జాతీయ వార్తలు

2010-11 బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు
న్యూఢిల్లీ, మార్చి 11: నేషనల్ హెరాల్డ్ కేసులో 2010-11 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాలెన్స్‌షీట్‌ను అందజేయాల్సిందిగా భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సి)కి ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీతో పాటు ఐదుగురు నిందితులుగా ఉన్నారు. అసోసియేట్ జర్నల్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఏజెఎల్)కు సమన్లు ఇచ్చారు. 2010-2011 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాలెన్స్ షీట్‌ను వచ్చే వాయిదా నాటికి సమర్పించాల్సిందిగా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ లలీన్ ఆదేశించారు. ఈమేరకు మూడు పేజీల సమన్లు ఇచ్చారు. కాంగ్రెస్, ఎజెఎల్‌లు విడివిడిగా రెండేసి బ్యాలెన్స్‌షీట్లు అందజేయాలని స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ ఆదాయ వ్యయాలు, చెల్లింపుల వివరాల రసీదులు పరిశీలించాల్సిందిగా పిటిషనర్, బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి కోర్టును అభ్యర్థించిన మీదట ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. 2010-11,2011-12, 2012-13 సంవత్సరాలకు సంబంధించి కాంగ్రెస్, ఏజెఎల్‌ల నుంచి ఆర్థిక వివరాలు తెలుసుకోవాలని పిటిషనర్ కోరారు.