక్కువగా వైద్యుల దగ్గరకు వెళ్తున్నారు.
అటువంటి వారి కోసం .... మీరు సమతులాహారాన్ని సరిగ్గా తీసుకొంటే మరింత బాగా పనులు చేయగలుగుతారు. మీరు అలసిపోకుండా మరిన్ని మంచి కార్యాలు చేయగలుగుతారు.
ఆరోగ్యకరమైన, ఆహ్లాదజీవితం గడపాలంటే మంచి ఆలోచన్లతో పాటుగా మంచి వ్యాయామం, సరైన ఆహారపోషణ పట్ల శ్రద్ధ వహించడం అత్యవసరం.
ప్రతిరోజు తెల్లవారి ఝామున కనీసం 30 నిముషాలు నడక కాని, సైక్లింగ్ కాని వారానికి ఆరోరోజులు తప్పనిసరిగా చేయాలి. తోటపని, ఇంటి పని చేస్తున్నప్పటికీ గూడా నృత్యం , యోగా వంటివి చేయడం మంచిది. ఆరోగ్యకరమైన వ్యాయామం శ్వాసక్రియను నియంత్రిస్తుంది. దానివల్ల గుండెజబ్బులు దరికి రావు. శారీరానికి మంచి బలాన్ని ఉత్సాహాన్నిస్తాయి.
ఏ వయస్సులో ఉన్నవారైనా సరే నడక అనే వ్యాయామం చేయడం సులభమైన పద్ధతి. వేగంగా నడిచే నడక శరీరంలో అధికంగా ఉన్న కేలరీసులు దహింప చేస్తుంది. క్రమం తప్పకుండా చేసే వ్యాయామాలు మంచి ఫలితాలనిస్తాయి. శరీర పోషణకు సమతులాహారం ఎంత మంచిదో శరీర సౌష్ఠవానికి మంచి బలానికి వ్యాయామం అంత మంచిది.
శరీరంలో అధికంగా కొవ్వు నిల్వలు ఉంటే మాత్రం ఏరోబిక్ ఎక్సర్‌సైజులు చేయాలి. బరువు తగ్గటానికి నడక ప్రధాన పాత్రను వహిస్తుంది. ఈ వ్యాయామం వల్ల బరువు నియంత్రణ లేకపోతే వచ్చే జబ్బులైన రక్తపోటు, చక్కెర వ్యాధి లాంటివి ధైరాయిడ్ అస్తవ్యస్తలు వంటివి దరిచేరవు. వీటితో పాటుగా అధిక పీచు పదార్థాలను తీసుకోవాలి. తక్కువ కెలరీస్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆఫీసులకు వెళ్లే మహిళలైనా సరే క్రమం తప్పకుండా శ్రమ అనుకోకుండా లంచ్ బాక్స్‌ను తర్వాత టిఫెన్ బాక్స్‌లను తప్పకుండా పట్టుకెళ్లాలి. అప్పుడప్పుడు మంచి నీరు తీసుకొంటూ ఉండాలి.
మోనోపాజ్ దశకు దగ్గరైన వారు ఆ దశలో ఉన్నవారు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. పోషకాహారాన్ని అశ్రద్ధ చేయకుండా తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు, పచ్చి కాయగూరలు, సలాడ్స్‌గా తీసుకొంటే మంచిది.
మంచి ఆహారం తీసుకొని మంచి ఆరోగ్యముంటే ఆత్మవిశ్వాసం, గుండెబలం, ఏకాగ్రత , మంచి ఆలోచనావిధానం , సృజనాత్మక శక్తి ఇలాంటివన్నింటిలో మహిళలే అధికులు అవుతారు అనడంలో ఏమాత్రం సంశయం లేదు. కనుక సమతులాహారం తీసుకునే ప్రక్రియను అలవాటు చేసుకోండి.

-నల్లా నరసింహమూర్తి