సబ్ ఫీచర్

ప్రకృతియే పరమాత్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి ఘ్రాణేంద్రియ, శ్రవణేంద్రియ శక్తులు చాలా పరిమితమైనవి. మనిషి కంటే కుక్క వాసనా పరిధి విస్తృతమైనది. మనిషి కంటే గుఱ్ఱం ఘ్రాణశక్తి విస్తృతమైనది. ఒకటిన్నర మైళ్ళ దూరాన వున్న సింహాన్ని వాసన ద్వారా గుఱ్ఱం పసికట్టి, అకస్మాత్తుగా ఆగిపోతుంది. అది ఎందుకాగిందో మనిషికి తెలియదు. గత కొన్ని సంవత్సరాలుగా శాస్తవ్రేత్తలొక విషయాన్ని చెబుతున్నారు.
ప్రతి జీవి విశ్వంలోని అనేక శక్తుల ప్రభావాలను గ్రహించే అంతరింద్రియ శక్తి కలిగి వుంటుందని. మనిషికి కూడా ఆ అంతర్గత జ్ఞానేంద్రియ శక్తి వుంటుంది. కానీ మనిషి తన బుద్ధిపై మితిమీరిన విశ్వాసంతో ఆ శక్తిని కోల్పోతున్నాడు. తన తెలివితేటలతో మనిషి, సహజంగా తనకు అంతకుముందున్న వాటినెన్నింటినో పోగొట్టుకుని, తనకంతకుముందు లేనివెన్నో కనుగొని, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటున్నాడు. భూమిమీద వాతావరణాన్ని పాడుచేసి, ఎన్నో రకాల జంతుజాలాన్ని వృక్షజాతుల్నీ నాశనం చేస్తున్నాడు. తాను అపకృతిపై ఆధారపడి బ్రతుకుతున్న విషయం ఎరుకలేనట్లు ప్రవర్తిస్తున్నాడు. ఇది తాను కూర్చున్న కొమ్మ నరుక్కోవడమే. ప్రకృతిలో ప్రతిదానికీ ఒక సమతుల్యత వుంది. ఉదాహరణకు మనిషి తన శరీర ఉష్ణోగ్రత 98 డిగ్రీల కనిష్టాస్థాయికి 110 డిగ్రీల గరిష్ఠ స్థాయికి మధ్య మాత్రమే జీవిస్తాడు. 98 డిగ్రీలకు తక్కువైనా 110 డిగ్రీలకు ఎక్కువైనా మనిషి చనిపోతాడు. అంటే మనిషి ఈ పనె్నండు డిగ్రీల శరీర ఉష్ణోగ్రత పరిధిలోనే జీవించగలడని శాస్తజ్ఞ్రులు చెబుతున్నారు. అదేవిధంగా ప్రతి దానికి ప్రకృతిలో సమతుల్యత ఉంటుంది. పై విషయాలను ఇక్కడ ప్రస్తావించడంలో నా ఉద్దేశ్యం, మనిషి ప్రకృతితో మమేకమై జీవించినపుడే తన జీవితం మనగలుగుతుందని అందుకు భిన్నంగా జీవించినపుడు విపరీత పరిణామలనెదుర్కోవలసి వస్తుందని హెచ్చరించడమే! మనిషి భూమిమీద ఏకత్వంలో ఒక భాగం మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ప్రకృతిని భగవత్ స్వరూపంగా భావించాలి. ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి, పరమాణువులోని వికరణ ప్రక్రియను గూర్చి మాత్రమే తెలుసు. కాని పరమాణువులోని, మూలద్రవ్య స్వరూప స్వభావాల గురించి కాని, దాని మూలము గురించి కాని తెలియదు. పరమాణువు నుండి కొత్త తరంగాలు అన్ని వైపులకు నిరంతరం ప్రసరిస్తూంటాయి. అందువల్ల ఒక క్షణంలోనున్న ఎలక్ట్రాను మరియొక క్షణంలో అదేయని గుర్తించ వీలుకానిదౌతుంది. ఎలక్ట్రానులో పదార్థ ధర్మాలున్నాయని, సామాన్య బుద్ధికి అనిపిస్తుంది. కాని ఎలక్ట్రానులో అటువంటి ధర్మాలు అసలు లేవని ఇపుడు కనుగొనబడింది. ఎలక్ట్రాన్ కేవలమొక క్షేత్రం మాత్రమే. దాని నుండి శక్తి తరంగ ప్రసరణ జరుగుతుంటుంది. ముఖ్యంగా హైసన్‌బర్గ్, క్రోడింగర్ అనే జర్మన్ శాస్తవ్రేత్తల ప్రయోగాల ఫలితంగా, పరమాణువు ఒక ఘనపదార్థమనే పాతకాలపు ఆలోచన అసత్యమని తేలింది. నూతన పరిశోధనల ప్రకారం పదార్థం, అమూర్తమైన (ఆకారం లేనిది) ఒక భూతావేశమై పోయిందని మెర్ట్రెండ్ రసెల్ అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా భగవాన్ శ్రీమణుల ‘నేనెవడను’ అను గ్రంథములోని రుూ వాక్యమెంతయును స్మరణీయమైయున్నది. ‘‘జాగ్రత్తు దీర్ఘము, స్వప్నము క్షణికము అగుట తప్ప, రెంటికి మధ్య భేదమే లేదు’’. లోతుగా పరిశీలిస్తే ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా యిట్టి విషయానే్న బలపరుస్తోంది. డా ఎడింగ్టన్ రుూ సత్యాన్నిలా వివరించారు. భౌతిక శాస్త్రం ఛాయాప్రపంచానికి చెందినదైపోయిందని గ్రహించడమే. ఈనాడు మనం సాధించిన అత్యంత ప్రధానమైన అభివృద్ధి పదార్థ విజ్ఞానశాస్త్ర రంగంలో సుపరిచితమైన మన జీవితపు ఛాయా నాటక ప్రదర్శనను మనం వీక్షిస్తున్నాము. మహర్షి రమణులు కూడా ఇదంతా సినిమా తెరమీద చిత్ర ప్రదర్శన వంటిదని సెలవిచ్చారు. నీడ సిరా, నీడ కాగితం మీద సాగిపోతుండగా, నా నీడ మోచేతిని, నీడ బల్లమీద ఆన్చుతాను. అంతా ఛాయ మాత్రమేనని తెలుస్తోంది. ..........................ఇంకావుంది

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590