సుమధుర రామాయణం

సుమధుర రామాయణం.. (యుద్ధకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1226. ఓషధీ నిలయమ్ము ద్రోణాద్రి దెచ్చి
ముందునుంచ సుషేణు డౌషధుల లక్ష్మ
ణునకు వాసనజూప చైతన్యవంతు
డై కనులు విప్పె నూతన కాంతితోడ

1227. తమ్మునక్కున జేర్చి దాశరధి పులక
గాత్రుడయ్యె వానరులు సంతోష చిత్తు
లై జయ నినాదములతోడ గంతులిడిరి
రామ కోపాగ్ని వైరిపై ప్రజ్వలించె

1228. కపుల సింహగర్జనలను లంక యెదరె
రావణుడు రోషమున దశగ్రీవములను
కమలభవుదత్త దివ్య రధమ్మునెక్కి
వెడలె రవిబట్టు రాహుగ్రహంబురీతి

1229. రామ రావణ యుద్ధ మారంభమయ్యె
రామనగము రావణుబాణ వర్షమునను
రావణగిరి రామ శరపరంపరలను
నిండ లోకవాసులు జూచి చకితులైరి

1230. అనుపమానవౌ రామ రావణుల సంగ
రమ్ము జూచుచు యట్టులె నిలచిరంత
రెండు సేనలు రిపులతో పోరమరచి
జూచిరామహాయోదుల సమరమపుడు

1231. రధముపై రావణుడు ధరాతలముపైన
రాఘవుడు నిల్చి యుద్ధమొనర్చ జూచి
మాతలిని బిల్చి ఇంద్రుడు రధముతోడ
నంప మాతలి రఘురామ ముందునిల్చి

1232. రామ! నీకొరకింద్రుడు రథమునంపె
దీనిపై నెక్కి శత్రువున్హతమొనర్చు
యనుచు బల్కెమాతలి వినయమ్ము తోడ
దాశరధి రథమును సమీపించి భక్తి

1233. స్యందనమ్ముకు ప్రదక్షిణ జేసి మ్రొక్కి
ఉల్లసమ్ముననధిరోహణమ్మొనర్చి
రావణుందాకె కల్పాంత రుద్రుడౌచు
రాక్షసానీకములు భీతిజెంది జూడ

1234. చాపమున బాణమున్ దొడుగుట విడుచుట
దెలియరాకుండ రామరావణులు యుద్ధ
నిపుణులిర్వురు శత్రు నిర్జితులునౌచు
ఇంద్ర వృత్త్రులవలె బోరొనర్చిరపుడు

1235. రామబాణ ప్రచండ వేగమునకు దశ
గ్రీవుని పతాక చాపధ్వజములు విరిగె
శక్తి గోల్పడి రధముపై గూలబడగ
చోటు దప్పించి సారధి దవ్వు కరిగె

1236. తిరిగి చైతన్యవంతుడై దశముఖుండు
సారధిని మందలించగా స్వామి నా దు
విధిని నిర్వహించితి సమయోచితముగ
మెచ్చుకొని యాదరముగ సారధిని జూచి

1237. సత్యరించె ముంజేతి కంకణ మొసంగి
నూతన శరాసన ధ్వజకేతనముల
నలరియున్న బంగారు రధమ్మునెక్కి
సాగె యుద్ధ్భూమికి రాక్షసేశ్వరుండు

1238. రణపరిశ్రాంతుడైయున్న రామభద్రు
గగనమున నుండి జూచి యగస్త్యవౌని
రఘువరుని చెంత కరుదెంచి’’ రామ! రామ!
వత్స! వినుము రుూ మంత్రము శివకరమ్ము

1239. అతిసనాతనమిది శత్రు నాశనకర
మతి రహస్యమీ యాదిత్య హృదయమనఘ
దీని పఠియింపు ముమ్మారు తరణితేజ’’
యంచు నా మంత్రము నుపదేశించి జనియె

1240. దాశరధి యంతట నగస్త్య ఋషివరుండు
తనగు దెల్పిన ఆది త్సహృదయమపుడు
శుచియై పఠించె శ్రద్ధగ మూడుమార్లు
జయకరము శత్రు నాశకరమ్ము దాని

1241. సూర్య మండలాన్తర్వర్తి పూషణుండు
ముదిత హృదయుడై రాఘవా! మూర్ఖరావ
ణునకు కాలమాసన్న మయ్యెనిక తడవు
సేయక వధింపుమనె దర్శనమ్మొసంగి

1242. శార్‌ఙ్గ హస్తుడై రఘుకులవర్ధనుండు
నారి సారించ నెదురొచ్చె రావణుండు
తుముల సంగ్రామమిరువురి మధ్య జరిగె
విజయకాంక్షతో పోరిరి వీరవరులు

1243. రాక్షసేశ్వరు బాణవర్షంబు కెదురు
నిల్చె చిరునవ్వుతో రఘువల్లభుండు
రామబాణము రావణు ధనువుద్రుంచె
నింకొక ధనువందుకొని లంకేశ్వరుండు

1244. రామభద్రు నిశిత శరములను గప్పె
రాఘవుండగ్ని సమబాంములతొ నన్ని
శరములను దగ్ధముంజేసిన శని వంటి
నాశుగమ్మేయ తెగిపడె నసురు శిరము

1245. తక్షణము మొల్చె నాస్థానమందె శిరము
నూరుమారులు ఖండించె రఘువరుండు
రావణు శిరమ్ము లెప్పటియెట్లె మొల్చె
రామభద్రుడు యోచింప సాగెనంత

టంగుటూరి మహాలక్ష్మి