ఆంధ్రప్రదేశ్‌

వడ్డీ వేధింపులు.. మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 17: రాష్ట్రంలో కాల్‌మనీ వ్యవహారం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో కడప జిల్లాలో వడ్డీ వ్యాపారి వేధింపులు తట్టుకోలేక గురువారం ఓ మహిళ ఆత్మహత్యకు అసువులు బాసింది. బాధితులు పలువురు పోలీసులకు ఫిర్యాదులు చేసేందుకు సైతం సాహసించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కడప నగరం అగాడివీధికి చెందిన వహిదాభాను (49) అనే మహిళ కాల్‌మనీ వ్యాపారిని వేధింపులతో తీవ్ర అస్వస్థతకు గురై చికిత్సపొందుతూ గురువారం మృతి చెందింది. సాయిపేటకు చెందిన విక్టోరియారాణి చాలాఏళ్లుగా కాల్‌మనీ వ్యాపారం చేస్తోంది. వహిదాభాను తన అవసరాలు నిమిత్తం ఇల్లు తాకట్టుపెట్టి ఆమె వద్ద కొంతనగదు తీసుకుంది. నెలవారీ భారీగా వడ్డీ వసూలుచేస్తూనే గత శనివారం పెద్దఎత్తున అనుచరులను వెంటబెట్టుకొని వహిధాభానును ఇళ్లు ఖాళీ చేయాలని పరుష పదజాలంతో దూషించింది. ఆమె వెంటవెళ్లిన వారు సైతం వహిదాభానును మానసికంగా హింసించినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు వాపోయారు. దీంతో తీవ్ర అస్వస్తతకు గురైన ఆమెను గత శనివారం కర్నూలు ఆసుపత్రికి చికిత్సనిమిత్తం తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి చివరకు గురువారం మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నారు. విక్టోరియారాణి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.