సబ్ ఫీచర్

మారాల్సిందే అమ్మలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** కొందరు అమ్మలు వారి కన్నబిడ్డలపైన అతి ప్రేమను పెంచుకుంటారు. వారు ఏం చేసినా సరే వీరికి ముద్దు అనిపిస్తుంది. ఆ పిల్లలు ఇంటికి వచ్చిన అతిథులనో లేక ఇంట్లో ఉన్న పెద్దవారినో ఈసడించుకుంటుంటారు. కాని ఈ అమ్మలు వారిని వారించరు. పైగా వారిని దగ్గర కూర్చోబెట్టుకొని మీ నాన్నమ్మ ఇలాంటిది మీ అత్త అలాంటిది అని లేనిపోనివి నూరిపోస్తుంటారు. దానివల్ల పసిపిల్లలు మనసులు అమ్మ చెప్పింది కదా అని అదే నిజమనుకొని ఇతరులపైన అపోహలు పెంచుకుంటారు. అదే దృష్టితో వారిని చూస్తుంటారు. దానివల్ల ఎవరిమీదనైతే చెప్తారో వారికే నష్టమూ ఉండదు. కాని వీళ్ల పిల్లలకే మానసిక వికాసానికి దూరమై పిరికివాళ్లగానో, లేక అతి భయంకర మనస్తత్వాలు గల వారిగానో మారుతుంటారు. ఈ ధోరిణిని పిల్లలు దూరం కావాలంటే ముందు అమ్మలే మారాలి.
==========================

కాలం మారింది. ఇది సులభంగా అనగలిగినమాట. కాని, ఎప్పటికీ మారనిది కాలమే. మనుష్యులే మారుతుంటారు. వారి మనస్తత్వాలే మారుతుంటాయి. ఒకరిని చూస్తే మొట్టబుద్ధి మరొకరిని చూస్తే పెట్టబుద్ధి ఏర్పడుతుంది. అందుకే మనుష్యులు కొందరిని అతిగా హింసిస్తుంటారు. మరికొందరిపైన అతి మంచితనం చూపిస్తుంటారు. ఇట్లాంటి మనస్తత్వాలు కొందరు తల్లులు పిల్లలపైనా చూపిస్తుంటారు. కొందరు అమ్మలు వారి కన్నబిడ్డలపైన అతి ప్రేమను పెంచుకుంటారు. వారు ఏం చేసినా సరే వీరికి ముద్దు అనిపిస్తుంది. ఆ పిల్లలు ఇంటికి వచ్చిన అతిథులనో లేక ఇంట్లో ఉన్న పెద్దవారినో ఈసడించుకుంటుంటారు. కాని ఈ అమ్మలు వారిని వారించరు. పైగా వారిని దగ్గర కూర్చోబెట్టుకొని మీ నాన్నమ్మ ఇలాంటిది మీ అత్త అలాంటిది అని లేనిపోనివి నూరిపోస్తుంటారు. దానివల్ల పసిపిల్లలు మనసులు అమ్మ చెప్పింది కదా అని అదే నిజమనుకొని ఇతరులపైన అపోహలు పెంచుకుంటారు. అదే దృష్టితో వారిని చూస్తుంటారు. దానివల్ల ఎవరిమీదనైతే చెప్తారో వారికే నష్టమూ ఉండదు. కాని వీళ్ల పిల్లలకే మానసిక వికాసానికి దూరమై పిరికివాళ్లగానో, లేక అతి భయంకర మనస్తత్వాలు గల వారిగానో మారుతుంటారు. ఈ ధోరిణిని పిల్లలు దూరం కావాలంటే ముందు అమ్మలే మారాలి.
మరికొందరు అమ్మలు ఇతరులకన్నా నీవే ఎంతో గొప్పవాడివని, లేక గొప్పదానివని నీకున్న తెలివితేటలు మరెవరికీ లేవు అని చెప్తుంటారు. ఇది కూడా మంచిది కాదు. వారు ఇతర పిల్లల్లోని తెలివిని చూసినపుడు తట్టుకోలేరు. వారిపైన అకారణ ద్వేషం పెంచుకుంటారు. పెద్దవారికున్న లోపాలను పిల్లలకు నేర్పించడం వల్ల పిల్లలు మానసిక ఎదుగుదలను కోల్పోతారు.
నేడు టీవీల్లో వచ్చే సీరియల్స్‌లో కూడా ఇట్లాంటివి చూపిస్తున్నారు. ఇవి పిల్లలు చూడడం వల్ల కూడా నేర్చుకోకూడనవి నేర్చుకుంటున్నారు. పైగా వాటిని తమతోటి పిల్లలపైన ఆ ప్రభావాన్ని చూపిస్తున్నారు. అందుకే నేటి పిల్లలు అనుకొన్నది సాధించలేకపోతే వెంటనే ఆత్మహత్యలకు మళ్లుతున్నారు. ఇవి అన్నీ కేవలం వారి పెంపకంలో లోపాలే. కనుక అమ్మలే వీటిని ముందుగా తెలుసుకొని పిల్లలతో మెలగాలి.

- గౌరి