బిజినెస్

సన్ ఫార్మాకు యుఎస్‌ఎఫ్‌డిఎ హెచ్చరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్‌ఎఫ్‌డిఎ) నుంచి దేశీయ ఔషధరంగ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఓ వార్నింగ్ లెటర్ అందుకుంది. గుజరాత్‌లోని హలోల్ ఉత్పాదక కేంద్రంలో తయారవుతున్న ఔషధాల విషయంలో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ఈ లెటర్‌లో సన్ ఫార్మాను యుఎస్‌ఎఫ్‌డిఎ హెచ్చరించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ ఉత్పాదక కేంద్రంలో యుఎస్‌ఎఫ్‌డిఎ అధికారులు తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజా హెచ్చరికలు. కాగా, మరోసారి తయారీ ప్లాంట్‌ను సందర్శించాలని యుఎస్‌ఎఫ్‌డిఎను సన్ ఫార్మా కోరాలనుకుంటోంది. ఈ మేరకు శనివారం సన్ ఫార్మా తెలియజేసింది.