సుమధుర రామాయణం

సుమధుర రామాయణం... సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

652. మేరు గిరిపైని నీలమేఘమ్ము కరణి
పసిడి సింహాసనమున నాసీనుడైన
యసుర వల్లభు జూచి యాశ్చర్య చకితు
డైన హనుమంతు డిట్లు దలచుకొనియె

653. యేమి రూపము యేమి తేజమ్మితండు
ఇంద్ర పదవికి జాలినవాడు గాని
రుూ యధర్మ వర్తన లేకయున్న మూడు
జగము లీతని దాస్యము జేయకునె్న?

654. అంత రావణుండు హనుమంతు జూచుచు
యెవ్వడీతడు కపిరూపు దాల్చి
వచ్చినట్టి నంది భగవానుడా లేక
బాణుడా యని దలపోసి యపుడు

655. ముఖ్య సచివు ప్రహస్తుతో ఈ నగచరు
మర్మ మేమియొ దెలిసికొమ్మనుచు బల్కె
‘‘యెవ్వడవు నీవు వానర యెచటి నుండి
వచ్చినాడవు దెల్పుము వాస్తవముగ

656. ఇంద్ర యమ వరుణాది దేవతలు నిన్ను
గుప్తచర కృత్యమున కిటు బంపినార
విజయ కాంక్షతొ బంపెనా విష్ణువు నిను
నిజము బల్కు’’మని ప్రహస్తుండు నుడువ

657. బంధనమ్ముల దృటిలోని ద్రెంచివైచి
‘‘మీరు భావించినట్లునే నమర వరుల
దూతనుంగాను కోసలాధీశు రామ
చంద్రు దూతను హనుమంతుడండ్రు నన్ను

658. నన్ను బంధింప లేవస్త్ర చయములెవ్వి
మీ ప్రభువును జూచు తలంపు తోడ వనము
జెరచితిని ప్రాణ రక్షకై జంపవలసి
వచ్చె నాతొ యుద్దమొనర్ప వచ్చువారి

659. రాక్షసేశ్వర! వినుము నాహితవు నీవు
దెలియుదువు వాలినాతని బలము నట్టి
కీశపతి నొక్క శరమున గూల్చినట్టి
రాము పత్నిని దెచ్చితి వపహరించి
660. ప్రాజ్ఞుడవు తపస్విని ధర్మసూత్రములను
లెస్స యెరిగిన నీ విట్లు సల్ప తగదు
పర సతులపైని మోహము, పుడమి తనయ
నిపుడె రాఘవునకు సమర్పించుకొనుము

661. విషపు టన్నము దిన్నయే జీవియైన
జీర్ణమొనరించు కొనుటకు జాలనట్లు
పుడమి పుత్రిక నెవ్వరు పొందజాల
రామె దుఃఖవహ్ని దహించు నసుర కులము

662. ఇంత కాలము ధర్మఫలమ్ము నీవు
పొందినాడవు యింక యధర్మ ఫలము
ననుభవింపక తప్పదు యనతి కాల
ముననె యాఫల మనుభవమునకు వచ్చు

663. రామచంద్రుడు ధర్మ రక్షణకు పుడమి
నవతరించిన యాదినారాయణుడని
దెలిసికొనుము నీ వొకడవెగాదు మూడు
లోకముల రాము నెదురింప లేరు యెవరు

664. శ్రీరఘువరు డెంత శౌర్య సంపన్నుడో
అంతటి కరుణా సముద్రుడౌట
కమల సదృశ జానకీదేవి నాయన
దరికి జేర్పగ క్షమించి విడుచు

665. వరబలుండ ననుచు దలపకు రావణ
నరులు వానరులను గలరు సుమ్ము
వారిచేత నిహతి లేకుండ వరమును
గోరవైతి వీపు కమల గర్భు

666. హితకరమ్మగు హనుమ ప్రసంగమునకు
కన్నులెరు పెక్క క్రోధాగ్ని గడలు కొనగ
నసుర వల్లభుడీవానరుని వధింపు
డనుచు నాదేశమీయ విభీషణుండు

667. ‘‘అగ్రజా! విను నా విన్నపమును ధర్మ
నిష్ఠుడవు దైత్యకుల యోగ క్షేమమలును
నరయు వాడవు, శత్రుభయంకరుడవు
దూత నిట్లు వధింపగ దగునె నీకు

టంగుటూరి మహాలక్ష్మి