Others

సుమధుర రామాయణం.. (సుందరకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

636. అతుల బలవంతుడనిలసుతుండు నొక్క
కొండ బెకలించి వారల పైకి విసరె
రూపములు బాసి యంతక పురికి జనిరి
వార్త హతశేషు లెరిగింప రావణుండు

637. యోధవరులైన సేనాధిపతుల నంపె
వార లేవురు హనుమచే నిహతులైన
తొట్రుపాటును గప్పు కొంచుసర భర్త
యెదుట నున్నట్టి అక్షకుమారుజూచె

638. తండ్రి చూపును గ్రహించి ధనువు నంది
తపబలమ్మున సాధించినట్టి దాని
వేగమున మనఃసదృశమై నేగు నట్టి
రధముపై జనె రావణ పుత్రు డపుడు

639. యమునివలె నున్న నా యాంజనేయు గాంచి
జంకు బుట్టగ ఇనంతలో ధైర్యమూని
నిశిత శరములు మూడు సంధించి హనుమ
శిరముపై నేసి బాణవర్షంబు గురిసె

640. తూర్పుకొండపైని వడగండ్ల వర్షము
గురిసిన విధముగ హరిప్రభుండు
దోచె వాని యుద్ధకౌశలంబును మెచ్చి
నిప్పుకణమటంచు నెంచి మదిని

641. పిన్న వాడని వీని నుపేక్షసేయ
నగ్నివలె రాజుకొను నంచు హనుమ యక్షు
శరములన్నియు నవలీల దప్పుకొనుచు
రధము జూర్ణము సేయ నారజనిచరుడు

642. ఖడ్గ హస్తుడై హనుమంతు పైకి రాగ
పన్నగంబును గరుడుడు బట్టునట్లు
కాలు సేతులు నొకటిగ గలిపి బట్టి
గిరగిరం దిప్పి భూమిపై విసరివేసె

643. మాంసపు ముద్దయై యక్షు డుసురు విడిచె
వీర పుత్రుడు నక్షకుమారు మరణ
వార్త లంకేశునకు దుఃఖ సంభ్రమముల
గలుగజేయ నింద్ర జిత్తపుడు లేచి
644. తండ్రి యనుమతిగొని భక్తిపూర్వకముగ
వందనములిడి పొంగు సముద్రమట్టు
సింహములు బూన్చి యిచ్ఛానుసార మరుగు
రధము నెక్కి కపీంద్రుపై దాడి కరిగె

645. వచ్చునా డింద్రజిత్తనిబోల్చి హనుమ
మేను పెంచుచు సింహనాదమ్ము జేసె
ఆంజనేయుని జూచి దేవేంద్రవైరి
యితడు సామాన్యుడౌ కపిగాడటంచు

646. కరకుమొనతొ బంగారు రెక్కలుగల
విషపు శరములు హనుమపై వేయనపుడు
బాణముల గురి క్షణములో దప్పుకొనుచు
యెగసె నాకాశమున కంజనీసుతుండు

647. అప్పు డింద్రజిత్తు అసమాన బలవంతు
డితని గట్ట నితర యస్త్ర చయము
లేవి జాలవంచు జలజాసనాస్తమ్రు
వేయ, బద్దుడయ్యె వాయుజుండు

648. చేష్టలుడిగియున్న హనుమను రాక్షస
భటులు తాళ్ళగట్ట జూచి యితర
బంధనముల సృష్టికర్తాస్త్ర బంధము
వీడునని యెరుగరు వీరలంచు

649. చింతితుండయ్యె నింద్రారి దైత్యకులము
కీస్థితింజూడ కీడువాటిల్లు ననుచు
నంత హనుమను రాక్షస భటులు రావ
ణాసురు కడకు ద్రోసుక జనిరి వేగ

650. వాయునందను స్పృశియించి వనజ గర్భు
నస్త్ర మేగగ భటులతొ ననిలజుండు
రాక్షసేశ్వరు జూచు తలంపుతోడ
బంధితుని యట్లు నటియించి బోదొడంగె

651. ద్రోయుచును బొడుచుచు నాంజనేయు భటులు
రాక్షసేశ్వరు నెదురుగ నిల్పిరంత
దేవతా పరివృతుడైన ఇంద్రు రీతి
సచివ మండలి మధ్య పౌలస్త్యుడొప్పె

టంగుటూరి మహాలక్ష్మి