సుమధుర రామాయణం

సుమధుర రామాయణం -- సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

668. మరణ తుల్యవౌ దండన యాకపికి వి
ధించి విడిచిన నవమాన సూచకమగు
గుర్తుతో నేగ రాముడు క్రుద్ధు డగుచు
యుద్ధమొనరింప కపి సేనతోడ వచ్చు

669. అపజయమ్మెరుగని యనుచరులు నీకు
కోట్ల సంఖ్యలు గలరు నీ కదన బలము
వారు జూపుదురా నర వానరులకు’’
నను విభీషణు మాటల నాలకించి

670. ‘‘వానరుల కతి ప్రియము వాలమ్ము దాని
తగుల బెట్టుడు యిదియె ఈ తనికి తగిన
శిక్ష’’యని రావణుండానతీయ భటులు
పరుగుపరుగున నూలు వస్తమ్రులు దెచ్చి

671. తైలమున ముంచి పవనజు వాలమునకు
జుట్టి నిప్పు నంటించి హర్షంబు తోడ
గంతులేయుచు బాడుచు నగరమంత
ద్రిప్పుచుండగ సీతకా వార్త దెలిసి

672. హనుమ కింతటి కష్టము గలిగె ననుచు
యగ్ని దేవుని ప్రార్థించె నవని జాత
పవన పుత్రుని జల్లగ జూడుమంచు
శీతలుండయ్యె హనుమకు హుతవహుండు

673. ఇంత దనుక తపించి జేసిన హుతాశ
నుండుశీతలుడై దోచ హనుమ దలచె
జనకనందన శీల సంపదయు రామ
చంద్రు మహిమయె కారణమ్మిందు కనుచు

674. శంక లేక హనుమ లంకను దహియించె
నొక విభీషణు భవనము దప్ప నపుడు
రుద్ర దేవుడు త్రిపురంబులను దహించు
విధముగా దోచె నమరులచ్చెర్వు నంద

675. నిర్జరారులు తమతమ గృహములన్ని
దహనమైపోవ నార్తనాదముల తోడ
గుండెలను బాదుకొని విలపించి రకట
యితడు కపిగాదు కాలాగ్నిహోత్రుడనుచు
676. పంక్తి కంఠు పురము పావకాహుతి జేసి
సాగరమున ముంచి తోకనార్పి
జానకీశు గనగ బోవగా మది నెంచి
హనుమ జూచె మండు లంక నపుడు

677. లజ్జితుండయ్యె హనుమ తాజేసినట్టి
కార్యము దలంచి కోప వివశుడు గురువు
నైన జంపును బుద్ధిమంతులను దిట్టు
కోపరహితుడై ధీమంతు డవనిలోన

678. నేను గావించినట్టి యజ్ఞాన కార్య
మునకు జనక పుత్రిక బలియయ్యెననుచు
హనుమ శోకతప్తుండౌచు నేను యింక
ఏ ముఖంబున రాముని, రవిజుగాంతు

679. ననుచు చింతతుడై యున్న హనుమకు కుడి
నేత్ర భుజములు శుభసూచకముగ నెరె
హృదయ మెంతోప్రసన్నమై దోచె నంబ
ర చరులాడు మాటలు కర్ణములకు సోకె

680. ఎంత యాశ్చర్యకరము వాతాత్మజుండు
లంక గాల్చగ భవనము లెల్ల దగ్ధ
మైన నొక విభీషణు భవనమ్ము మాత్ర
మతి సురక్షితముగ నుండె వింత గాను

681. ధర్మ రూపిణి పతివ్రత ధరణి తనయ
క్షేమముగ నుండెనని సిద్ధ చారణులను
కొనెడు అమృతోపమానములైనపల్కు
లన్ విని యుప్పొంగె మారుతి యుల్ల మలర

682. తల్లినొకమారు కన్నుల గాంతుననుచు
వనమునకు జేరి శింశుప వృక్షఛాయ
నింతయు వసివాడక యున్న నవనిసతను
జూచి యానంద పులకితుడయ్యె హనుమ

683. లోకమాతకు సీతకు మ్రొక్కి తల్లి!
క్షేమముగ నున్న మిమ్మునే జూచినాడ
భాగ్యశాలిని సెలవిమ్ము బోయివత్తు
కీశ పతులతొ నేతెంత్రు దాశరధులు

-- టంగుటూరి మహాలక్ష్మి