సుమకు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు వారికి సుపరిచిత మైన ప్రముఖ యాంకర్ సుమ అస్వస్థతకు గురయ్యారు. స్వరపేటిక ఇనె్ఫక్షన్‌తో బాధపడుతున్న ఆమె మూడు నెలలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. స్పష్టమైన ఉచ్ఛారణ, సమయ స్ఫూర్తితో తెలుగువారి మెప్పు పొందిన సుమ యాంకర్, సినీకార్యక్రమాల ప్రజెంటర్‌గా రాణించారు. కొద్దికాలం క్రితం ఇదే సమస్యతో సుమ ఇబ్బందులు పడ్డారు. యాంకరింగ్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించినా ఆమెకున్న ప్రాధాన్యతరీత్యా వృత్తికి దూరం కాలేదు. ఇప్పుడు మళ్లీ స్వరపేటికకు సంబంధించి సమస్య తలెత్తింది. ఇటీవల ఓ టీవీ కార్యక్రమానికి సంబంధించి దాదాపుగా 62 ఎపిసోడ్లకు ఒకేసారి వ్యాఖ్యానం అందించడంతో ఇబ్బంది ఎదురైంది. దీంతో ఆమెను పరీక్షించిన వైద్యులు దాదాపు 3 నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని, లేనిపక్షంలో పరిస్థితి విషమిస్తుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్నారు.