సుమధుర రామాయణం

సుమధుర రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

501. ఋతు నియమము లేక తరువులు ఫల పుష్ప
ములతొ నయన నాసికా పుటంబు
లకును తర్పణంబు జేయగ సదమల
శీల సీత కొరకు జూచి హనుమ

502.పొగడ సంపంగి మంచి గంధంఫు తరులు
హంస కారండవ శు పికాది పక్షి
సంతతులతో శుభప్రదమైన పద్మ
యుత సరోవరమ్మును మరుత్సుతుడు జూజె

503.వెనె్నలల వెల్గులో ప్రమదావనమ్ము
నందు గల పొదరిండ్లు లతానికుంజ
ములను సెలయేటి తినె్నలు పుష్పవాటి
కలను వెదకుచు వన మధ్యమునకు జేరె

504.అంతలోన చంద్రుడస్తాద్రి కేగగ
పతి వియోగ దుఃఖభరిత సీత
యిందు వుండి యున్న సంధ్య నుపాసించ
ఈ తటాకమునకు నరుగుదెంచు

505.అనిదలంచుచు హనుమంతు డచట నున్న
వున్న తమ్మగు శింశుపావృక్ష మెక్కి
నాల్గు దెసలను బరికింప నంత దూర
మందు గనిపించె సుందర మందిరమ్ము

506.ఆకసమ్మంటుచు ధవళ కాంతి తోడ
వెలుగు కైలాస శైలమ్మువోలె నున్న
సౌధ ప్రాంగణమున వృక్షచ్ఛాయలోన
దర్శనంబిచ్చె నొక దేవతా సమాన

507.నియమ దీక్షతో నున్న తపస్వినివలె
నిరత ఉపవాసముల కృశీభూతమైన
తనువుతో మాసియున్న వస్త్రంబు దాల్చి
శుక్లపక్షపు నవచంద్రరేక బోలి

508.ఈమెయే రఘుకుల సార్వభౌము రామ
చంద్రు సతి రుూయమ ధరించినట్టి వస్త్ర
మపుడు సొమ్ముల గట్టి విడిచి వస్త్ర
మొక్కటై యున్న దీమెయె మాత సీత

509.ఈమె కన్నులు కరములు ముఖకమలము
రామ వర్ణితములె సందియమ్ము లేదు
ఈ మహాసాధ్వి ధూరమై యామహాత్ము
డెంత శోకాగ్ని తపియించుచున్నవాడు

510.ఈ విశాలాక్షికై గాదె ఇనకులమణి
వాలినిం గూల్చె శంబరాసురు సమాను
డౌ విరాధుని తెగటార్చె ఖరుడుదూష
ణాతి యసురుల ఘోర కబంధు జంపె

511.సాగరము నేను లంఘించి లంక జేరి
నగర మంతయు శోధించినాడనన్న
ఈ పతివ్రత జనక రాజర్షి తనయ
రామునిల్లాలు ఈ తల్లి మహిమ గాదె

512.దశరథుని పెద్ద కోడలు ధర్మమూర్తి
రామచంద్రుని యిల్లాలు రఘుకులంబు
కీర్తి పెంచిన వైదేహి కింతటి దశ
గలిగెనని కాల మహిమకు గలగె హనుమ

513. కులము రూపము గుణము శీలములలోన
యిద్దరును సమానులుగాన వొకరికొకరు
తగిన వారలు భర్త ధీశక్తి దెలిసి
యున్న దౌటను స్థిరుముగ నున్నదీమె

514. భూతలమ్మున నున్న దేవత సమాను
రాలి నీ మహా సాధ్వినిగాంచి నేను
రామ కార్యమునం కృతార్థుండ నైతి
ననుచు ఆనంద పరవశుడయ్యె హనుమ

515.క్రూర రాక్షస వనితల వలయమందు
భర్తృదుఃఖముచేత పీడింపబడుచు
నిరత వుపవాసముల బలహీనమైన
దేహమున నుండె సాధ్విరత్నమ్ము సీత!

516. సీత! దర్శనము కపివరు క్లేశము
రహితమయ్యె రామచంద్రవిభుని
దలచి హృదయ పూర్వక ప్రణామంబులు
జేసి దాగి యుండె చెట్టుపైని

టంగుటూరి మహాలక్ష్మి