సుమధుర రామాయణం

సుమధుర రామాయణం -- యుద్ధకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

907. లంకలో రావణాసురు గుప్తచరుడు
వచ్చి ‘‘రాక్షసేశ్వర! శత్రు సైన్య మపరి
మితముగను వచ్చి విడిసిరి గిరిసువేల
యద్రిపై’’ననివచియింప యసుర విభుడు

908. శకుని సారణులను వారి జూచి మీరు
కపుల రూపములతొనే గిరిపుల సైన్య
మున జొరంబడి వారి సేనాబలమ్ము
శక్తిసామర్థ్యములు లెస్స నరసిరండు

909. ప్రభుని యాజ్ఞను చారులు కపుల రూప
ములను సేనలో జొచ్చి లెక్కింప బూని
గిరిశిఖరముల వృక్ష శాఖలను వ్యాప్తి
జెందియున్న సేనల యెంచ సాధ్యపడక

910. రూపముల మార్చి సేనలో దిరుగు గుప్త
చారులను విభీషణుడు బోల్చి రఘువరుని
చెంతకున్వారి దెచ్చి’’ దాశరధి! వీరు
రావణాసురు డంపిన చారు లధిప!

911. సేన బలమును సంఖ్యయు సేకరింప
రూపముల మార్చి వచ్చి నా‘‘రనుచు దెల్ప
కపులు విని కోపమున వారి గొట్టబూన
ప్రాణభీతితో వణకు చారులను జూచి

912. రామచంద్రుడు వారించి విడువబనిచి
‘‘్భయపడకుడు మీకు వలసినట్టి విషయ
ముల విభీషణుడే జెప్పు మీరు లంక
కు జని నామాటగా జెప్పు డసురపతికి

913. దండక వనినాశ్రమమున నొంటి నున్న
జానకి నపహరించి దెచ్చితి వధర్మ
వర్తనమ్మని దలచక నిపుడు నేను
వచ్చినాడను నిన్ను శిక్షింప నెంచి’’

914. పొండనుచు విడువ బ్రతికితిమటంచు
యెగిరి రావణు సన్నిధి వ్రాలి విషయ
ములను దెల్పుచు లంకేశ రామలక్ష్మ
ణులు దృఢ పరాక్రములు మహావీరులధిప!

915. ఆంజనేయ సుగ్రీవాంగదాదు లరయ
దక్పతుల సమానులు జాంబవంత మైంద
గజ గవయ నలనీలు లత్యంత బలులు
ఇక సుషేణ గవాక్షులజేయులనిలొ

916. రాము డొక్కడే సర్వ రాక్షసుల సంహ
రింపగల సమర్థుండు వారలతో సంగ
రమ్మొనర్చుట కంటెను మనకు జూడ
సంధిగావించు కొనుటె శ్రేయస్కరమ్ము’’
917. వారి మాటల కడలచు రావణుండు
ఓరి మూర్ఖులారా! మీరు వారితోడ
దెబ్బలందిని వచ్చిట్లు బల్కువారు
యుద్ధమున నన్ను నోడించు యోధుదెవడు
లేడని దెలియదా బుద్ధి లేని మీకు

918. రామునకు సీత నర్పింప రావణునకు
నడ్డు పడె నహంకృతి శత్రు సేన జూడ
నడిచె సౌధాగ్ర భాగముపైకి చారు
లనుసరించిరి యేలిక వెనుక వారు

919. నేలరుూనిన యట్లున్న సేన జూచి
వారిలో నెవ్వరెవ్వరొ వరుస నాకు
జెప్పుడన ‘‘శఉకుండడుగొ! ప్రభు మన లంక
వైపు కసితౌ జూచెడువాడు నీలుడధిప!

920.ప్రక్కనే నిల్చి క్రోధ దృక్కులను జూచు
వాడు గిరిశృంగ దేహుడు వాలిసుతుడు
కపికుల యువరాజు బలపరాక్రమముల
తండ్రి యంతటి వాడంగదుండు పేరు

921. అంగదుని వెన్క జూడుడు విశ్వకర్మ
పుత్రుడు నలుండుసేతు నిర్మాత యితడె
పనస రంభుడు శరభుడు వినత కుముదు
లెల్ల కాలాగ్ని సన్నిభు లసురరాజ!

922. అతడు జాంబవంతుడు జ్ఞాని వినయ శీలి
అమర దానవ సంగ్రామ మందు దేవ
తలకు తోడై నిలచియన యోధాగ్రగణ్యు
డతని చెంత శతబరి మృగేంద్రసముడు

923. గంగ వొడ్డున గలవట ద్రుమములవలె
హిమగిరిని గల సాలభూజముల వలెను
ఉన్నత శరీరులెందరో స్వామికార్య
మునకు ప్రాణములొడ్డు వానరులు గలరు

924. అచట జూడడు వారు భల్లూకపతులు
కామరూపులు నతిభయంకరులు వారు
పర్వతోన్నతదేహులు దృఢ పరాక్ర
మ యుతులెదిరింప నెవరి శక్యముగాదు

925.అడుగొ లంకేశ సేనల నడుమ మత్త
కుంజరమువలె నున్నవా డాంజనేయు
డతడెమన పట్టణమునకు ధూమకేతు
చందముగవచిచ వెళ్లిన సత్వశలా

-- టంగుటూరి మహాలక్ష్మి