సబ్ ఫీచర్

ప్రజ్ఞావేదం - 3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రజ్ఞానం బ్రహ్మ’! సత్యం యొక్క అనుభవమే ప్రజ్ఞ అనబడుతుంది. ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అంటే ఆత్మే పరబ్రహ్మం అనీ, ‘అదే నేను’ అనీ, ‘నేనే అంతా’ అనీ తెలుసుకున్న ఆ విశేషమే ప్రజ్ఞ- జనకునికి అష్టావక్రుడు చెప్పాడు.
అపుడు ఓ ప్రజ్ఞాత్మా! ఓ మహాజ్ఞానా! ఎవ్వరైనా ప్రజ్ఞను ఎలా సాధించుకోవాలి? మరి విముక్తి ఎలా సంభవిస్తుంది? నిస్సంగం ఎలా సాధించబడుతుంది? అష్టావక్రుడిని జనకుడు తన అంతఃపురంలో సేవిస్తూ అడిగిన ప్రశ్నలివి.
మిమ్మల్ని విముక్తం చేసేదే ప్రజ్ఞ. అదే సత్యం. ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది అన్నాడు జీసస్. మొదటగా ఆత్మకు మోక్షం కలగాలి. అదే విముక్తి. తనను తాను ఇష్టపడడం ద్వారా తనను తాను ప్రేమించుకోవడం ద్వారా ఆత్మకు మోక్షం కలుగుతుంది. తద్వారా జగత్ హితం- లోక కల్యాణం జరుగుతుంది అని బోధించారు రామకృష్ణ పరమహంస- వివేకానందులవారికి! ‘‘ఎంటర్ ది కింగ్‌డమ్ ఆఫ్ గాడ్- లవ్ దైసెల్ఫ్ విత్ ఆల్ దై హార్ట్’ అన్నాడు జీసస్. నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నిన్ను నువ్వు హృదయపూర్వకంగా ప్రేమించుకోవాలి!
ఈ ప్రజ్ఞ కలిగితే కరుణ దానంతట అదే వస్తుంది. మనకెలా హితం జరిగిందో ఆ మార్గానే్న మన పొరుగు వాళ్ళందరిపట్ల ఎప్పటికప్పుడు చూపిస్తుండడమే జగత్తు యొక్క హితం. దానిని గురించి చెప్పడమే, ప్రబోధించడమే కరుణ. ప్రజ్ఞ యొక్క విశ్వరూపమే గౌతమబుద్ధుడు పవిత్ర గ్రంథాలన్నీ కేవలం సమాచారంతో నిండి వున్నాయి అని జనకుడికి తెలుసు. కేవలం తెలిసినంత మాత్రాన ప్రజ్ఞ సిద్ధించదు. అందుకే జనకుడు అడిగాడు- విముక్తి ఎలా సంభవిస్తుంది? విముక్తి అంటే ఏమిటి? విముక్తి కలిగించే ఆ ప్రజ్ఞను గురించి వివరించండి అని! సత్యాన్ని అనే్వషిస్తున్నవాడు జనకుడు- అతడు ముముక్షువు.
ముముక్షువు అంటే ముక్తికై విముక్తికై కోరిక కలిగి ఉన్నవాడు. అతడి విచారణ సరళమైనది- సూటిగా ఉంది. స్వచ్ఛమై ఉంది. అందుకే జనకుని ఆసక్తి విచారణ, సత్యదర్శనం పట్ల అతడి శ్రద్ధ అష్టావక్రుడిని ఆనందింపజేసాయి.
అష్టావక్రుడిలా బదులిచ్చాడు. ఓ ప్రియతమ జనకా మహారాజా! నిజంగా నువ్వు విముక్తిని కోరినట్లయితే విషయవాంఛలను విషంలా త్యజించు! క్షమాతత్త్వం, నిష్కాపట్యం, దయ వహించు! సంతృప్తి మరి సత్యాన్ని నువ్వు అమృతంలా స్వీకరించు! అష్టావక్రుడు చెప్పాడు జనకునికి!
‘విషయం’ అనే పదం ఎంత అర్థవంతమైంది. అది ‘విషం’ అనే పదం నుండి వచ్చింది. విషం అనే పదార్థాన్ని ఎవరైనా తింటే వారు మరణిస్తారు. విషయాన్ని మనం అనుభవిస్తే మళ్లీ మళ్లీ మరణిస్తాం. విషయ వాంఛలతో మనం మళ్లీ మళ్లీ మరణిస్తాం! ఆహారం, తృష్ణ, కోపం, ద్వేషం, అసూయ.. వీటిని అనుభవిస్తూ మనం మళ్లీ మళ్లీ మరణించాం- జన్మించాం- అంటారు ఓషో రజనీష్.
‘అమృతంలా స్వీకరించు అన్నారు అష్టావక్రుడు’
- అమృతం అంటే అర్థం. జీవితాన్ని ఇచ్చేది అమరత్వాన్ని ఇచ్చేది! అదే అమృతం! - క్షమాతత్త్వం! కోపం అనేది విషం.. క్షమాతత్త్వం అనేది అమృతం!
- నిష్కాపట్యం! వక్రబుద్ధి అనేది విషం.. సరళత, నిష్కాపట్యం అనేవి అమృతం! - కరుణ! క్రూర హృదయం, క్రూరత్వం అనే విషయం.. దయ, కరుణ అమృతం! - సంతృప్తి! అసంతృప్తి అనే పురుగు అన్నింటినీ తినేస్తూ పోతుంది. అసంతృప్తి అనే ఆ చెదపురుగు హృదయంలో కాన్సర్‌లా తిష్టవేస్తుంది. అది దానిలోకి చొచ్చుకుపోతూ, విషయాన్ని వ్యాపింపజేస్తుంది.
ఉన్నదానితో తృప్తి.. లేని దాని కోసం కోరిక లేకపోవడం..
ఏదైతే ఉందో అదే చాలా ఎక్కువగా భావించడం.. అదే సంతృప్తామృతం!
సృష్టిలో కోటానుకోట్ల లోకాలున్నాయి! మనం ఈ లోకంలో కేవలం యాత్రికులం మాత్రమే! ఉన్న నాలుగు నాళ్లు నాలుగైనా మంచి పనులు చేసిపోవాలి! చెడు పనులు చేస్తే ఎవరి కర్మను వారే తప్పక అనుభవించాలి! మన చెడ్డే మనకు చెడు చేస్తుంది. మన మంచే మనకు మంచి చేస్తుంది అంటారు బ్రహ్మర్షి పత్రీజీ!
ఎప్పుడైతే మనం మంచి పనులు చేస్తూ ఉంటామో అప్పుడే మనం ధర్మంతో ఉంటాం. ఎప్పుడైతే మనం ధర్మాన్ని ఆచరిస్తామో, అపుడే మన దృష్టి సత్యం వైపు మళ్లుతుంది. అష్టావక్రుడు ఓ అసామాన్య సత్యపరిశోధకుడు. తల్లి గర్భంలో ఉన్నప్పటినుండీ బ్రహ్మజ్ఞానాన్ని ఔపోసనపట్టినవాడు. కపటం లేకుండా మాట్లాడడం, సత్యం వచించడానికి వెనుకాడకపోవడం అతనికి పుట్టకముందు నుండే వచ్చిన లక్షణాలు.
సంతృప్తి అంటే మీ వద్ద ఉన్నదానిని చూడడం! మీ కళ్ళను కొద్దిగా తెరచి, ఇప్పటికీ మీరేం పొంది వున్నారో చూడండి అష్టావక్రుడు మనకు ఇస్తున్న విలువైన, విప్లవాత్మకమైన, అత్యం అద్వితీమైన తాళం చెవి ఇది!

-మారం శివప్రసాద్ 9618306173, 8309912908