సుమధుర రామాయణం

సుమధుర రామాయణం -- యుద్ధకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

926. ఆయన సమీపముననున్నవాడె లక్ష్మ
ణుండు మేలిమి బంగారు వర్ణుడతడు
అగ్రజ హితము సర్వదా గోరుచుండు
శత్రువుల కజేయుడు మహావీరుఢధిప!

927.పంచ ప్రాణములతడన్న దాశరధికి
వేదవేత్త ధర్మరుడు వినయశీలి
యగ్రజునకు కుడి భుజమై యుండు నెపుడు
యుద్ధముల నారితేరిన యతిరథుండు

928.లక్ష్మణుని చెంత శోభించుచున్నవాడె
రామభద్రుడు పద్మపత్రాయతాక్షు
డాప్రభుని యాగ్రహముకు గురైన ప్రాణి
మృత్యుముఖమును జేరిన యట్లెదేవ!

929. రాఘవున కెదురుగనున్నవాడు తమరి
సోదరుడు విభీషణు డాయనను రఘుపతి
లంకకధిపతిగా నభిషిక్తుజేసె
నిల్పె సేనల గురుడ వ్యూహంబు బన్ని

930. రాఘవ విభీషణుల చెంత నగము రీతి
నిశ్చలమ్ముగ నిల్చొని యున్నవాడు
వానర కులాధి నేత సుగ్రీవుడధిప!
బలము శౌర్యము కీర్తియు గలుగువాడు

931. ఆయన గళము నందున్న పసిడి మాల
శుభకరము సర్వదా లక్ష్మికి నిలయమ్ము
వాలి మృతుడైన పిదప రుమయును తార
లీతనికి ప్రాప్తమయ్యె శ్రీరామ కరుణ

932. రావణుండంత శత్రు సైన్యమ్ములోని
రామ లక్ష్మణ హనుమ సుగ్రీవ జాంబ
వంత యంగద నల నీలులాది యోధ
వరుల జూచుచు నొక్క క్షణము చలించె

933. అంతలో తేరుకొని వారి మందలించ
బోవ చారులు స్వామి మీయండ మేము
ఇంతకాలముగ సుఖముగ బ్రతికినాము
వాస్తవము జెప్పితిమి తమ వృద్ధి కోరి

934. ఓరి యవివేకులార! నా వద్ద శత్రు
పక్షపు ప్రశంసను జేయు మిమ్ము మంత్రు
లుగ మనుగడ సాగిచుచుంటినన దైవ
కృపయె ఛీ పొండు నా సమక్షంబు నుండి’’

935. అనగ శిరములు దించుక జనిరి వారు
వంచనను శత్రువుల నొంపనెంచి మాయ
తంత్రనిపుణు విద్యుజ్జిహ్వు బిలచిరామ
శిరధనుర్బాణములను గల్పించి దెమ్ము’’
936. అనుచు లంకేశుడాదేశమొసగ తక్ష
ణమ్ము గల్పించి దెచ్చి రావణునిముందు
నుంచె వాని నిపుణతకు మెచ్చుకొనచు
రత్నభూషణములనిచ్చి సత్కరించె

937. వాటినింగొని ప్రమదవనమున సీత
ముందుకు విసరి జ్నాకీమా ప్రహస్తు
డసుర సైన్యముతోనేగి కపులజంపి
నీ పతిశిరము ఖండించి దెచ్చె నిదిగొ

938. భర్త శిరమును శరచాపములను జూచి
వాస్తవమ్మని భ్రమియించి వసుధపుత్రి
భూమిపై వ్రాలె స్పృహనుగోల్పోయి తిరిగి
తెలివి వహియించి విలపింప దొడగెసాధ్వి

939. ‘‘రావణా! నన్నుగూడ నీ ఖడ్గమునకు
బలియొనర్చి పుణ్యము గట్టుకొనుము రామ
చంద్రు డేతెంచి నన్ను రక్షించునన్న
యాశ వమ్మ య్యెనింక జీవించనేను’’

940. అంతలో పరిచారకుండొచ్చి దేవ
మంద్రులతొ సభా భవనమునందు వేచి
యున్నవారు ప్రహాస్తులు యని వచింప
జనియె నతి వేగముగ రాక్షసేశ్వరుండు

941. ‘‘తల్లి భూమాత నాకు దిక్కెవ్వరమ్మ’’
యనుచు భోరున విలపించుచున్న సీత
దరికి జని విభీషణు ధర్మపత్ని సరమ
సాధ్వి రత్న మ! శోకింప కవనితనయ!

942. శిరము శరచాపములు దాశరధివిగావు
రావణుని మాయ కల్పితములు నిజమ్ము
సత్యసంధుడు ధర్మసంస్థాపు రామ
భద్రు నెదురించువారు రుూ భువిని గలరె

943. ‘‘మైథిలీ! ధైర్యమ వహించుమమ్మ! నీకు
భద్రమయ్యెడు రామసౌమిత్రు లుధది
దాటివచ్చి దక్షిణతీరమందు వాన
రాధి పతులతొ విడిసియున్నారు తల్లి

944. జూచినితి నే స్వయమ్ముగ వాసవుండు
దైత్యసంహారమును జేయునట్లు సర్వ
రాక్షసుల సంహరించి శ్రీరామభద్రు
డవనిజా! నీకు సౌఖ్యమనుగ్రహించు

945. నిరుపమాన పరాక్రమ శౌర్యధనుడు
కౌసలేయుడు రావణు సంహరించి
నిన్నుజేరును త్వరలోనె నీరజముఖి
యక్కునం జేర్చుకొను నిన్ను మక్కువగును!

--టంగుటూరి మహాలక్ష్మి