సుమధుర రామాయణం

సుమధుర రామాయణం -- యుద్ధకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

853. వైరి తమ్ముడు వైరియే న మనకు
ననుచు బల్కిరి, శాస్త్ర కోవిదుడు జ్ఞాని
హనుమ లేచి స్వామికి మ్రొక్కి ‘‘రామచంద్ర!
మిత్రులు వివరించిరి తమ యభిమతములు

854. స్వస్థ చిత్తముతో శంక లేక మనల
ముందు కరుదెంచె నతని రూపమును వాక్కు
నిర్మలములుగ నున్నవి మలిన చిత్తు
కనుల గనుపించు కుటిలత దాగకుండ

855. రఘుపతీ! విభీషణుడన్న దుష్టవర్త
నమును దాని పర్యవసానమున్గ్రహించి
ధర్మమును జెప్ప దలిమె దుర్భాషలాడి
వచ్చె సమయము దెలిసి మిమ్మాశ్రయింప

856. మీ పరాక్రమశక్తి సామర్థ్యములను
యెరిగి వాలినిం జంపి సుగ్రీవు వాన
రాధిపుని జేసితి వని రాజ్యాభిలాష
వచ్చియుండును స్వామి మీ చిత్తమింక’’

857. రామచంద్రుడు హనుమ ప్రసంగమునకు
మిగుల సంతుష్టుడై హరి వరులతోడ-
‘‘మైత్రినిం గోరివచ్చె విభీషణుండు
నతని కిచ్చెద నాశ్రయం’’ బనుచుబల్కె

858. ‘‘రామ! రుూతడన్నను విపత్సమయ మందు
వదలి వచ్చెను యికమన యెడల నేమి
యుండు నభిమాన మెప్పుడే ద్రోహము దల
పెట్టునో’’యని సూర్యనందనుడు బల్కె

859. రామచంద్రుడు మరియొకమారు కవుల
జూచి మందహాసముతో సౌమిత్రి కనియె
చాస్తజ్ఞ్రానియు పెద్దల సేవజేయు
నతడు మన సుగ్రీవువలెనె మాటలాడు

860. గలదు సూక్ష్మాంశ మొక్కటి చక్రవర్తి
కెపుడు జ్ఞాతుల పొరుగు రాజులె ప్రధాన
శత్రువుల్వీరిలొ మనము జేర మింక
లంకనుం గోరమని విభీషణుడెరుంగు

861. ఇతని కాశ్రయమిచ్చిన శత్రు పక్ష
మందుగల విభేదమ్ములు దెలియు మనకు
వైరుల జయించుట సులభవౌను గాన
వుచితమే రుూ విభీషణుజేర్చుకొనుట

862. ఇలను భరతుని వంటి తమ్ములును లేరు
దశరధాత్మజులను బోలు సుతులు లేరు
మిత్రనందను వంటి మిత్రులును లేరు
ఇది నిజమ్మని వాక్రుచ్చె నినకులుండు

863. శంకవలదు సుగ్రీవ! విభీషణుండు
సర్వ గంధర్వ యక్షరాక్షస గణముల
నంత మొందింప జాలుదునని యెరుంగు
శరణమనువాని గాచుట నావ్రతంబు
864. రావణుడు వచ్చి యిపుడునన్ శరణువేడ
ఇచ్చెద నతనిక్షమియించి యభయదాన
మనగ, సూర్యజు డంజలి మోడ్చి ‘‘సఖుడ!
నిన్ను బొగడగ నేర్తునా నేను రామ!’’

865. అని విభీషణుడిప్పటినుండి మనకు
మిత్రుడేనని యెగసెను మింటికి రఘు
రాము నభయము నీకు లభించెనని వి
భీషణుని దోడ్కొనుచు వచ్చె విభుని కడకు

866. అనుచరులతొ విభీషణుం డవనిజపతి
పాదముల వ్రాలి కరుణాసముద్ర! రామ!
సర్వభోగముల వదలి వచ్చినాడ
ధర్మవిగ్రహ! నీ శరణమ్ము గోరి

867. రాఘవుడు దయాస్నేహ పూర్ణమ్ములైన
వీక్షణమ్ముల నతని వీక్షించి జెప్ప
వయ్య లంకలోగల విశేషముల ననగ
రాఘవా! రావణుడు లోక కంటకుండు

868. ఆయనకు తమ్ముడును నాకు నగ్రజుండు
కుంభకర్ణు డాతడు యుద్ధ్భూమి నుండ
శిరము నెత్తగ లేడు దేవేంద్రుడైన
నంతవాడె సేనాని ప్రహాస్తు డరయ

869. గలడు మేఘనాథుడు పెద్ద కొడుకు రావ
ణుని కభేద్య కవచుడై యదృశ్యరూప
మున రణమొనర్చు నింక మహోదరాది
యోధులెందరొ గలరు సేనాధిపతులు

870. వీరితోజని మాయన్న దిక్పతులను
సర్వదేవగణముల జయించి వచ్చె
నని విభిషణు డన్న శక్తియును సైన్య
బలము విశద పరచె రామభద్రు కపుడు

-- టంగుటూరి మహాలక్ష్మి