సుమధుర రామాయణం

సుమధుర రామాయణం -- యుద్ధకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

966. ‘‘మనకు సేనాని శత్రుమర్దనుడు నీలు
డాక్రమించు తూర్పుద్వార మచటనున్న
నా ప్రహస్తునకు ప్రతియోధుడతడె
భుజబలాన్వితులౌ కపిబలముతోడ

967. దక్షిణ ద్వారమున మహోదరుడు గలడు
నతనితో మహాపార్శ్వుడు జతగనుండె
ముజ్జగంబుల నిర్జింపజాలువాడు
అంగదుడు జూచు వారి సంగతిని లెస్స

968. పశ్చిమద్వార రక్షణ పరతనున్న
ఇంద్రజిత్తుకు శౌర్యమే రూపుదాల్చి
యున్న పవనపుత్రుడు మన హనుమఘనుడు
రావణి మదమడంచగ వజ్రతనుడు

969. రావణుండిక నావంతు లక్ష్మణుండు
నాతొనుండును నాభిప్రదేశమందు
జాంబవంత సుగ్రీవ విభీషణాదు
లుందు’’రని నిశ్చియించె రఘూద్వహుండు

970. రాఘవుండంత సౌమిత్రి వానరేశ్వ
రుడు, విభీషణాదులను గూడు కవిభుండు
రావణుండేలు లంకాపురమ్ము జూచె
నాసువేలాద్రి శిఖరమ్ము నందునుండి

971. నింగినంటు త్రికూటాద్రి శిఖరమందు
భూమికే భూషణమ్ముగ నమరశిల్పి
విశ్వకర్మ నిర్మితమై దివమ్ముమించు
లంక పట్టణ సౌందర్యము దులకించి

972. రావణుడు పరదారాపహరణ పాప
కృత్యమున తనవంశ నాశనమొనర్చు
కొనుచునున్న వాడితని పాపముల ఫలము
నీతని ప్రజలునుగూడ ననుభవింత్రు

973. అంత రాముడు మిత్రులతోడజూచె
లంక పట్టం మధ్యభాగమ్ములో మ
హోన్నతమ్ముగనున్న లంకేశ్వరు భవ
నమ్ము సాయుధులై భటుల్ మొనసియున్న

974. అంతలో దివాకరు డస్తమించి నింగి
చల్లగా శీతకిరణుడు వెల్గ దొడగె
అందరా రాత్రి గడిపిరా పర్వతమున
భానుడుదయించ విరిసె పద్మములు మురిసి

975. రామచంద్రుడు వానరాధిపుల తోడ
గిరి శిఖర మధిరోహించి యచటి నుండి
జూచె లంకేశు నున్నత సౌధమందు
గానుపించెను రాక్షస చక్రవర్తి
976. ఇచట వీరల రావణుసౌధము తిల
కించు సమయమందచ్చట రావణుండు
వీరి బరికింపుచుండగ వానరేశ్వ
రుండు జూచెలంకేశు దురాత్మునపుడు

977. అంబరంబంటు నాగ్రహావేశములను
నసురవల్లభు ప్రాసాదమునకు నెగసి
రావణాసురుపై దూకి రత్నమకుట
మవని బడద్రోచె నొక్కక్షణమ్ములోన

978. రావణుని జీవితమ్మున నీపరా భ
వమ్ము మొదటిది టచే వానక్రోధ
ములతో దశకంఠుడు సుగ్రీవు నేలబడగ
ద్రొబ్బెపడుచునె హరివరుండెగసెపైకి

979. బాహుబలశాలి వానరప్రభువు పంక్తి
కంఠుబడగొట్టె భూమిపై నిర్వురట్లు
సింహశార్దూల సమరము సల్పుచుండ
రావణుని మాయజాల ప్రయత్నమెరిగి

980. ఒక్కవుదుటున కపివరుం డాకసమున
కెగసి రామభద్రుని ముందు వ్రాలెతృటిని
రాఘవేంద్రుడు ‘‘మిత్రమా! రవిజ! ప్రభువ
కన్నివేళల తగదయ్య యాగ్రహమ్ము

981. నీకునాపద గల్గినట్లైన నేను
సీత సౌమిత్రులదలచ రావణుని వ
ధించి లంక విభీషణుకిచ్చి భరతు
కోసరమునేల నతనికాదేశమిచ్చి

982. ప్రాణముత్యజించి దలచినాడ’’ నన్న
‘‘రాఘవా! జానకినపహిరంచి నట్టి
రావణుడు కంటబడగ వధింపదలచి
నట్లొనర్చితి మన్నింపు మయ్యరామ!’’

983. అంత పర్వతదేహులు ప్లవగతులు
లంకనగరపు ద్వారముల్ జుట్టుముట్టి
రాయసుల సంహరింప నుర్రూతలూగ
చుండిరి పెనుబండలను వృక్షముల బూని

984. రామచంద్రుడు చివరి ప్రయత్నముగను
మిత్రులౌ సుగ్రీవ విభీషణులను సంప్ర
దించి యంగదు రావణుదరికి రాయ
బారిగా బంప నిశ్చయపరచుకొనియె

985. ‘అంగదా! నీవు రావణుకకు నేగి
జెప్పమిట్లు నా మాటగ ‘‘రాక్షసేంద్ర!
నీకు జీవించవలెనను నాశయున్న
తప్పజేసితినని సీత నప్పగించు

--టంగుటూరి మహాలక్ష్మి