AADIVAVRAM - Others

సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందవరం మహారాజు రాణిగారితో, వారి ఏకైక ముద్దుల కొడుకు వీరప్రతాప్ చంద్రునితోపాటు నల్లమల అడవులలో తపస్సు చేసుకొంటూ ఆశ్రమ జీవితం గడుపుతున్న స్వామి కృపానందం దగ్గరికి వచ్చారు. కృపానంద స్వామి వారికి తన శిష్యుల ద్వారా గొప్ప అతిథి మర్యాదలు జరిపించారు. వారు దైవాంశ సంభూతులు అని చెప్పగా విని మహారాజుగారు సకుటుంబ సపరివారంగా విచ్చేశారు.
రెండు రోజులు ఆశ్రమంలో గడుపుదామని వచ్చిన మహారాజు స్వామివారు ఇంకో రెండు రోజులుండి వెళ్లమనేసరికి అక్కడే ఉండిపోయారు తన రాచకార్యాలు రద్దు చేసుకుని. మూడవ రోజు వీరప్రతాప్ చంద్రుడు మహారాజు గారి దగ్గరికి వచ్చి తనకు అత్యవసర కార్యం ఉందని వెళ్లడానికి అనుమతిని ఇమ్మని కోరాడు.
‘నాయనా ప్రతాప్! ఈ ఆశ్రమానికి పెద్ద నేను కాదు. శ్రీ కృపానంద స్వామివారు. వారి అనుమతి తీసుకుని బయలుదేరు’ అని మహారాజుగారు అన్నారు పుత్ర వాత్సల్యంతో.
ఉదయాన్ని గురువుగారిని అనుమతి కోరాడు.
‘ఏం నాయనా! ఈ ఆశ్రమం నీకు విసుగు కలిగించిందా? ఇంకా రెండు రోజులు విశ్రాంతి తీసుకొని పోదువుగాని’ అన్నారు స్వామి చిరునవ్వుతో - అనుమతిని నిరాకరిస్తూ.
‘లేదు గురువుగారు! నాకు కొన్ని అత్యవసర రాచకార్యాలున్నాయి. రేపు నేను మా రాజ్యంలో ఉండి తీరాలి!’ వినయంగా ప్రార్థించాడు.
‘ఏమిటో అవి?’ కోపంగా అడిగారు స్వామి.
‘ఆనందవరం యువరాణి స్వయంవరం ఎల్లుండి ఉదయం ఉంది. రేపు నా పరివారంతో అక్కడికి బయలుదేరి వెళ్లాలి. ఈ రోజు సాయంత్రానికి నా రాజ్యానికి వెళితే కాని నేను అన్ని ఏర్పాట్లు చేసుకోలేను. నా కోసం నా మిత్రులు ఎదురుచూస్తూ ఉంటారు’
‘జీవితంలో ఏదీ అంత ముఖ్యమైన పని కాదు. ఈ రోజుండి రేపుదయం బయలుదేరు’ స్వామి నొక్కి చెప్పారు.
‘కుదరదు గురుదేవా! రాచకార్యాలు ముందే నిర్ణయించబడి ఉన్నాయి. ఆ మంత్రాంగం ప్రకారం నడుచుకోక తప్పదు. అందుకని క్షమించి మీరు నాకు అనుమతి ప్రసాదించండి’ వేడుకున్నాడు వీరప్రతాప్.
‘మహారాజా నాకైతే ఇష్టం లేదు. ఆపైన అతడి ఇష్టం. దైవనిర్ణయం ఎలా జరగాలో అలా జరుగుతుంది’ అంటూ స్వామివారు నిష్క్రమించారు. ఇంకో మాటకు ఆస్కారం లేకుండా. సాధారణంగా ఆయన మాటకు ఎవరూ ఎదురు చెప్పరు. యువరాజు తన మాటని ధిక్కరించే సరికి కించిత్తు కోప్పడ్డారు.
యువరాజు రాజ్యానికి బయల్దేరాడు.
సాయంత్రం మహారాజు రాణిగారితోపాటు స్వామివారి దర్శనం కోసం వచ్చారు.
‘మహారాజా! మీరు ధైర్యంగా ఉండాలి. మీకు ఒక దుర్వార్త రాబోతున్నది’ అని చెప్పి ధ్యానంలోకి వెళ్లిపోయారు స్వామి కృపానంద.
కాసేపటికి వార్తాహరుడు వచ్చి ఒక దుర్వార్త మహారాజుకు అందించాడు. వీరప్రతాపుడు ప్రయాణిస్తున్న రథం మీద కొండచరియలు విరిగి పడి రథం నుగ్గునుగ్గు అయిందట. రథంలో వున్న వారెవరూ బ్రతికే అవకాశం లేదట.
మహారాజుకు రాణిగారికి దుఃఖం ముంచుకొచ్చింది.
‘ఏం స్వామీ! నువ్వు దేవుడివని నిన్ను నమ్ముకుని వస్తే మాకు పుత్రశోకం కలిగిస్తావా? ఇదా నీ సేవ చేసినందుకు మాకిచ్చే బహుమానం?’ కోపంగా అడిగాడు మహారాజు.
‘మహారాజా! మీకో దేవరహస్యం చెప్పనా? నిజానికి మీ యావత్ కుటుంబం ఈ రోజు ప్రమాదంలో మరణించాల్సి ఉంది. అందువల్లనే నాలుగు రోజులు ఆశ్రమంలో ఉండి పొమ్మని మిమ్మల్ని అర్థించాను. ఆశ్రమ చరిత్రలో ఎప్పుడూ ఎవరినీ ఉండమని నేను అడగలేదు. వచ్చిన వారు దర్శనం చేసుకొని తమ పని కాగానే వెళ్లిపోతారు. మిమ్మల్ని ఆపి అందరినీ రక్షిద్దామనుకున్నాను. యువరాజు ఉడుకు రక్తం నిలవనీయలేదు’ అంటూ వివరించారు.
దాంతో నిర్ఘాంతపోయిన మహారాజు, రాణిగారలు ఆయన పాదాల మీద వాలిపోయారు.
‘కృతజ్ఞతలు! మిమ్మల్ని నమ్ముకున్నాం! మీరే మమ్మల్ని రక్షించాలి! మీకు జీవితాంతం బానిసలం’ అంటూ మహారాజు కన్నీరు పెట్టుకొన్నారు.
‘మహారాజా! మరణించిన మీ కుమారుడిని వెనక్కి తీసుకురాలేక పోయినా, మీకు మరొక మగ సంతానం కలిగే వరాన్ని ప్రసాదిస్తున్నాను’ అంటూ ఆశీర్వదించి రెండు పండ్లు వారి చేతుల్లో పెట్టారు.
‘తమరి దయ’ అంటూ కళ్లకద్దుకున్నారు రాజు దంపతులు దుఃఖాన్ని దిగమింగుకుంటూ.

-వియోగి