సుమధుర రామాయణం

కిష్కింధకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

277. దాశరధి తోడ హనుమంతు‘‘డో మహాత్మ!
మీరలీవనములలోన దిరుగ నేమి
కారణమ్మన సౌమిత్రి హరవరునకు
తమ కథ వినిపింప దొడగెమొదటి నుండి

278. ‘‘వినుము! వానరోత్తమ! ధర్మవత్సలుండు
దశరధుండను పేరిట ధరణివిధుడు
గల డతని కొడుకుల నగ్రజుండు నితడు
రామనాముడు వినుతపరాక్రముండు

279. జనకు వాక్పాలనంబుకై
వనిగ రాగ
నిలజ భార్యయు తమ్ముడ లక్ష్మణుండ
ఇద్దరము వెంట వచ్చితి మీధరేశు
పత్ని నెవ్వడొ రాక్షసుడపహరించె

280. మేము గహనావళుల రమణీలలామ
కొరకు వెరకుచు శాప కారణము చేత
రాక్షసుండైన గంధర్వు శాపముక్తు
జేయ నతడు దెల్ప సుగ్రీవుచెలిమి జేయ
గోరి వచ్చితి మాతని గలసి కొనగ

281. సకల సద్గుణ సంపన్నుడైన దశర
ధేశు పాదముల కవనీశులు కిరీట
ములతొ మ్రొక్కుదురా సార్వభూము పుత్రు
డిపుడు మీ రాజు సాయమర్థించె ననఘ!’’

282. బాష్పపూరిత నేత్రుడై లక్ష్మణుండు
బల్క పవమాన నందనుం’’ డనఘలార!
మీరలు జితేంద్రియులు సూర్యపుత్రు భాగ్య
వశత నేతెంచితిరి మహావీరులార!

283. మాన్య మూర్తులార! మా రాజు వృత్తాంత
మెల్ల మీకు విశద పరచువాడ
అన్న వాలిచేత నపహృత దారుడై
పురము వెడల దరుము వెతలనంది
284. ఋష్యమొక నగంబున నున్నవాడు
తమ కవశ్యము జనకజ జాడ నరయ
సాయ పడగలం డతనికి కార్యమొండు
గలదు మీతోడ రఘవంశ కలితులార!

285. లక్ష్మణుం డన్నతో రామచంద్ర వీరి
సాయమును పొంది వీరికి సాయ పడుద
మగ్రజా యన రాముడు మంచిదనగ
అసలు రూపము ధరియించి హనుమ వారి

286. నంస దేశమందు నినవంశజుల నుంచి
వుగ్ర జవముతోడ జనియె హనుమ
సూర్యనందనుండు చరియించు నెలవుకు
జేరి వారి డించి రవిజుడాసి

287. ‘‘వానరేశ్వర! ఈ మహానీయమూర్తి
రామనాముడు రఘుకుల రాజవరుడు
లక్ష్మణునితొ వచ్చెను నీతొ చెలిమి గోరి
జనుము వారల పూజింపు మనియె హనుమ

288. పవన నందనుండు దెల్ప సుగ్రీవుడు
భయము వీడి స్వస్థ చిత్తుడౌచు
సూర్య వంశజులకు స్వాగతమును బల్కి
మధుర భాషణముల నర్చ సల్పి

289. ‘‘రామచంద్ర! నీవు నాతోడ సఖ్యంబు
గోరు దేని యిదుగొ నాకరంబు
సాచినాడ’’ నన్న కోసలాధీశుడు
అందుకొనియె తనకరంబు సాచి

290. అంత హనుమంతుడగ్నిని వెలుగ జేయ
వనసుమంబుల నర్చించి వారి నడుమ
పావని నిలువ నగ్నికిం ప్రదక్షిణించి
సఖ్యము ఘటించుకొని రగ్ని సాక్షికముగ

291. రామ రవిజుల సఖ్యసంపన్నవేళ
జానకికి లంకలో శుభసూచకముగ
వామ నేత్రమదరె వాలి రావణులకు
నదరె నట్టె యశుభ సూచకముగ నపుడె

టంగుటూరి మహాలక్ష్మి