సబ్ ఫీచర్

తాజా ఆహారంతో గుండె భద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి స్పీడ్ యుగంలో సద్దెపెట్టె (ఫ్రిజ్)లో వారం రోజులకు సరిపడా ఆహారపదార్ధాలు పెట్టుకుని ఓవెన్‌లో వేడిచేసుకుని తినటం సర్వసాధారణమైంది. ఇలాంటి ఆహార పదార్థాలు తినటం వల్ల గుండె సంబంధిత సమస్యలను అధిగమించలేమని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. చాలాకాలం నిలువబెట్టి స్టోర్స్‌లో అమ్మే పదార్థాల వల్ల చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అమెరికాలో జరిపిన పరిశోధనలలో వెల్లడైంది. దాదాపు 5,950 మంది పెద్దలపై గ్రాండ్ వ్యాలీ స్టేట్ యూనివర్శిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జెఫ్రీ వింగ్ ఆధ్వర్యంలో పరిశోధనలు జరిగాయి. స్టోర్స్‌లో గానీ రెస్టారెంట్‌లలోగానీ అమ్మే పదార్థాలన్నీ చాలా రోజుల క్రితం తయారుచేసినవే. వీటిని భుజించటం వల్ల ధమనులకు సంబంధించిన ఎథెరోస్కెరోసిన్ అనే వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయని కనుగొన్నారు. వీరికి సిటి స్కాన్ తీయగా 86శాతం కరోనరీ ఆర్టరీ కాల్షియం రీడింగ్స్ మూడుసార్లు ప్రత్యేకంగా చూపించినట్లు, ఈ రీడింగ్స్ 3.5 సంవత్సరాల వ్యవధిలో నమోదు చేయటం జరిగింది.
వీరికి తాజా ఆహారం ప్రతిరోజూ ఇచ్చి చూడగా.. వల్ల నడివయసు వారికి సైతం గుండెకు సంబంధించిన కరోనరీ ఆర్టరీ రక్తనాళాలు దృఢంగా ఉన్నట్లు కనుగొన్నారు. ఇంటికి దూరంగా ఉన్న తాజా ఆహారం లభించే స్టోర్స్‌లోని పదార్థాలు కొనుగోలు చేసి తినటం వల్ల గుండెకు సంబంధించిన ధమనులకు కాల్షియం అందుతున్నట్లు గ్రహించారు. కాబట్టి పక్కనే లభిస్తున్నాయని ఇరుగుపొరుగువారు స్టోర్స్‌లో దూరి నిల్వచేసిన పదార్థాలు తినకండి. కాస్త దూరమైన తాజా ఆహారపదార్థాలనే తినటాన్ని అలవాటుగా చేసుకోండని నిపుణులు సూచిస్తున్నారు.