సబ్ ఫీచర్

మండు వేసవిలో మేని సొగసు ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్చి ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. ఇం ట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే వేసవిలో శరీర సంరక్షణ సులభత రమవుతుంది. ఎండలబారి నుంచి కళ్లు, చర్మం, శిరోజాలను కాపాడుకోవడం, డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం పొందడం ఎలాగో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. మన శరీరంలో నీటి శాతం తగ్గడమే డీహైడ్రేషన్. ఇది ఒక్కోసారి ప్రాణాలమీదకు తెస్తుంది. కళ్లు తిరగడం, నీరసపడడం, స్పృహ కోల్పోవడం జరుగుతుంది. చెమట కారణంగా మన శరీరంలో సోడియం, పొటాషియం మూలకాల సమతూకం దెబ్బతింటుంది. డీహైడ్రేషన్‌కి లోనవకుండా ఎప్పటికప్పుడు దాహం తీర్చుకోవాలి. టీ, కాఫీలు, గరం మసాలా వంటివి తగ్గించి బార్లీ, కొబ్బరి నీరు, మజ్జిగ తీసుకోవాలి. మన శరీరం విసర్జించిన నీటికి సరిసమానంగా సమయానికి మంచినీరు తీసుకుంటుండాలి. పళ్లరసాలు, ఎలక్రోలైట్ ద్రవాలతో డీహైడ్రేషన్ నుంచి బయటపడవచ్చు. ఎండాకాలం బయటికి వెళ్లాలంటే కళ్లు, చర్మం, జుట్టు అల్ట్రావయొలెట్ కిరణాల బారిన పడకుండా జాగ్రత్తపడాలి.
నయనం ప్రధానం..
సూర్యుడి నుంచి వెలువడే అల్ట్రా వయొలెట్ కిరణాల రేడియేషన్‌తో కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. సన్‌గ్లాసెస్‌తోపాటు అధునిక కాంటాక్ట్ లెనె్సస్ కూడా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. నాణ్యమైన సన్‌గ్లాసెస్ వినియోగిస్తే రేడియేషన్ నుంచి మన కళ్లకు రక్షణ కలిగినట్టే. పెద్దలకంటే పిల్లలు, టీనేజర్లు ఎండలో ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది. కలర్‌ఫుల్ డిజైన్స్, చాలా మోడల్స్‌తో లభ్యమయ్యే సన్‌గ్లాసెస్ వినియోగించడం మర్చిపోకూడదు. సన్‌గ్లాసెస్ ఎంతవరకు రేడియేషన్‌ను నిక్షిప్తం చేసుకుంటాయో మన కళ్లను ఎలా కాపాడుతాయో ముందే పరీక్షించుకోవాలి.
చర్మ సంరక్షణ..
ఎండ ప్రభావంతో చర్మం రంగుమారడం, నల్లటి మచ్చలు ఏర్పడడం సహజం. నాణ్యమైన సన్‌స్క్రీన్ లోషన్స్ వాడితే హాని కలిగించే సూర్య కిరణాలకు దూరంగా వుండొచ్చు. ముఖానికి స్కార్ఫ్ సహా చేతులకు, కాళ్లకు గ్లౌజులు, సాక్సులు వాడడం మరిచ్చిపోవద్దు. ఇక, మండే ఎండల్లో మనం తీసుకునే నీరంతా చెమటరూపంలో బయిటికిపోతుంది. వేసవిలో రోజుకు 8నుంచి 10 గ్లాసులైనా నీరు తాగాలి. మంచినీళ్లతోపాటు వివిధరకాల పానీయాలు, పండ్ల రసాలు, డెయిరీ ఉత్పత్తులను క్రమం తప్పకుండా తీసుకుంటుండాలి. ఎండ తాకిడితో చర్మగ్రంథులు తెరుచుకుని వాటిలో మురికి చేరుతుంది. చర్మం పాడవడం, చెమటకాయలు, పింపుల్స్ రావడం జరుగుతుంది. రోజ్‌వాటర్‌ని వాడుకుని చర్మాన్ని కాంతులీనేలా కాపాడుకోవచ్చు. మహిళలు వీలైనంత మేకప్‌కు దూరంగా వుండి వాటర్ బేస్డ్ మేకప్ ప్రొడక్ట్‌లు, ఐలైనర్, మస్కారా వాడుకోవడం శ్రేష్టం. చర్మంపై మృతకణాలను తొలగించుకోవాలి. కీరా, రోజ్‌వాటర్, గంధం, వేపాకులతో చక్కని కూలింగ్ ప్యాక్‌లు తయారుచేసుకుని చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపచేసుకోవచ్చు. నిత్యం వాడే కాస్మొటిక్స్ అల్ట్రావైలట్ కిరణాలను నివారించగలిగేవిగా వుండాలి. ఎండలోకి వెళ్లడానికి పది పదిహేను నిముషాల ముందు సన్‌స్క్రీన్ లోషన్ వంటికి రాసుకోవాలి. వేసవిలో కాటన్ దుస్తులు ధరించినట్టయితే అన్ని విధాలా మంచిది.
శిరోజాలను అందంగా ముడివేయండి ..
వేసవి కాలంలో శిరోజాల సంరక్షణకు మెళకువలు పాటించడం అవసరం. పొడవైన శిరోజాలను కూడా టాప్‌నాట్, పోనీటెయిల్‌గా వేసుకుంటే హాయిగా వుంటుంది. శిరోజాలు పాడవకుండా మంచి కండిషనర్లను వాడాలి. హెన్నా మంచి కండిషనర్‌గానే కాక హెయిర్ మాస్క్‌గాను పనిచేస్తుంది. స్విమ్మింగ్ పూల్‌లో వాడే క్లోరిన్ వల్ల జుట్టు పాడయ్యే అవకాశాలు ఎక్కువ. జుట్టును కాపాడుకోవడానికి కండిషనర్సే మార్గం. ఈ కాలంలో వారానికి కనీసం మూడుసార్లయినా కండిషనర్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయకుంటే తలపై చెమట ఏర్పడి మలినాలతో దురదలు రావడమే కాదు. శిరోజాలు రాలడం కూడా జరుగుతుంది. తాజా కూరగాయలు, పండ్లు, సలాడ్స్ తింటే శిరోజాలకూ మేలు జరుగుతుంది.

-మురళి