మాతో - మీరు

జ్ఞాపకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండ్లు, తిళ్లు, పల్లె రుచుల గురించి గోపాలంగారి వివరణ నోరూరించింది. మా బాల్యం జ్ఞాపకం వచ్చింది. పులిచింత అని ఆయన చెప్పినది సీమచింత కాబోలు. ఇవి ఆయన వర్ణించినట్టే ఉంటాయి. గింజ చుట్టూ తెల్లని తినే పదార్థం. ఇవి పెరిగిన కొద్దీ రింగులాగ చుట్టుకు పోతాయి. ఇక ‘అమృతవర్షిణి’లో మహా విద్వాంసుల మరపురాని జ్ఞాపకాల్ని గొప్పగా వివరించారు. రోజూ కలలో కనిపించి చంపడానికి ప్రయత్నించే మనిషి చిత్రం గీయిస్తాడు స్టీవెన్స్. అలాంటి మనిషే స్టీవెన్స్ చావుకి కారణం కావడం ఆశ్చర్యమే కాదు అద్భుతం కూడా.
-ఎస్.కృష్ణ (కొండయ్యపాలెం)
సత్యం
ఇతరులతో పోల్చుకొని చాలామంది బాధపడుతూ ఉంటారు. కాని ప్రతి జీవితానికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుందని ‘ఓ చిన్న మాట’గా చెప్పిన విశిష్ట సత్యం ఆకట్టుకుంది. 86 ఏళ్ల బామ్మ 65 సంవత్సరాలుగా సేకరించిన 20 వేల బొమ్మల కొలువు భలేగా ఉంది. ఇందిరాగాంధీ ఏలుబడిలో కూడా కాశ్మీర్‌లో అతి తక్కువమంది పోలింగ్‌లో పాల్గొంటే ఓట్ల సంఖ్య చెప్పకుండా గెలిచిన వారి పేర్లు ప్రకటించేవారు అప్పట్లో. ‘నీడలు’ కవితలో ‘ఏదో ఒకనాడు కొన్ని వౌనాలు పగులుతాయి. కొన్ని నిశ్శబ్దాలు శబ్దిస్తాయి. కొన్ని జ్ఞాపకాలు చిట్లుతాయి’ అనడం బాగుంది.
-పి.ఎస్.లక్ష్మి (బృందావనం)
ముఖతః
ఏదైనా గురు ముఖతః నేర్చుకోవాలని హిందువుల నమ్మకం. కాని కంప్యూటర్ ముందేసుకుంటే ప్రపంచంలోని ఏ విషయం అయినా తెలుసుకోవచ్చు. మానిటరే మాస్టారూ అంటూ భవిష్యత్తులో ఈ-లెర్నింగ్ ఎలా ఉండబోతున్నదో కవర్‌స్టోరీలో చక్కగా వివరించారు. ఈ వారం క్రైం స్టోరీ తమాషాగా ఉండి అలరించింది. నిజానికి ఈ కథలో క్రైం జరగలేదు. ఎవరూ నష్టపోలేదు. కాని ముఖ్యులు ముగ్గురూ లాభం పొందారు. తెలివైన పథకం! చౌకబేరం! అగ్నిగోళం అంగారకంలో బల్లి, పీత లాంటి కొన్ని ప్రాణులు ఉన్నట్లు శాస్తజ్ఞ్రులు కనుక్కోవడం ఒక అద్భుతం.
-ఎన్.గిరిధర్ (కాకినాడ)
గుర్తింపు
‘గుర్తింపు’ అనేది గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది. పూర్వం, కొందరు ఇప్పటికీ కూడా వివాహ శుభలేఖలలో బ్రతికున్న పెద్దవారి పేరు మీద ఆహ్వానం పంపేవారు. ఆ గౌరవం పెద్దలకిస్తే, పిన్నలకు కూడా గుర్తింపు రావడమే గాక, పెద్దవారి ఆశీర్వచనాలు, అండదండలు మనకు తెలీకుండా మనవారి వెంటే ఉండి మంచి దారిలో నడిపిస్తూంటాయి. ఇకపోతే ‘అమృతవర్షిణి’ నిత్య అరుణ కిరణాల వలె ఆనందామృతాన్ని, తెలియని ఎన్నో సంగీత, సాహిత్య నిష్ణాతుల విశేషాలను తెలియజేయడం మా అదృష్టం.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
నాదోత్సవం
సంగీత నిధి మల్లాది సూరిబాబు గారి ‘అమృతవర్షిణి’ శీర్షిక మమ్మల్ని ఎంతగానో అలరిస్తోంది. సంగీతం గురించీ.. సంగీత ప్రముఖుల అంశాలపై అందిస్తున్న వ్యాసాలు నేటి తరం వారికి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఆనాటి కీర్తనలు ఈనాటి, రేపటి తరానికి అందించే నాదోత్సవం వారంవారం మాకందిస్తున్నందుకు కృతజ్ఞతలు. సంగీతం మానవ జీవితానికి అమృతపానం లాంటిది. కుక్కర్ విజిల్, కాలింగ్ బెల్ వీటన్నింటిలో సంగీత నాదాలు ఇమిడి ఉన్నాయి. మనం ఎక్కువ వినికిడి ద్వారా బ్రహ్మానందం పొందవచ్చు. ఎందరో వాగ్గేయకారుల జీవిత సారాలు తెలుపుతున్నందుకు మరోసారి ధన్యవాదాలు.
-వీణారవళి, వాణి ప్రభాకరి
కథ
‘వసంతంలో రాలిన ఆకులు’ కథ ఫర్వాలేదు. అలాగే -చిన్నచిన్న లక్ష్యాలు పెద్దపెద్ద గమ్యాల వైపు మళ్లిస్తాయి అనడం నిజం. ‘సండే గీత’లో ఓ చిన్న శ్వాస ద్వారా చెప్పిన సంగతులు మా ఇంటిల్లిపాదినీ అలరించాయి. ‘అమృతవర్షిణి’ ఎప్పుడూ అమృతాన్ని కురిపిస్తూనే ఉంది.
-డి.వి.తులసి (విజయవాడ)
ఆగే బఢ్ తే
ఆలోచనలు ముందుకూ వెనక్కూ కదులుతుంటే తను ఆగే బఢ్ తే అంటూ ముందుకు సాగే విశేషాలు చెప్తూ గోపాలంగారు అలరించారు. ఫ్యుటిలిటీ నవలలో చెప్పినట్టే 14 ఏళ్ల తర్వాత టైటానిక్ మునక జరిగి ఉండొచ్చు. అంత మాత్రాన రచయితను భవిష్య జ్ఞాని అనలేం. అది యాదృచ్ఛికంగా కావొచ్చు. ఇక విజిపి రెసిడెన్సీ ఎదుట కదలక మెదలక నిలబడటమే ఉపాధిగా చేసుకున్న హజీజ్ కథ ఆకట్టుకొంది. బకింగ్‌హాం పేలస్ గార్డుల జీవితం దయనీయం. ఎందుకంటే అల్లరి పిల్లలు వారి గమ్ బూట్లలలో చీమలు, తేళ్లు లాంటివి పడేసినా వాళ్లు కదలకూడదు! అది రెండు గంటల నరకం!
-పి.శుభ (కాకినాడ)
నేర్చుకోవాల్సిందే
చెట్టునే కాదు ఈ సృష్టిలోని అన్ని జీవులను చూసి మనిషి నేర్చుకోవాల్సింది శక్తి సామర్థ్యాల్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలని ఓ చిన్న మాటలో గొప్పగా చెప్పారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో శత్రు భావంగల దేశాన్ని బహిష్కరించడం విజ్ఞత కాదు. అమెరికా, చైనాలు ఆగర్భ శత్రువులైనా ఆ రెండు దేశాల మధ్య వ్యాపార సాంస్కృతిక సంబంధాలు కొనసాగుతున్నాయి. తప్పదు మరి. అలాగే పాక్, చైనాలతో మన సంబంధం కూడా. ‘మా తెలుగు తల్లి...’ పాటను అందించిన శంకరంబాడి సుందరాచారి గారి జీవిత వ్యథ మమ్మల్ని కలచివేసింది.
-కె.సుధీర్ (శ్రీనగర్)
దూరాలు
దగ్గర ఉన్నట్టు కనిపిస్తూనే మనుషుల మధ్య దూరాలు అనంతంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితి మార్చలేమా అని ‘సండే గీత’ల ఆవేదన వెలిబుచ్చడం ఆలోచింపజేసింది. ఆవులకూ అందాల పోటీ అంటే భలే తమాషాగా అనిపించింది.
-ఎ.చైతన్య (వాకలపూడి)