AADIVAVRAM - Others

యయాతి (కథాసాగరం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీన కాలంలో జీవితం సరళంగా ఉండేది. మరో ప్రపంచం కూడా మరీ అంత దూరంగా ఉండేది కాదు. యయాతి చక్రవర్తికి వందేళ్లు వచ్చాయి. జీవితంలో అన్నీ అనుభవించాడు. వందమంది కొడుకులు. అప్పుడు మృత్యువు అతని దగ్గరకు వచ్చింది. నువ్వు సంపూర్తిగా జీవించావు. ఇక చాలు నాతో పాటురా వెళదాం అంది. యయాతి ‘నేను కేవలం వంద సంవత్సరాలు మాత్రమే బతికాను. అంతే. నువ్వేమో చెప్పా పెట్టకుండా వచ్చేశావు. కొంత సమయమివ్వాలి. నా కోరికలింకా తీరలేదు. నాకు సంపూర్తిగా తృప్తి కలగలేదు. జీవితం పట్ల మమకారం ఇంకా మిగిలే ఉంది. నాలో వాంఛలు మిగిలే ఉన్నాయి. వాటిని రేపటికి రేపటికంటూ వాయిదా వేస్తూ వస్తున్నాను. మరి నువ్వు నన్ను తీసుకుపోతే అవి అలాగే అసంపూర్తిగా మిగిలిపోతాయి’ అన్నాడు.
మృత్యువు ‘నేను వచ్చాను. వట్టి చేతుల్తో తిరిగి వెళ్లను. నీ బాధ చూస్తూ ఉంటే నాకు జాలి కలుగుతోంది. నువ్వు అంతగా అడుగుతున్నావు గనక నీకు ఇంకో వంద సంవత్సరాల వయసిస్తాను. కానీ ఎవరయినా తమ యవ్వనాన్ని నీకు ఇచ్చి నీ వృద్ధాప్యాన్ని వాళ్లు స్వీకరించడానికి సిద్ధపడితేనే అది వీలవుతుంది’ అన్నది.
యయాతి అదెంత పని అనుకున్నాడు. ఎందుకంటే ఆయనకు వంద మంది కొడుకులు. తండ్రి కొరకు ఆ మాత్రం త్యాగం చేయలేరా? అనుకున్నాడు. కొడుకులందర్నీ సమావేశపరిచాడు. మృత్యువు తన కోసం రావడం తన కోరిక మన్నించి వందేళ్లు ఇవ్వడం, తన వృద్ధాప్యాన్ని ఎవరయినా తీసుకుంటే వాళ్ల యవ్వనం తనకు సంక్రమిస్తుందని అనడం వివరించాడు. కొడుకులందరూ ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ల మనసుల్లో రకరకాల ఆలోచనలు కదిలాయి. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించిన తమ తండ్రికే జీవితం పట్ల అంత మమకారముంటే జీవితం ఇప్పుడిప్పుడే మొదలయిన తమకెంత ఉండాలి? అని వాళ్లు అనుకున్నారు. వౌనంగా ఉండిపోయారు. ఎవరూ ముందుకు రాలేదు.
అందరికన్నా చిన్నవాడయిన యయాతి కొడుకు ముందుకు వచ్చి తన యవ్వనాన్ని తండ్రికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కారణం అతను ఆలోచించాడు ‘మా నాన్న వంద ఏళ్లు బతికినా బతుకు పట్ల మమకారంతో తపిస్తున్నాడు. అంటే జీవితంలో సంతృప్తి అన్న మాటకు అర్థం లేదు. జీవితం ఎండమావి లాంటిది. జీవితం నిష్ఫలమైంది. అసలు సంతృప్తికి ఇది మార్గం కాదు. కాబట్టి నా యవ్వనాన్ని నా తండ్రికి ఇస్తాను’ అని తీర్మానించుకుని తన యవ్వనాన్ని తన తండ్రికి ఇచ్చాడు. తండ్రి వృద్ధాప్యాన్ని తను తీసుకున్నాడు.
వందేళ్లు గడిచాయి. అప్పుడు మళ్లీ మృత్యువు ప్రత్యక్షమయింది. గతించిన వందేళ్లలో, తరువాత కొడుకు నించీ తీసుకున్న వందేళ్ల జీవితంలో ప్రతి కోరికా అలాగే మిగిలి ఉంది. ఏ కాంక్షా అదృశ్యం కాలేదు. ఒక కోరిక తీరిందనుకునేంతలో ఇంకో కోరిక మొదలవుతోంది. దీన్నిబట్టి కోరికలు అనంతమన్న సంగతి, వాటికి మరణం లేదన్న సంగతి తెలుస్తోంది. అందుకే మరణం అన్న వరాన్ని భగవంతుడు మనిషికిచ్చాడన్న సంగతి యయాతి గుర్తించాడు.
ఇనే్నళ్లు తన వృద్ధాప్యాన్ని మోసిన తన చిన్న కొడుకు చిన్నతనంలోనే జ్ఞానం గ్రహించాడని తెలుసుకుని తన వృద్ధాప్యాన్ని తను స్వీకరించి మృత్యువుతోపాటు యయాతి మృత్యులోకానికి వెళ్లాడు.

- సౌభాగ్య, 9848157909